ఆంధ్ర కవుల చరిత్రము - మూడవ భాగము/సముఖ వేంకట కృష్ణప్పనాయకుడు
Appearance
ఈకవి యహల్యాసంక్రదన మను మూడాశ్వాసముల ప్రబంధమును రచించెను. ఇతడు శూద్రకులజుడు; సముఖ మీనాక్షినాయకుని తనుజుడు. "శ్రీమత్పాండ్య మండలాధీశ్వర విజయరంగ చొక్కనాధ మహీనాథ కరుణాకటాక్ష సంపాదిత గజతురంగ మాందోళికా చ్ఛత్రచామరవిజయ దోహళకాహళభూరి భేరీ బిరుదధ్వజ ప్రముఖ నిఖిలసంపత్పారంపరీ సమేత " అని ఆశ్వాసాంత గద్యమునందు జెప్పుకొనుటచేత కవి మధురాధినాథు డయిన విజయరంగ చొక్కనాథుని కాలములో నున్నవా డగుట స్పష్టము. ఈ విజయరంగ చొక్కనాథుడు క్రీస్తుశకము ----వ సంవత్సరము మొదలుకొని ---- వ సంవత్సరము వరకును పాండ్యమండలాధీశ్వరుడుగా నుండెను. కాబట్టి కవియు ---- సంవత్సర ప్రాంతములనుండి యున్నవాడే. ఇతడు జైమిని భారతమును వచనకావ్యముగా రచించిన ట్లహల్యాసంక్రందనములోని యీక్రింది పద్యమువలన దెలియవచ్చుచున్నది
సముఖ వేంకట కృష్ణప్పనాయకుడు
రోసనూరి వేంకటపతి.
ఈకవి విష్ణుమాయావిలాస మను మూడాశ్వాసముల పద్యకావ్యమును రచియించి దానిని వేంకటగిరిసంస్థాన ప్రభువయిన శ్రీ వెలుగోటి బంగరు యాచమనాయని కంకితము చేసెను. ఇతడు నియోగి బ్రాహ్మణుడు; లింగనామాత్యుని పౌత్రుడు; గంగనమంత్రి పుత్రుడు; కాశ్యపగోత్రుడు. కృతిపతి తండ్రియైన కుమారయాచ భూపాలుడు తనకు "తిక్కయవ్వ" యను బిరుదము నిచ్చినటు కవి యీపద్యమున జెప్పుకొన్నాడు