ఆంధ్ర కవుల చరిత్రము - మూడవ భాగము/కూచిమంచి జగ్గకవి

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

కూచిమంచి జగ్గకవి.


ఇతడు సుప్రసిద్ధు డయిన తిమ్మకవి సార్వభౌముని రెండవతమ్ముడు. ఈతనిజన్మసంవత్సర మేదో తెలియదుగాని తిమ్మకవికంటె నాలుగయిదుసంవత్సరములు చిన్నవాడయి యుండవలసినందున, ఇతడు 1700వ సంవత్సర ప్రాంతమునందు పుట్టిన ట్టూహింపదగియున్నది. ఈజగ్గకవి యిరువదిసంవత్సరములప్రాయము వచ్చువఱకును చదువెఱుగక యల్లరిమూకతో దిరుగుచు కాలము గడపెననియు, అప్పుడు వివాహితుడయి యత్తవారియింటికి మనుగుడుపునకు బోయి మామగారు తనకు బరమశుంఠ యైనయల్లుడు దొరకినందున కనుతాపపడగా రోషముచేత దేశాంతరమునకు లేచిపోయి పండ్రెండు సంవత్సరములు విద్యాభ్యాసము చేసి పండితు డయి కవిత్వము చెప్ప నారంభించెననియు, పుక్కిటిపురాణ మొకటి కలదుగాని యిది కేవల కల్పితకథ యని తోచుచున్నది. ఈకథనుబట్టి యీకవికి కవిత్వము చెప్పనారంభించు కాలమునాటికి ముప్పదిమూడు సంవత్సరముల ప్రాయ మయి యుండవలెను. కూచిమంచి తమ్మకవి తాను ముప్పదిసంవత్సరముల ప్రాయమున జేయ నారంభించిన సింహశైలమహాత్మ్యమునందు దనపెద్దతమ్ము డైనసింగన్నను వర్ణించినతరువాత రెండవతమ్ము డైనయీజగ్గకవిని గూర్చి యిట్లు వ్రాసియున్నాడు-పుట:Aandhra kavula charitramu muudava bhaagamu.pdf/50 పుట:Aandhra kavula charitramu muudava bhaagamu.pdf/51 పుట:Aandhra kavula charitramu muudava bhaagamu.pdf/52