ఆంధ్ర కవుల చరిత్రము - మూడవ భాగము/నెల్లూరి వీరరాఘవ కవి
స్వరూపం
నెల్లూరి వీరరాఘవ కవి.
ఇతడు యాదవరాఘవపాండవీయ మనునాలుగాశ్వాసముల త్ర్యర్థికావ్యమును రచియించెను. పుట:Aandhra kavula charitramu muudava bhaagamu.pdf/70
నంజరాజు.
ఈకవి హాలాస్యమాహాత్మ్య మను డెబ్బదిరెండధ్యాయముల వచనకావ్యమును రచియించెను. ఈగ్రంథమున నధ్యాయాద్యంతముల యందు బద్యములు గలవు. కవి వంశవర్ణనమును బద్యములతోనే చేయబడినది. ఈకవి మహిశూరు రాజగు దొడ్డమహీపాలుని పౌత్రుడు; వీరరాజభూపాలుని పుత్రుడు. ఈదొడ్డభూపాలుడు 1670 వ సంవత్సర ప్రాంతములయందుండినవాడు.