ఆంధ్ర కవుల చరిత్రము - ప్రథమ భాగము/పశుపతి నాగనాథుఁడు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

పశుపతి నాగనాథుఁడు


శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రిగారు కూర్చిన 'ప్రబంధరత్నావళి' లో నాగనాధుని విష్ణుపురాణమునుండి యొక పద్యముదాహరింపఁబడినది. నిజాము రాష్ట్రములోని ఓరుగల్లు సమీపమునఁగల యొకశాసనము ననుసరించి యితని తండ్రి పశుపతియనియు, ఇతఁడు క్రీ. శ. 1369 ప్రాంతము వాఁడనియ తెలియుచున్నది. చమత్కారచంద్రికను సంస్కృతమున వ్రాసిన విశ్వేశ్వర పండితున కీతడు శిష్యుడు. ఇతని విష్ణుపురాణము వెన్నెలకంటి సూరన్న రచనకంటె, బ్రాచీనము; కావున తొలియనువాద మనవలెను. ఇతఁడు సంస్కృతమున 'మదన విలాస' నును భాణమునుకూడ రచించెనcట. సింహాసనద్వాత్రింశతిక" ను రచించిన కొఱవి గోపరాజు స్తుతించిన నాగరాజీ నాగనాధుఁడే యని విమర్శకుల యాశయము.