ఆంధ్ర కవుల చరిత్రము - మూడవ భాగము/ఒడ్డెపూడి పెద్దయ్య

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

ఒడ్డెపూడి పెద్దయ్య

ఈకవి వాయుపురాణమును తెనిగించి, పురుషోత్తమపట్టణ నివాసు డయిన దాసరి చిన్నగంగయ్య యను కమ్మచౌదరి కంకితము చేసెను. పురుషోత్తమ పట్టణము కొండపల్లెకు బ్రాగ్భాగమున నున్నట్టు, దానిని వీరపురుషోత్తమ గజపతి తన పేర గట్టించినట్టును గవి చెప్పియున్నాడు. వీరపురుషోత్తమ గజపతి కొండవీటి కధిపతిగా నుండి క్రీస్తుశకము ---- వ సంవత్సరము మొదలుకొని ---- వ సంవత్సరము వఱకును రాజ్యపాలనము చేసెను. ఈతని తరువాత రాజ్యమునకు వచ్చిన యితని మనుమ డైనవీరభద్ర గజపతిని ---- వ సంవత్సరమునందు కృష్ణదేవరాయలు జయించి కొండవీటిని స్వాధీనము చేసికొనెను. దీనినిబట్టి వాయుపురాణము కృష్ణదేవరాయని కాలమున కనంతరముననే రచియింపబడినట్టు తెలిసినదికాని యెప్పుడు చేయ పుట:Aandhra kavula charitramu muudava bhaagamu.pdf/13

కాకమాని మూర్తి.

ఈకవి కాకమాని కులజుడైన బ్రాహ్మణుడు; కౌండిన్యగోత్రుడు; రామలింగభట పుత్రుడు. ఇతడు పాంచాలీ పరిణయము, రాజవాహనవిజయము, అను రెండు