ఆంధ్ర కవుల చరిత్రము - మూడవ భాగము/పైడిమఱ్ఱి వేంకటపతి
Appearance
ఈకవి చంద్రాంగద చరిత్ర మనెడి యారాశ్వాసముల ప్రబంధమును రచించి యున్నాడు. ఈతని కవిత్వము మిక్కిలి ప్రౌఢమము రసవంత మయి పూర్వకవుల రచననుబోలి హృదయాహ్లాదకర మయినదిగా నున్నది. ఇతడు తన గ్రంథమును శ్రీరామాంకితము చేఇయుంటచే గృతిపతినిబట్టి యీతనికాలనిర్ణయము చేయుట కాధారము కనబడలేదు. ఉన్నయాధార మంతయు కృతికర్త తన వంశవర్ణనము చేసికొన్న యీక్రిందిపద్య మయియున్నది పుట:Aandhra kavula charitramu muudava bhaagamu.pdf/28
పైడిమఱ్ఱి వేంకటపతి.
శేషము వేంకటపతి
ఇతడు శశాంకవిజయ మనెడి యైదాశ్వాసముల శృంగారప్రబంధమును చేసి వంగలసీనయార్యున కంకితము చేసెను. శశాంకవిజయమునకు తారాశశాంక మని నామాంతరము గలదు. ఇందు జంద్రుడు బృహస్పతివద్ద విద్యాభ్యాసమునకయి చేరి గురుపత్ని యగు తార నింటినుండ లేవదీసిన కథ మిక్కిలి పచ్చిగా వర్ణింపబడినది. ఈ శేషము వేంకటపతి నియోగి బ్రాహ్మణుడని తోచుచున్నది. ఇతడు కందాళ రామానుజాచార్యుని శిష్యుడు; కృష్ణయార్యుని కుమారుడు. కృతినాయకుడు తన్ను బిలిపించి పలికినట్లు చెప్పబడిన ఈక్రింది పద్యములలో కృతిపరంపరలు చేసినట్టు కవి చెప్పుకొనుటయేకాని యొక్క గ్రంథమునైనను బేర్కొనియుండలేదు.--