ఆంధ్ర కవుల చరిత్రము - మూడవ భాగము/గురురాజకవి

వికీసోర్స్ నుండి


గురురాజకవి.


ఈకవి శేషధర్మములను తొమ్మిదాశ్వాసముల గ్రంథమును రచియించి బళ్ళారిమండలములోని జొహరాపురాధిపతి యైన సంజీవిరెడ్డిగారి కంకితము చేసెను. ఇత డిరువది ముప్పదిసంవత్సరములక్రిందట నుండినవాడు. కవిత్వము నిర్దుష్ట మని చెప్పుటకు వలదు పడకపోయినను మొత్తముమీద బుస్తకము రసవంతముగా నున్నదని చెప్పవచ్చును. కవికృతము లయినకావ్యాదులనుగూర్చి కృతిపది పలికినట్లుగా గ్రంథమునందీక్రిందిపద్యములు చెప్పబడినది.-

అల్లమరాజు సుబ్రహ్మణ్యకవి.


ఈకవి యల్లమరాజు రామకృష్ణకవి తమ్ముడు. ఈతడు చేసిన గ్రంథములలో శ్రీబచ్చురామేశనామక వైశ్యశిఖామణి కంకితము చేయబడిన శ్రీకృష్ణకళ్యాణ మనెడి మూడాశ్వాసముల ప్రబంధ మొకటి యచ్చుపడి యున్నది.