ఆంధ్ర కవుల చరిత్రము - మూడవ భాగము/కాకమాని మూర్తి

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

కాకమాని మూర్తి.

ఈకవి కాకమాని కులజుడైన బ్రాహ్మణుడు; కౌండిన్యగోత్రుడు; రామలింగభట పుత్రుడు. ఇతడు పాంచాలీ పరిణయము, రాజవాహనవిజయము, అను రెండు ప్రబంధములను రచియించెను. రాజవాహనవిజయములోని యీక్రిందిపద్యమునుబట్టి యీకవి యింటిపేరు పెన్నావా రని తెలియవచ్చుచున్నది. పుట:Aandhra kavula charitramu muudava bhaagamu.pdf/16 పుట:Aandhra kavula charitramu muudava bhaagamu.pdf/17

కామేశ్వరకవి.

ఇతడు సత్యభామాసాంత్వన మను నాలుగాశ్వాసముల శృంగారప్రబంధమును రచియించి, మధురనాయకు డైన ముద్దలగరి నృపాలున కంకితము చేసెను. ఈమధుర శ్రీకృష్ణుని జన్మస్థల మయిన మధురాపురముగా పాండ్యమండలమునకు రాజధానియైన దక్షిణమధు యైన ట్లీ క్రిందిపద్యమువలన దెలిసికొనవచ్చును