Jump to content

ఉద్భటారాధ్యచరిత్రము/విజ్ఞప్తి

వికీసోర్స్ నుండి

విజ్ఞప్తి.


శ్రీ మదుద్భటారాధ్యచరిత్ర మనెడి యీ పవిత్ర గ్రంథము తెనాలి రామ లింగ మహాకవి రచించెనని మాతండ్రి మున్నగువారివలన వినియుండి యీచరిత్రము మామూలపురుషుని దివ్యచారిత్రక మగుట నే నీగ్రంథ' సంపాదనమునకై భగీరథ ప్రయత్నము లొనర్చితిని గాని కష్టఫలే నహిపునర్న వతాంవిధ తై" అను కాళిదా సోక్తి ననుసరించి గ్రంథ సంపాదనా యాసము నిందు వివరింపక గ్రంథమును సంపా దించి ప్రకటింపఁగల భాగ్యము కలిగినందులకుఁ గలిగిన నా సంతోషము నించుక వినిపింపఁదలఁచి మనవిఁజేసికొనుచున్న నాఁడను.

ప్రప్రధమమున నీ చరిత్రము నైజాం మండలమునుండి సంపాదించి నాకొ సంగినవారు మన్మిత్రులును 'వేములపల్ల్య గ్రహాగవాస్తవ్యు లను అగు ములుగు సుబ్ర హ్మణ్యశాస్త్రిగారు. వీరి సంగీన తాళపత్ర గ్రంథము శిధిలావస్థనంది మఱియొక ప్రతి యుండినఁగాని వ్రాయుటకు వలనుపడని స్థితిలోఁ బ్రత్యంతర మొసంగినవారు అస్మ ద్వంశనూ క్తి కాయమానులును వివ్వద్వ రేణ్యులును తాడికొండ వాస్తవ్యులునగు బ్ర|| ముదిగొండ నాగలింగశాస్త్రి గారు, ఈ రెండవ ప్రతియందు 1, 3 ఆశ్వాసము లొకింత శిధిలమైయున్నవి. ద్వితీయాశ్వాస మసలే లేదు. ఈ 1, 2 ప్రకులసుప్ర గింపుతోఁ గ్" జతపడిన పద్యభాగము లట్ల నేయుంచి లభించినంత నటి కున్న దున్నటుల నొకి ప్రతి నె త్నీవ్రాసితిని. తదుపరి నే నిద్దానిసంస్కరణ మెట్లు సమకూరెడునని విచారించుచు న్నెడ ను భయశాస్త్రజ్ఞులును భోగేశ్వర సత్యవత్యూపాఖ్యానాదిగ్రంథ గచయితలును పెడన నా స్తవ్యులునగు బ్ర|| మల్లంపల్లి మల్లి కార్జునశాస్త్రి'గారు లేఖక ప్రమాదముల సవరించి లు ప్రభాగములఁ జాల వరకుఁ బూరించి దయచేసిరి. అనంత గము దీనిముద్రింపించు ప్రయత్నములో నే నున్న సంగతిని విని సరస్వతీ పత్రికాధి పతులైన మహారాజరాజశ్రీ రాజా నాసి రెడ్డి శ్రీదుర్గా సదాశి వేశ్వరప్రసాద్ బహదర్ జయంతపురం రాజాగారు గురువంశమునకు మూలకంద మైన నీయుద్బటా రాధ్యచరిత్రము నత్యంత గౌరవ భావముతోఁ దచుపత్రిక యందుఁ ప్రకటింప నుద్యు కులైయుండ నింతలో భాగ్యవశమున మాముక్త్యాల సంస్థానమును దర్శింపవచ్చిన సుప్రసిద్ధ విద్యత్కపివ రేఖ్యులును మన్మిత్రులునగు బ్ర|| వేటూరి ప్రభాకరశాస్త్రి గారు ఈయుద్భట చరిత్రమును జూచి తెనాలి రామలింగ ని కవిత్వమాటఁ గడుంగడు సంతసించి పురాతన గ్రంథములనిన సహజోత్సాహపరులగుశాస్త్రి గారు మా గ్గన ముపై గ్రంధ పరిష్కారమున కియ్యకొని చక్కగఁ బరిశోధించి కవిహృదయ మెఱింగినంత మట్టు పూరణముల సంస్కరించి మఱింత మెఱుగు పెట్టుటయ కాక పాండురంగ మాహాత్మ్యాకృతులు రచించిన రామకృష్ణుఁడే రామలింగకవి యని సిరాంతీకరించు విపుల మైన పీఠిక వాసియొసంగిరి. నా గ్రంథసంపాదనమునకుఁ దోడ్పాటు గా వించిన బ్ర||ములుగు సుబ్రహ్మణ్యశాస్త్రి గారికిని బ్ర||ముదిగొండ సొగ లింగ శాస్త్రుల వారికిని సంస్కరించి ప్రకటనానుకూల్య మొనర్చిన ఎ|| మల్లంపల్లి మల్లికార్జన శాస్త్రి గారికిని బ్ర!! వేటూరి ప్రభాకరశాస్త్రి గారికిని గృశజ్ఞతాభి వందన శతంబు లర్పించుచున్న వాఁడను.

ఈ చరిత్రమును తమసరస్వతీ పత్రిక యందుఁ బ్రకటింపించి నా గ్రంథ మును ముద్రింపించి యొసఁగిన మ!! రా|| రా!! శ్రీ రాజూ వాసిరెడ్డి శ్రీదుర్గాసదా శి వేశ్వరప్రసాద్ బహదర్ గారు ఇతోదిక స్వశ్వమ్యవిరాజమాను లై వంశాభివృద్ధి నొంది యలరుటకు నస్మదుపాస్య దైవముగు నాయుమాము హేశ్వరతత్త్వము ను బ్రా ర్ధించుచున్న వాఁడను.

ఏమహాను భావులకడ వైన నీయుద్భటారాధ్య చరిత :ముండి దయచేసి రేని తక్కుంగలలోపముల ద్వితీయ ముద్రణమున సవరించి వారికి ముద్రిత ప్రకుల నొసఁగి కృతార్థుఁడ నయ్యెదను.

ముక్త్యాల. బుధజనని ధేయుడు, ముదిగొండ బసవయ్యశాస్త్రి..