ఆంధ్ర కవుల చరిత్రము - మూడవ భాగము/రోసనూరి వేంకటపతి

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

రోసనూరి వేంకటపతి.

ఈకవి విష్ణుమాయావిలాస మను మూడాశ్వాసముల పద్యకావ్యమును రచియించి దానిని వేంకటగిరిసంస్థాన ప్రభువయిన శ్రీ వెలుగోటి బంగరు యాచమనాయని కంకితము చేసెను. ఇతడు నియోగి బ్రాహ్మణుడు; లింగనామాత్యుని పౌత్రుడు; గంగనమంత్రి పుత్రుడు; కాశ్యపగోత్రుడు. కృతిపతి తండ్రియైన కుమారయాచ భూపాలుడు తనకు "తిక్కయవ్వ" యను బిరుదము నిచ్చినటు కవి యీపద్యమున జెప్పుకొన్నాడు పుట:Aandhra kavula charitramu muudava bhaagamu.pdf/25 పుట:Aandhra kavula charitramu muudava bhaagamu.pdf/26

పైడిమఱ్ఱి వేంకటపతి.

ఈకవి చంద్రాంగద చరిత్ర మనెడి యారాశ్వాసముల ప్రబంధమును రచించి యున్నాడు. ఈతని కవిత్వము మిక్కిలి ప్రౌఢమము రసవంత మయి పూర్వకవుల రచననుబోలి హృదయాహ్లాదకర మయినదిగా నున్నది. ఇతడు తన గ్రంథమును శ్రీరామాంకితము చేఇయుంటచే గృతిపతినిబట్టి యీతనికాలనిర్ణయము చేయుట కాధారము కనబడలేదు. ఉన్నయాధార మంతయు కృతికర్త తన వంశవర్ణనము చేసికొన్న యీక్రిందిపద్య మయియున్నది