ఆంధ్ర వీరులు - రెండవ భాగము/సోమనాద్రి రెడ్డి
సోమనాద్రి రెడ్డి
నిజాము రాష్ట్రములోని మహబూబునగరు మండలమున అమరవాది యను నగరముగలదు. ఆనగరముచెంత గల అచ్చమ్మపేట, రఘుపతిపేట యను గ్రామములను బాకనాటి రెడ్డిశాఖకు జేరిన తిమ్మారెడ్డి యను వీరుడు పాలించుచుండెను. ఈయనభార్య వీరవతంసుండని పేరొందిన మెదకు మండలపాలకు డగు సదాశివరెడ్డి తోబుట్టువు కేశవమ్మ. ఈదంపతులు పశుసమృద్ధియు, ధనసమృద్ధియు గలవారై సుఖముగా నుండ క్షామదేవత దేశమును బీల్చి పిప్పిచేయుచుండెను. పంటలు తగ్గిపోయెను. పశువులుమేతలేక మాడిచచ్చు చుండెను. ప్రజ లన్నమోరామచంద్రాయని యేడ్చుచుండిరి. చేరెడు గంజినీళ్ళకు జనులు మోమువాచి నశించుచుండిరి. తిమ్మారెడ్డిచెంత పుట్లకొలది ధాన్యము గలదు. కావలసినంత ధనముగలదు. ప్రజల ఘోషచూచి సహింపజాలక పాతరలుదీయించి తనయొద్దగల ధాన్యముదంపించి వచ్చినవారందఱికి నెలలకొలది అన్నము పెట్టించెను. ఎంతకును గఱవు తగ్గదయ్యెను. గరిసెలు పాతరలుకూడ రిత్తవయ్యెను. ప్రజలాకలిగొని చచ్చుచుంట జూచి తనభార్య వస్తువులను మంగళసూత్రము దక్క మిగిలిన వన్నియు నమ్మెను. అప్పటికిని బ్రజలబాధ తగ్గదయ్యెను. ఇక నిటనున్న లాభము లేదని తానుగూడ నాకలిచే మలమలమాడుచు గూలినాలియైన చేసి జీవించుదమని మల్లారెడ్డి తన భార్యయగు కేశవమ్మను వెంటబెట్టుకొని బయలుదేరి కొల్లాపురము, పెంట్లవెల్లి, మూరవకొండ లోనగు గ్రామములకు బోవ నెందును గూలి దొఱకకపోయెను. కడకు కొఱ్ఱపోలూరను గ్రామమునకు బోయి యచట గూలినాలిచే జీవించుచుండెను. దొఱకిన కూలిధాన్యములో గొంచెము కొంచెము మిగిల్చికొని తిమ్మారెడ్డి కొంతధాన్యము సంపాదించి పాలికొక యెద్దును దీసికొని వ్యవసాయమును బెట్టెను. క్రమముగా గలసి వచ్చుటచే దిమ్మారెడ్డికొంతకాలమునకు గొప్ప రైతై ధనధాన్య సమృద్ధితో నుండెను. ఈశుభావసరమున వీరికొక కుమారుడు గలిగెను. సోమలింగేశ్వరుని యనుగ్రహమున జనించినవాడగుటచే నాబాలునకు సోమనాద్రియని నామకరణము గావించి సంతోషముగా గాలము గడుపుచుండిరి. వీరిశ్రేయముజూచి సహింపలేక గ్రామస్థులు కొందఱెటులేని యిబ్బంది పెట్టవలయునని తలంచి ఆప్రాంతములు పాలించు కర్నూలు నవాబగు దావత్‌ఖాను నొద్దకుబోయి తిమ్మారెడ్డి యను రైతు మీపై దిరుగుబాటు చేయుటకు బ్రయత్నించుచున్నాడు. వా డాయుధములు, ధనము, ధాన్యము సిద్ధము చేయుచున్నాడని విన్నవించిరి. నవాబు పలువురను బిలువనంపి యావార్త నిజమో కల్లయో దెలుపుమన వారంతకుమున్నే యీకుట్రలో జేరినవారగుటచే వారును నటులనే చెప్పిరి. దావత్‌ఖాను వెంటనే కొఱ్ఱపోలూరునకు దండయాత్రకు బయలుదేరి తిమ్మారెడ్డిని బిలువనంపి చెట్టునకు గట్టించి దయాశూన్యుడై కొట్టించి యతనిధనము, పశువులు, ధాన్యములు కొనిపోయెను. దెబ్బలచే నొడలంతయువాచి తిమ్మారెడ్డి గతించెను. కేశవమ్మ, తనకుమారుడును ఏడెనిమిదేండ్లు నిండని కూనయగు సోమనాద్రిని వెంటబెట్టుకొని పుట్టినింటికి బోవుచుండెను. త్రోవలో రాజవోలనుగ్రామము గలదు. అచటగల కేశవాచార్యులను విద్వాంసుడు బాలురకు బాఠములు చెప్పుచు వీధిలో గూర్చుండి తల్లివెంట నేగుచున్న సోమనాద్రిని జూచి యీబాలుని ముఖమున మహారజుచిహ్నము లున్నవని గ్రహించి కేశవమ్మ వలన బాలకునిచరిత్రము నంతయు విని జాలిపడి యిటుల జెప్పెను. "అమ్మా! నీపుట్టినింటి గౌరవము, నీభర్తపేరుప్రతిష్ఠలు నేనెఱుంగనివి కావు. చెడి పుట్టినింటికి బోవుటకంటె బ్రమాద మింకొకటి యుండబోదు. కష్టములు కలకాల యుండబోవు. ఈబాలుడు లోకఖ్యాతి గడింపగల డని నాకు దోచుచున్నది. నాయొద్ద నుంచినచో నేను సమస్త శాస్త్రములు నేర్పెదను. నిన్ను, నీశిశువగు నీబాలకుని నేనున్నంతలో బోషింప గలుగుదును. ఇచటనే యుండుట నా కభిమతము." కేశవాచార్యులవాక్యములు వినినంతనే వివేకవతియగు కేశవమ్మ యచటనే నిలువ నంగీకరించి బాలుని సంతోషముతో సోమానాద్రిమాటలకు సంతోషపూర్వక మగు నంగీకారమును దెల్పిరి.
కేశవమ్మయు సోమనాద్రియు నొకబండి కట్టించుకొని మెదకు మండలమునకు బోవుచుండిరి. త్రోవలో వారికి పూనూరను గ్రామము తగిలెను. చరిత్రస్థలమును జిత్రదేవాలయావృతము నగు పూనూరులోనికి సోమనాద్రివెళ్ళి యంగడిలో దారిబత్తెమునకు వలయు వస్తువులుకొన్ని మూటగట్టుకొని పోవుచుండ గ్రామాధికారియగు నాగిరెడ్డి యాబాలకుని జూచి దగ్గరకు బిలిచి యతనివృత్తాంతము విచారించెను. బాలుడు తనసంగతి, కులము, స్థలము నివేదించెను. ధనవంతుడును సంతానహీనుడునగు నా పాశము నాగిరెడ్డి తానును బాకనాటిరెడ్డి యగుటచే నాబాలకుని పెంచుకొన్నచో గులము తరించుననితలంచి యూరి బయటనున్న బండియొద్దకు బాలునితో బోయి కేశవమ్మను జూచి పూర్వబాంధవ్యము తెలిపి సోమనాద్రిని దనకు బెంచుకొనుట కొసంగుమని ప్రార్థించెను. ఆయమ యందులకు నంగీకరించి బాలునితో దానుగూడ నాగిరెడ్డియింట వసించెను. కొంతకాలము నాగిరెడ్డి తా నార్జించిన ధనకనకవస్తు వాహనములు సోమనాద్రి కొసంగి చెప్పవలసిన ధర్మములన్నింటిని జెప్పి మరణించెను. సోమనాద్రి పితృకార్యము లన్నింటిని శ్రద్ధాభక్తులతో నిర్వహించి ప్రత్యేకరాజ్యము నొకదానిని స్థాపించినగాని సోద దను సమీపించి గొల్లవాండ్రతో దనయవస్థయు వీరభటులు వెంబడించుటయు దెలిపి బ్రదికించిన గొప్పమేలు చేయుదునని బ్రతిమాలెను. వాండ్రు పెద్దగోయి తీసి అందు సోమనాద్రిని మెడవరకు బూడ్చి చుట్టును మేకపిల్లలనుంచి పైనిబుట్ట బోర్లించిరి. కొంతసేపటికి వీరభటులు వెదకుకొనుచు వచ్చి చుట్టుపట్టుగ్రామములు వెదకుచు గొఱ్ఱెలమందను గూడ బరిశీలించిరి. ఎందును సోమనాద్రి కనబడక పోవుటచే వీరభటులు విసిగి కృష్ణదాటి వెనుకకు వెళ్ళిపోయిరి. అనంతరము సోమనాద్రి బయటికివచ్చి గొల్లవాండ్రతో 'నాకు బ్రాణదానము గావించినందులకు మీరేమికోరుకొందురో తెలుపు' డనవారు నేటినుండి మీరు "ముష్టిపల్లి" యను మాగోత్రనామమును వహింపవలయునని కోరిరి. సోమనాద్రి యందులకంగీకరించి పూనూరునకు బోవుచుండ నొకచో భూగర్భమునందు బూర్వరాజులు నిక్షేపించిన ధనరాశి గోచరించెను. ఆధనము నంతయు బరిచారికులచే దెప్పించి పూనూరు సమీపమునందున్న యొక విశాలప్రదేశమున గోటకట్టింప నారంభించెను. ఆప్రదేశమునకు ఆమడదూరమునందున్న ఉప్పేడుకోటను బాలించు సయ్యదుదావూదుమియ్యాయను మహమ్మదీయుడు సోమనాద్రి కోటనుగట్టుచున్నసంగతి విని పరివారముతో నచటికి వచ్చి తనరాజ్యమున గోట గట్టవలదని నిర్బంధింపగా సోమనాద్రి పన్నుగట్టుచు సామంతుడుగా నుందునని యొప్పించి కోట సోమనాద్రి తన సహాధ్యాయులను సహాయముకోరి పిలువనంపగా వారు పరివారముతో ఆయుధపరికరములతో సంగరమునకు సహాయమువచ్చిరి. ఉభయదళములకు భయంకర సంగ్రామము జరిగెను. సమీపమునందున్న ఆంధ్రులందఱు స్వాతంత్ర్య సంగరమున సోమనాద్రికి సహాయపడిరి. మహారాష్ట్రులు, కర్ణాటులుగూడ సోమనాద్రి కనేకగతుల ధనమును, సైన్యమును సహాయముచేసిరి. మొక్కవోని బీరమున సోమనాద్రిబలము చిరకాలము పోరాడెను.
బసరుజంగు ఆంధ్రవీరులధాటి కాగజాలక గుఱ్ఱము నెక్కి పాఱిపోవసాగెను. వీరవతంసుడగు సోమనాద్రి యాతనిని వెంబడించి తరుముచు బోవ బ్రాణభీతితో నతడు రాయచూరు కోటలో దూరి ద్వారములు బిగించికొనెను. సోమనాద్రి కోటలోనికిబోవ యత్నించుచుండ గోటముందున్న యేనుగుప్రతిమలను జూచి గుఱ్ఱము బెదరెను. వెంటనే యా విగ్రహముల తుండములు దంతములు ఖండించి వెనుకకు మరలి సోమనాద్రి సంగరరంగ మలంకరించుసరికి ప్రాగుటూరి నవాబు గూడ పాఱిపోయెను. స్వల్పసైన్యముతో సయ్యదుమియ్యాయొక్కడు మాత్రము సంగరరంగమున మిగిలెను. ఆతడు హతశేషసైన్యమును ముందిడుకొని సోమనాద్రిపైకి మొండిచొరవతో రాదొడంగెను. సోమనాద్రి సైన్యమును భేధించి మియాను సమీపింపగ సమరాశ్వము తన ముందుకాళ్లు ఏనుగుమీదనుంచి నిలువబడెను. సోమనాద్రి తన కరవాలముతో సయ్యదుమియ్యాను జంపబోయెను. ప్రాణభయముతో సయ్యదు మియ్యా సలాములు చేయుచు, నీకు గప్పము గట్టుదును, రాజ్యములో గోరినంత భాగము నొసంగెదను రక్షింపు'మని ప్రార్థించెను. ఉదారశీలుడగు సోమనాద్రి కరుణించి యెత్తినకత్తి వ్రాల్చి మహమ్మదీయునితో "నీవు నన్ను గోటగట్టుకొన నిచ్చితివిగాన నీరాజ్యము నీకువదలుచున్నాను. నీకు నేనుగాని నాకు నీవుగాని సామంతులము గావలసిన పనిలేదు. నీవోడిపోయినటుల గుర్తుగా నుండుటకు యుద్ధమునకు గొనివచ్చిన నగారా, పచ్చజండా, ఏనుగును మాత్రము నాకిచ్చి పోవలయి"నన నవాబు సోమనాద్రి కవియెల్లయొసగి బ్రతుకుము జీవుడాయని తన కోటలోనికి బోయెను. సోమనాద్రి జయలక్ష్మితోబాటు సైదుమియ్యాయిచ్చిన విజయచిహ్నములు, బసరుజంగు విడిచి పోయిన ఫిరంగులు, హతులైన వీరభటుల ఆయుధములు దీసికొని గద్వాల జేరి నగరమధ్యంబునందు జయస్తంభము ప్రాతి నవాబునొద్ద గైకొన్న పచ్చజండా దానిపై గట్టించెను.
సయ్యదుమియ్యా తనరాజ్యము చేరినదాదిగా బరాభవ దు:ఖము కలచివేయుటచే గొన్ని దినములు బయటికె రాడయ్యెను. ఒకనాడు కోటబురుజుపై నెక్కగా గద్వాలలో జయస్తంభముపైన దన పచ్చజెండా కనపడెను. పరాభవ దు:ఖ మతిశయించెను. ప్రతిక్రియ గావించి యెటులేని సోమనాద్రిని బేరులేకుండ నెగురగొట్ట దలంచి హైదరాబాదునకు బ్రయాణమై నాలుగు మూడు దినములకుజేరి యా రాష్ట్రమును బాలించు నిజాము అలీకి దనరాక దెలియజేసెను. నిజాము ఆలి, యాతనిరాక విని తన గురుపరంపరకు జెందిన సయ్యదుమియ్యా సామాన్యునివలె వచ్చుటకు గారణమేమని యోచించి వెంటనే రమ్మని యాజ్ఞ యొసంగెను. మియ్యా నిజాము ఆలీని చూడగానే వంగివంగి సలాములుచేసి ఒంటికాలిమీద నిలుచుండి తన దురవస్థయు దన్ను సోమనాద్రి పరాభవించి వీరచిహ్నములు గొనిపోయిన విధము తెలిపి యెటులేని సోమనాద్రిని బంధించి తాను గోలుపోయిన జెండా, నగారా, ఏనుగు ఇప్పింపుమని ప్రార్థించెను. నిజాము ఆలీ సోమనాద్రి బలపరాక్రమములు నాలించినవాడగుటచే "నిది సంగరమున కదనుగాదు. సోమనాద్రి అప్రమత్తుడై మైమఱచి యున్నపుడు సంగర మొనరించినచో జయము సులభసాధ్యము. అంరవఱకు నిరీక్షింప^' మని చెప్పెను. "ముందు సోమనాద్రిని బంధించి నా విజయచిహ్నముల నాకిప్పింతురా బ్రతుకుదును. లేదా, నేను జీవింప"నని వాడికత్తితో గంఠము వఱకుకొనబోవుచుండ నిజాముఆలి సయ్యదుమియ్యా నెటులో సమాధానపఱచి పదునేనుదినములలో సంగరమునకు దప్పక వచ్చెదనని వాగ్దానముచేసి పంపెను. నిజాముఆలీ ముందు సోమనాద్రిపయికి దండయాత్ర కేగుటకు ధైర్యముచాలక తన మిత్రుడును గర్ణాట దేశీయుడును నగు ఇరుపనగౌడు అను నొక వీరుని బిలువనంపి జరిగిన కథాంశమునంతయు నెఱింగించి సోమనాద్రిని వంచించుటకు కుపాయమున్నచో దెలుపుమని కోరెను. ఇరుపనగౌడు ఉభయపక్షముల బలాబలముల నెఱింగిన వాడుగాన చాలసేపు యోజించి 'హర్పనహల్లిలో నాఱుగురు క్షత్రియ కుమారులు దుర్గమమైన కోటగట్టుకొని రాజ్యము పాలించుచున్నారు. వారికి సోమనాద్రికి మిత్రభేదము కలుగజేసితిమేని సోమనాద్రి మడియగలడు. అపుడు గద్వాలకోటను సులభముగా లోగొనవచ్చు'నని సమాధానముచెప్పెను. నవాబు మిగుల సంతసించి యెటులనేని యాకార్యము నీవె సమర్థించుమని భారమంతయు ఇరుపనగౌడుపైన బెట్టి యాసబెట్టెను. ఇరుపనగౌడు తన గ్రామమగు కురిచేడునకు జేరి హర్పనహల్లిలోని క్షత్రియసోదరులు వ్రాసినటు లొక జాబువ్రాసి దూతలచే సోమనాద్రికి బంపెను. సోమనాద్రి యా జాబు చూడగా నందిటుల వ్రాయబడి యుండెను. "సోమనాద్రికి - నీవు సయ్యదు దావుదు మియ్యాను జయించినమాత్రమున లోకైకవీరుడవు కావు. నిజమైన మగవాడవేని మావంటి వీరులను గెలువుము. లేదా మూలబడి యాడుదానివలె బ్రదుకుము." ఈజాబు పఠింపగనే సోమనాద్రికి గోప మతి శయించెను. జాబుయొక్క పూర్వోత్తరములనేని విచారింపక సోమనాద్రి సంగరమున కాయితమై నగరరక్షణమునకు వలయుబలమునుంచి యొకశుభముహూర్తమున హర్పనహల్లికి బ్రయాణమయ్యెను. నిజాము ఆలి యీవార్తవిని సోమనాద్రి కంత్యదినములు సమీపించెనని యానందించి యావార్త సయ్యదుకు గూడ దెలిపెను. సోమనాద్రి హర్పనహల్లి కోటను ముట్టడించెను. ఈవార్త క్షత్రియసోదరులు విని 'సోమనాద్రి యెవరు? అతని పేరైన వినియెఱుంగమే! మనపైకి దాడి వెడలవలసిన యవసరమేమి వచ్చినది? ఈ విరోధమునకు గారణమేమైయుండును?' శత్రుజనాభేధ్యమగు మనకోటలో సురక్షితముగా మనముందము. అతడు జయించిన నాటికి జూచుకొంద' మని తలంచిరి. సోమనాద్రి ఆఱుమాసములు ముట్టడించి ఫిరంగులుప్రేల్చి యెంతప్రయత్నించినను హర్పనహల్లికోట చెక్కు చెదరకపోయెను. తరువాత సోమనాద్రి యుపాయాంతరములచే గోటబగులగొట్టి రాజసోదరులను బంధింపబోయెను. వారు సోమనాద్రిని జూచి యిటులనిరి. "రెడ్డివతంసా! ఏపాపము నెఱుంగని మమ్ము బంధించుట న్యాయముగాదు. మేము నిన్ను బ్రతిఘటింపక మాని కోటలోనే యుంటిమి. ఆ కారణముగ సాటివారిని శిక్షింప నెంచుట నీవంటి శూరవతంసునకు దగవుకాదు." క్షత్రియసోదరుల మాటలు వినినంతనే సోమనాద్రికి గోపమతి శయించి కపటవినయము జూపుచుండిరని తలంచి తనయొద్ద గల జాబు వారికి జూపించెను. వారందఱు నాజాబు చూచి యది తాము వ్రాసినది కాదనియు మధ్యవర్తులు గావించిన మోసమనియు క్షమింపుడనియు బలువిధముల వేడికొనిరి. సోమనాద్రి విచారించి క్షత్రియ సోదరులు నిర్దోషులని గ్రహించి వారివలన గప్పములు గొని, సంగరములందు సహాయము జేయునటుల వాగ్దానము గైకొని గద్వాల కేగెను. ఈవార్త సయ్యదువిని సోమనాద్రివిజయమునకు జాలపరితపించి హైదరాబాదు నవాబునొద్దకేగి విలంబనము జేయవలదనియు దనపరాక్రమచిహ్నములగు, నగారా, ధ్వజము, ఏనుగు ఇప్పింపకున్న నాత్మహత్య గావించి కొందుననియు పట్టుబట్టెను. విధిలేక నిజాము ఆలీ సోమనాద్రిమీదికి సంగర సన్నద్ధుడై బయలుదేరెను. పూర్వపరాభవముతో నుడికి పోవుచున్న రాయచూరు పసరుజంగు పరిమితబలముతో నవాబునకు సహాయముగా వచ్చెను. -- ల్లారి బహదూర్‌ఖాన్, ప్రాగుటూరు ఇదురుసాహెబు, ఆదోనినవాబు, గుత్తిటీకు సులతాను, కర్నూలు దావతుఖాను లోనగు నవాబులందఱు నిజాము ఆలీకి సహాయమై సోమనాద్రిపైకి సైనికబలముతో దండయాత్రకు జనుదెంచిరి. మహమ్మదీయ సైన్యమంతయు లక్షల కొలదియై నేలయీనినటు లుండెను. కర్నూలు మొదలుకొని పదిమైళ్ళ దూరముననున్న ఉల్చాలవరకు బడమట, మూడు క్రోసులు దూరమునందున్న నిడుదూరువరకు సేనలు నిండి పోయెను. సోమనాద్రి భటులను పనివాండ్రను నియోజించి శత్రువుల కబిముఖముగా నొక మట్టికోట గట్టించెను. సోమనాద్రి శుభముహూర్తమున అపరిమిత బలసమేతుడై తాను గట్టించినకోటచెంత దండువిడిసి సంగరమున కాయితమయ్యెను. ఉభయ సైన్యములకు భయంకర సంగరము జరుగుచుండెను.
సోమనాద్రిసహాధ్యాయులగు కురుమన్న, ధర్మన్న యోధవేషములు ధరించి కొంతసైన్యమును దీసికొని యవన సైనికుల నెదిరించిరి. కొంతబలమును వెంటగొని సోమనాద్రి స్వయముగా దాను నవాబులపైకి బయలుదేరెను. ఆనాడు జరిగిన జనమారణమునకు మితములేదు. మతావేశ పరవశులగు యవనులు నిలుకడగా బోరి హిందూభటుల నెందఱనో మడియించిరి. ఆంధ్రనాయకులు వ్రేటున కొకయవనుని బడగొట్టి యుద్ధరంగ మంతయు రక్తప్రవాహములతో నించివేసిరి. సోమనాద్రి సామాన్యదళములను విడిచి నవాబులపైకిబోయి ఘోరముగా బోరి ప్రాగుటూరి నవాబగు ఇదురు సాహెబును నఱకివేసెను. బల్లారి బహద్దరుఖానుని జంపెను. ఆదోని నవాబు నంతమొందించెను. ఈ పరిస్థితులు గమనించి సోమనాద్రిధాటి కాగజాలక నిజాముఆలీ హతశేషసైన్యముతో కర్నూలుకోటకు బోయి తలదాచుకొనెను. సోమనాద్రి కర్నూలువఱకు శత్రుసైన్యమును దరిమి ప్రొద్దుగ్రుంకువఱకు దనస్కంథావారము జేరెను. సోమనాద్రి యెక్కినయశ్వము సంగర రంగములలో బాగుగా మెలగనేర్చినది. పిట్టవలె నంతలో విరోధిసైన్యములమధ్య వ్రాలును. ముందుకాళ్లెత్తి యేనుగులమీదికి బోవును. ఈయశ్వము నెటులేని బట్టి తెప్పించినచో సోమనాద్రి చిక్కగలడని నిజాము ఆలీ తలంచెను. తనసైనికులతో సోమనాద్రి గుఱ్ఱమును గొనివచ్చినవానికి గొన్నిగ్రామము లిచ్చెదనని చెప్పెను. ఎవరును సాహసించి యందుల కియ్యకొనరైరి. నిజాముఆలీ యశ్వపాలకు డందుల కంగీకరించి గాఢాందకారమున బయలుదేరి యెటులో యశ్వశాలకుబోయి గుఱ్ఱమును లాయమునుండి తొలగించి తన శిబిరము త్రోవ బట్టించెను. రెడ్డివీరులంద ఱిదిచూచి యెవడో మన భటుడె కార్యాంతరమున వేగునడుపుటకు బోవుచుండెనని యుపేక్షించిరి. అశ్వపాలకుడు కొలదిసేపటిలో నిజాము ఆలియొద్దకు జేరి యశ్వమునుజూపి తనవిజయవార్త నెఱింగించెను. నిజాము ఆలీ యశ్వమును లాయమున గట్టివేయించి వానిని సత్కరించెను.
నవాబు పట్టరాని యానందము నొంది సోమనాద్రిని బట్టుకొనుట యిక సులభమని ప్రజ్ఞలు కొట్టుచుండెను. సోమనాద్రి తెల్లవారిచూడగా అశ్వము లేదయ్యెను. చాలవిచారించి యడుగుజాడలవలన నిజాముఆలీ శిబిరము చేరినటుల గ్రహించి విచారపడెను. కొనివచ్చిన వానికి గోరినంత ధన మిచ్చెదనని పలుకగా హనుమప్ప నాయకుడను వీరుడు నేను కొనితెచ్చెదనని యంగీకరించి మహమ్మదీయసైన్యముచెంతకు బోయెను. సేనానివేశమునకు మధ్యనున్న విశాలమగు పాకలో గుఱ్ఱములుండెను. అందే, సోమనాద్రిగుఱ్ఱముగూడ నుండియుండునని చొప్పవిక్రయించువానివలె నాత డశ్వశాలజేరెను. మహమ్మదీయు లతనిని జొప్పవిక్రయించు వానిగానే భావించి యుపేక్షించిరి. ఆతడు మెల్లగా బ్రొద్దు క్రుంకువఱకు గడ్డియమ్మువానివలె బేరముచేయుచు వారితో భాషించుచు నుండి రాత్రికాగానే గుఱ్ఱముముందున్న గడ్డిలో దేహముదాచి పరుండెను. అంతలో నొకయవనుడు గుఱ్ఱమును వేఱొకస్థలమున గట్టివేయుటకు మేకు బ్రాతు చుండగా నందు హనుమప్పనాయకునిచేయి దిగబడెను. కదలినచో మహమ్మదీయుడు గ్రహించునని జనమునిద్రచే మాటుమడుగు వఱ కటులనేయుండి చేయి రాకపోవుటచే మణిబంధమువఱకు ఖండించి గుఱ్ఱమునెక్కి శిబిరాభిముఖుడై బయలుదేరెను. సైనికులు నిద్దురలో దలలెత్తిచూచి తమ యశ్వపాలకులె నీరుబెట్టుటకు గుఱ్ఱములను గొనిపోవుచున్నటుల దలంచి మిన్నకుండిరి. తెల్లవారుసరికి హనుమప్పనాయకుడు సోమనాద్రిచెంత గుఱ్ఱమును గట్టివేయించి తానొందిన కష్టములు తెలిపి మొండిచేయిని దార్కాణముగా జూపెను. సోమనాద్రి హనుమప్పనాయకుని సాహస ధైర్యస్థైర్యముల కెంతయు నానం దించి యాతనికి గోరినతావుల నెన్నియో క్షేత్రరాజములొసంగి గౌరవించెను. తెల్లగ తెల్లవార గనే సోమనాద్రి తన స్కంధావారమునందు విజయభేరి మ్రోగించెను. ఆనాదమునాలింప యవనుల గుండె లదరెను. విధిలేక తమప్రభువుని యానతి దాటజాలక వారును సంగరసన్నద్ధులైరి.
సొమనాద్రి పరివారసహితముగ సంగర మొనరించి శత్రుసమూహమును నేలమట్టము గావించెను. ఇంతలో దనతండ్రినిజంపిన దావతుఖాను డెదురయ్యెను. సోమనాద్రి వాని బలమునంతయు దృటిలో దునుమాడి కంఠము ఖండింపబోయెను. ఆతడు సోమనాద్రిపాదములపై బడి శరణుగోరెను. తనతండ్రి నన్యాయముగా జంపి యావదాస్తిని హరించిన నాటికోపము మనసులోనుంచుకొని వాడెంతప్రార్థించినను విడువక తల ఖండించెను. శత్రుసైన్యము సోమనాద్రిధాటి కాగజాలక కర్నూలుకోటలో దాగికొనెను. సముచితసైనికబలముతో సోమనాద్రి కర్నూలుకోట భేధించి యవనుల నెందఱనో సంహరించి వెనుకకు మఱలెను. పేరుజెందిన మహమ్మదీయ సేనానులందఱు మరణించిరి. ప్రాగుటూరు, బళ్ళారి, ఆదోని, కర్నూలు నవాబులు గతించిరి. గుత్తి, రాయచూరు నవాబులు, వివాదకారణభూతు డగు సయ్యదమియ్యా ప్రాణములతో మిగిలిరి. సోమనాద్రి యకుంఠిత దీక్షతో సంగరప్రయత్నములు విరామము లేక చేయుచుండెను. మహమ్మదీయసైన్యము పలుచబడుటచే వారేమి చేయజాలక యెట్లు ముందుజరుపనగునో నిశ్చయించుటకు రాత్రివేళ నేకాంతసభ యొకటి యొనరించి సోమనాద్రితో సంధి జరుపుటయే నిరపాయమగు మార్గమని నిర్ణయించుకొనిరి.
నిజాము ఆలీ సోమనాద్రిని సయ్యదుమియ్యాను ఒకచోజేర్చి యిరువురకు సమాధానవాక్యములజెప్పి యైకమత్యము గలుగజేసి గతముమఱచిపొండని కోరెను. సోమనాద్రి సంధి కంగీకరించి తనవిజయమునకు సూచనగా నొకగొప్ప ఫిరంగిని బహుమతిగా గైకొని తననగరము జేరెను. సోమనాద్రి విజయలక్ష్మీద్వితీయుడై తనపట్టణముజేరి తనకు సహాయముగావచ్చి సంగరమున బ్రశంసాపాత్రముగా బనిచేసిన వీరులందఱకు ఆభరణములు, మాన్యములు,ఆయుధములు బహూకృతిగా నొసంగి తన విశ్వాసమును బ్రకటించెను. బ్రతికినంతకాలము సోమనాద్రి పరాజయము నెఱుంగక శత్రుసైన్యములదాకి విజయమునందుచు నమితవిఖ్యాతి గడించెను.
సోమనాద్రి భూపాలుడు తిరుపతియాత్రకు బయలుదేరి గనికోట, నంద్యాల పాలకులను జయించి ప్రతిసంవత్సరమును సుంకమును గట్టునటుల గట్టడి చేసెను. తిరుపతిక్షేత్రము జేరి సోమనాద్రి వేంకటేశ్వరస్వామిని దర్శించి విరాగియై యచటనే దేహయాత్ర చాలించెను.
సోమానాద్రినే సోమనాథభూపాలుడని కూడ వ్యవహరించుట గలదు. ఈ మహావీరుడు పెక్కుగ్రంథముల నంకిత మందెను. కవులను గాయకులను బోషించి చిత్రకళల నభిమానించెను. నాడుమొదలు నేటివఱకు గద్వాల సంస్థానము విద్యాభిమానమును దాతృతా రూపమున బ్రకటించుచునే యున్నది. సోమనాద్రి భూపాలుడు క్రీ.శ. 1700 మొదలు 1770 లోగ నుండి యుండును. ఈ సోమనాద్రి భూపాలునకు ఇరువురు ధర్మపత్నులు గలరు. ఇద్దఱు కుమారులు జనించిరి. వారు బాలురగుటచే సోమనాద్రి యనంతరము లింగాంబయను ప్రథమభార్యారత్నము కొంతకాలము రాజ్యము నేలి యుక్తవయస్సు రాగానే తన భారమునంతయు బెద్దకుమారునిపై బెట్టెను. జ్యేష్ఠపుత్రుడు తిరుమలరాయడు పితృసంపాదిత మగు రాజ్యమును జిరకాలము పాలించెను. సోమనాద్రి భూపాలుడు గతించి చిరకాలమైనను ఆయన కీర్తిమాత్ర మింతవఱకు మరుగుపడలేదు. ఆయన యంకితము నొందిన భారత విరాట పర్వాది గ్రంథరాజము లాతని కీర్తిని గొనియాడుచున్నవి. అత్యున్నతములగు దుర్గములు, గోట గోడలు గల నాటి గద్వాలనగర విభవము చెక్కుచెదరక నేటికిని పూర్వప్రశస్తిని జాటుచునే యున్నది. పౌరుషవంతములగు పూర్వరాజ్యములలో నేటివఱకు మిగిలి యున్నవి వ్రేళ్లతో లెక్కింపదగియున్నవి. ప్రాచీనవిద్యపట్ల గౌరవము జూపుచు బండితసన్మానములు గావించుచు బూర్వమర్యాదలు నిలువబెట్టుచున్న యీ సంస్థానరాజమునెడ నాంధ్రులకు, నాంధ్రేతరులకు నెంతయు గౌరవభావము గలదు. ఇంతటి ప్రశక్తికి గారకుడగు సోమనాద్రి సర్వజనవంద్యుడనుటలో సంశయ ముండదు.
- _________
విజయ రామరాజు
తాండ్ర పాపరాయుడు బొబ్బిలిసంగరమునందు విజయనగర సంస్థానాధీశ్వరుడగు విజయరామరాజును జంపెను. అనంతర మాయనరాణి తన సమీపజ్ఞాతుల యొద్దనుండి పండ్రెండుసంవత్సరముల బాలునిగొనివచ్చి దత్తతజేసికొని విజయరామరాజు అని యాబాలునకు నామకరణ మొనరించెను. యుక్తవయస్సు వచ్చువఱకు రాణిగా రీబాలునకు సంస్కృతము, ఆంధ్రము, పార్సీలోనగుభాషలు నేర్పించి అనంతరము రాజ్యముగూడ నొసంగెను. విజయరామరాజునకు జనకస్థానము నందు అన్నయగు సీతారామరాజు కూడ విజయనరమునకు వచ్చి సోదరునకు సహాయముగా బరిపాలనా వ్యవహారములు చూచుచుండెను. క్రమముగా సీతారామరాజునకు విజయనగరరాజ్యము నందును అపుడు బలవంతముగా నున్న --- సువారియొద్దను బరిచయము మెండయ్యెను. రాజకీయ వ్యవహారము లన్నియు నాతడె మిగుల నేర్పుగా నిర్వహించుచుండెను. విజయరామరాజు తనయన్న పరిపాలనా చాక