అశ్వలక్షణసారము/ప్రథమాంకురము
శ్రీరస్తు
అశ్వలక్షణసారము
ప్రథమాంకురము
| 1 |
చ. | అనఘుడు శాలిహోత్రుఁడు హయంబులకున్ మును జెప్పినట్టియా | 2 |
| హయలక్షణవేత్తయగు శాలివాహనుఁడు మున్ముందుగా చెప్పిన అశ్వలక్షణములను, ఆయుఃప్రమాణమును గురించి తెలుగున సర్వజనులకు దెలియునట్లుగను - సత్కవీశ్వరులు గొనియాడునట్లుగను జెప్పెదను. అని కృతికర్తయగు మనుమంచిభట్టారకుడు జెప్పియున్నాడు. ఈగ్రంథము సాళువ కంపభూపాలున కంకిత మీయబడినది. | |
క. | జలనిధిమథనావసరమున | |
| డ్పులసంగమమున బావకు | 3 |
| దేవదానవులు సురకొఱకై సాలసముద్రమును మందరపర్వతముచే తరుచుచున్నప్పుడు- బ్రహ్మదేవుని యొక్క స్వేదబిందువులు గాడ్పులతో గలసెను. అప్పుడు హయము లుద్భవమందెను. | |
సీ. | తొలుతదంతంబులు తోచిన నొకనెల | 4 |
| ముందరిదంతములు బొడసూపిన గుర్రముయొక్క ప్రాయ మొకనెల. ఆముందరి రెండుదంతములును బలసినవై పొడవైన యెడల రెండునెలలు గుర్రమగును. మధ్యదంతములు గాన్పించిన మూడుమాసములు. అవి స్ఫుటమైన వైనచో నాల్గునెలలు. మిగిలినదంతములు వచ్చిన గుర్రముయొక్క ప్రాయ మెనిమిదినెలలు. ఆరుదంత | |
| ములు విశదము లైయున్న యేడునెల లగును. ఆదంతము లెర్రనయిన రెండేండ్లు అన్ని పండ్లును గలియుట కయిదేండ్లు పట్టును. | |
క. | దంతముల తెలుపు చిత్త | 5 |
| దంతములు తెల్లనగుట, స్థిరచిత్తము కలుగుట, కన్నులలోని వెలు గతిశయించుట, బలము, పనిచేయు నేర్చును శరీరమునందలి తేజస్సును గలతురగముయొక్క వయస్సు అయిదు వత్సరములు. | |
క. | ఇది విచారించుటయును | 6 |
| పైన చెప్పబడిన విషయముల నిరూపించుటయును, వ్యంజనముల క్రమంబును యొకటొకటిగా చెప్సెదను. | |
ఉ. | నల్లనిరేఖ కృష్ణహరిణంబు సువర్ణవిభాతి శుక్లమున్ | 7 |
| చూడుము మూడవయాశ్వాసము. కృష్ణవ్యంజనము, శుక్లము, హరిణవ్యంజనము, మక్షిక, శంఖఉలూఖలము, చలనవ్యంజనము, పతనవ్యంజనము, కాంచవ్యంజనము. | |
క. | నెట్టున మొదలిరదంబులు | |
| బుట్టిన రెండేడులు తుద | 8 |
| మొదటిరదనములు తోచినయెడల నొకసంవత్సరమును, మధ్యపండ్లు బుట్టిన రెండేడ్లును, వెనుకటి రెండుదంతములును బుట్టిన మూడేన్లును యుండును. | 9 |
గీ. | ఈనవవ్యంజనంబులు యిట్లు నడువ | 10 |
| పైన చెప్పబడిన తొమ్మిదివ్యంజనములును గడచుటకు యిరువదియేడు వత్సరములగును. ఆయిరువదేడు వత్సరములును బాల్య మైదేడులును కలసి గుర్రమునకు ముప్పదిరెండు వత్సరములు పూర్ణాయువయ్యెను. | |
| గ్రంథపాతము యితరప్రతులలో నున్నదేమో తెలియదు. | 10 |
క. | ఉరమున నుపరంధ్రంబుల | 11 |
| సులభసాధ్యము. గుర్రమునకు తప్పక పదిసు ళ్లుండవలయును. | |
క. | ధృవులు పది యశ్వజాతికి | 12 |
| ధృవులు పది యుండవలయును. పదికంటె తక్కువయైనయెడల నాయశ్వము అల్పజీవి యగును. ఇంతియేగాక ఆగుర్రముయొక్క | |
| యజమానునకు గూడ కీడుగల్గును. అందువలన హయశాస్త్రవేదు లెవ్వరును యట్టిగుర్రమును కొనరు. | |
క. | మస్తకహీనము బహుదుర | 13 |
| చిన్నిమస్తకము (తల) గలిగియున్న గుర్రము పెక్కుచిక్కులకు లోనై యైదువత్సరములలోపలనె మరణించును. అట్లు మరణింపకున్న నాహయము తన్ను పాలించువానియొక్క మస్తకమును రిపులచే ద్రుంపఁజేయును. | |
చ. | స్థిరముగ రోచమానమును దేవమణిందగ గూడియున్న యా | 14 |
| మెడమీదనుండునట్టి జూలునందు సుడియును దేవమణియను సుడియును గల తురంగము యితరదోషములను బోకార్చి శుభంబుల నొసంగును. | |
క. | చుంచున కేశాంతంబుల | 15 |
| ముట్టెయందును, కేశాంతమునందును, నెలవుయందును, (నోటి కిరుప్రక్కలనుండు మూలలందును) సుళ్ళు గలిగిన హయము తన్ను పరిపాలించు యజమామనకు శుభము నిచ్చును. | |
క. | బాహువులను సుళ్ళు గలిగిన | 16 |
| ముందరకాళ్ళ సుళ్ళు గలిగియున్న తురగము బాహావర్తతురంగ మనబడును. దానిని పాలించు యధికారి యుద్ధములందు జయలక్ష్మిచే వరింపబడును. | |
సీ. | ఇప్పుడు జెప్పిన ముప్పదిరెంటిలో
రోచమానంబు గదియంగ రోమజముల | 17 |
సీ. | ముందరికాళ్ళను మోకాళ్ళు జంఘల | |
| దండమున ముక్కుజమరుల క్రిందిపెదవి | 18 |
| ముందరికాళ్ళయందునను, మోకాళ్ళయందునను, జంఘలు కలియుచోట్లను, మణుగులందును, పిరుదునందునను, తొడలయందునను, అడుగులయందును, పిక్కలయందును, అండములయందును, యోనిదేశమునను, బొడ్డునను, వీపుమీదను, కనుబొమలమీదను, కనుకొలకులందును, రెప్పలందును, చెవిమూలములందు, గండభాగమునందును సుళ్ళుండదగు సులభసాధ్యము. | |
క. | కకుదంబున హల్లకమున | 19 |
| మూపుమీదను హల్లకమునను గుదస్థానమునందును చంకలయందును సుళ్ళుగలిగిన వాజి దోషయుతమగును. | |
గీ. | జలజకులిశకలశ చామరతోమర | 20 |
| పద్మము కులిశము చెంబు దామరము తోమరము చక్రము ముసలము రోకలి ముకురము (మొగ్గ) శంఖము చంద్రుఁడు మణిఖడ్గము అంకుశము మున్నగువానివలె నుండు తెల్లనిబొల్లి యుండుట మంచిది. | |
గీ. | శూలపాశనిగళ నీలపీతారుణ | 21 |
| శూలము పాశము నిగళము (శృంఖలు-అరదండములు.) నీలివన్నె పచ్చనివన్నెగల బొల్లులుండరాదు, అందువలన కీడు సంభవించును. తలయందును క్రిందిపెదవియందును ముక్కుజెమరలందును బొల్లియుండరాదు. | |
సీ. | దంతాధికంబును దంతకనమును హీ | 22 |
| ఎక్కువదంతములు తక్కువదంతములు గలిగిన గుర్రమును కరాళినికరాళిని (వీనియర్ధము ముందు వివరరింపబడును.) పిల్లిగండ్లు కలదియు యేకపింగళి (ఒకకన్నుదృష్టి) ఒకబీజము కలది పిల్లిచెవులు రెండు పిల్లల నీను గుర్రము నల్లని తాలువలు గలది పెద్దపెద్దగిట్టలు గలది మున్నగు దోషంబులుగల గుర్రములను పెంచకూడదు. | |
| కరాళి = భయంకరమైనది. | |
గీ. | మూడుకాళ్లును గల్గినముసలి యొక్క | 23 |
| మూడుగాళ్ళను తెలుపైన బొల్లియుండి నాలుగవపాదము నలుపైనయెడల నాగుర్రము విషపాది యగును. కాళ్ళు సన్నమైనయెడల దోషముల నెన్నిటినేని బోకార్చును. | |
క. | మెఱుగారిక్రాలు మేనును | 24 |
| మెఱుగెక్కియున్న శరీరమును, సగము విడిచిన పద్మమువలె నుండు నెమ్మొగమును, కాంతివంతములైన కన్నులును చక్కనివాలమును గలహయములు శుభము చేకూర్చును. | |
క. | ఛాయావిహీనమైనను | 25 |
| కాంతివిహీనమైనను కాకి-గాడిద-గుడ్లగూబ మొదలగువాని స్వరముబోలిన స్వరముగల కురంగములు చిరాయువులుగ నుండవనిపెద్దలమతము. | |
క. | వరగినమొగమును నాలుగు | |
| శ్వరునకు నత్తురగం బిల | 26 |
| నాలుగుకాళ్ళను తెలుపు గలిగియున్న హయము పంచకల్యాణి యనందగును. అయ్యది రౌతునకు సర్వదా జయము కలిగించును. | |
క. | నాలుగుకాళ్ళుం గొనచెవి | 27 |
| నాలుగుకాళ్లును చెవులయొక్క కొనలును తోకయును ముఖమును విశాలమైన వక్షస్థలమును తెల్లనివై యున్నయెడల నాగుర్రమును యష్టమంగళి యందురు. ఆగుర్రమును పాలించువాడు ధరణీపతుల నేలును. | |
క. | హేషారవంబు గజగళ | 28 |
| గుర్రములయొక్క ధ్వనినిగూర్చి చెప్పుచున్నాడు. సులభసాధ్యము. | |
క. | తొల్లి శతాయువు హరులకు | 29 |
| పూర్వము బ్రహ్మ గుర్రములు దుర్జనులగువారిని గూడ మోయుచుండుట జూచి విచారపడి వాని యాయుఃప్రమాణమును ముప్పదిరెండుసంవత్సరములుగా నేర్పరచెను. | |
క. | వన్నె సుధాధవళంబై | 30 |
| తెల్లనిశరీరము గలదై నల్లనైనటువంటి చెవి గలిగిన యశ్వమును కర్ణాంక మందురు. | |
చ. | హరి యని నర్కబింబుని శుకాంగుని గొంగుని గొంగుపాణినా | 31 |
| హరి, అర్కబింబము, శుకాంగు, కొంగ, గొంగుపాణి, తరగిణి, కత్తలాని ఈపేర్లు గలిగిన గుర్రముల నెక్కునప్పుడు ఇంద్రుని కృష్ణుని అగ్నిని శివుని సూర్యుని బ్రహ్మను వాయు చంద్రుని దలచి వారికి నమస్కరించి ఎక్కవలయును. | |
క. | నీలిని నలగని శోణిని | 32 |
| నీలి సలగ శోణి నీలోత్సలము ఈనాలుగుపేర్లుగల గుర్రములు నెక్కునప్పుడు అగ్నిని వాయుదేవుని దలంచికొనిన శుభము చేకూరును. | |
క. | చతురమగు నొసల నాలుగు | 33 |
| గుర్రముయొక్క నొసటను చతురాకారముగ నాలుగుధృవు లున్నయెడల నాగుర్రము తన్నేలినదానిని పదునాలుగుదేశములకు పట్టభద్రుని చేయును. | |
క. | పట్టముక్రియ ఫాలంబున | 34 |
| పటకావలె నుదిటిపై మూడుసుళ్లుగలిగిన యా తురగమును శాలలోనికిఁ జేర్చుము. ఆగుర్రము నేలిననవాడు బహ్మతో సమానుఁ డగును. | |
క. | ఒండొంటి మీద దొంతిని | 35 |
| సులభ సాధ్యము. | |
క. | నిటలమున దొంతివలసయు | 36 |
క. | సులభ సాధ్యము. | |
క. | మిక్కిలి దోరణములక్రియ | 37 |
| అధికముగా సుళ్లు దోరణమువలె నున్నయెడల శుభదాయక మగును. దానిని యధిరోహించు యజమానునకు శుభము చేకూరును. | |
క. | తురగంబు నొసలినిూదను | 38 |
| గుర్రముయొక్క నొసటను రెండుధృవులు గలిగినయెడల తన్నేలినవానికి శుభము చేకూర్చును. | |
క. | కుత్తుకసుడిగల తురగము | 39 |
| సులభసాధ్యము. కుత్తుకమీద సుడి యుండరాదు. | |
క. | ఉభయగళములకు నెల్లను | 40 |
| గళమునకు రెండుప్రక్కలనుగాని యెదుటనుగాని సుళ్ళుగలతురగము కొనవలయు. అట్టిగుర్రము శుభముచేయు. | |
క. | మేలుగ గళంబుక్రిందను | 41 |
| సులభసాధ్యము. గళముక్రింద ఎనిమిదంగుళములకు క్రింద సుడియున్న యిది దేవమణియను సుడియగును. దాని నేలవలయును. | |
క. | దేవమణి క్రిందసుడియును | 42 |
| దేవమణి క్రిందగానున్న సుడిని రోచమానమందురు. అట్టిగుర్రమును భదాయము. తప్పక కొనవలయును. | |
గీ. | రోచమానంబుక్రింద నిరూఢమగుచు | 43 |
| రోచమానముక్రింద జెర్రివలె గొన్నిటిసుడి యుందును. అట్టి గుర్రమును శతపది యందురు. | |
| బాహుల వక్షస్థలముల | 44 |
| ముందరి కాళ్ళమీదను వక్షస్థలంబునను ధృవులు గలిగియున్న యశ్వమును గొనవచ్చును. | |
సీ. | త్రికమున వీపున కకుదాంగకములను | |
| మస్తమధ్యను మానుగాకటములన్ | 45 |
క. | అవయవములందు నెడలక | 46 |
| గుర్రము యొక్క యవయవములందు తప్పక సుడియుండవలయును. ఆసుళ్ళు విచ్చిన్నముగాక యుండవలయును. ఒక్కొకసుడి రెందపదానిని తాకి దానిని వికలమగునట్లు చేయకుండవలయును. అని మనుమంచిభట్టు తనయభిప్రాయము జెప్పెను. | |
క. | మిక్కిలి నశుభములైనను | 47 |
| అశుభసూచికంబులగు సుళ్ళధికముగను శుభసూచికంబులగు సుళ్ళు స్వల్పముగనుయున్న యశ్వమును గొనదగదు. శుభసూచకము లధికముగానున్న పరిశీలించి దాని నెక్కవలయును. | |
క. | కలియుగమున తురగములకు | 48 |
| గుర్రమునకు ముందటి కాళ్లు సన్నములై యుండుట మేలు. | |
క. | వాలంబు బాహుజంఘుల | 49 |
| తోకయు కాళ్లును జంఘలును కంఠము ముఖము చెవులు మెడయును మిక్కలి పొడవైనతురగము మిక్కిలి జనసత్వముగలది యగును. | |
క. | బాహులు జంఘలు మద్యము | 50 |
| కాళ్లును జంఘలును మధ్యభాగము (కటిప్రదేశము) ముఖము తోకయు జెవులును కురుచ లైయున్న యశ్వము వేగముగా పోవునది గాకున్నను బలముకలది యగును. | |
క. | ముష్కములు కురుచ లై కడు | 51 |
| ముష్కములు (వృషణములు) కురుచ గలిగి ఎండిపోయిన ట్లున్నయెడల రూప్యములు ఖర్చు పడునని లెక్క సేయక తప్పక గొనవలయును. ఎంతధనము వెచ్చించినను నష్టములేదు. | |
క. | పలువరుసనేడు దంతాలు | |
| విలువరుపతులకు నెక్కడ | 52 |
| ఏడుదంతములు గలదానిని బలము జవము లేనిదానిని శాంతిలేనిదానిని భూపతు లెక్కకూడదు. దానిని కొనరు. | |
క. | బలువై కొలది వెన్నును | 53 |
| బలమైనట్టియు కురచయైనట్టియు వీపును బలముగలిగి లావైనమధ్యమును పొడుగుపాటితోకయు గలిగినటువంటి గుర్రమును సాలయందు గట్టియుంచుము. | |
క. | బడపల బోలెడిరూపము | 54 |
| ఆడుగుర్రము ముఖమువలెనున్న మొగగుర్రము శుభదాయకము తప్పక నిలుపవలయును. | |
క. | వదనంబును భ్రూలంఘ్రులు | 55 |
| ముఖమును అంఘ్రులును భ్రూయుగమును తెలుపైయున్న యశ్వమును గొనుము. దాని నెక్కినవానికి శత్రుసేనలోని గుర్రములు యేనుగులు సులభసాధ్యములు. | |
క. | భూపాలయపరగాత్రము | 56 |
| కంఠముయొక్క క్రిందిభాగముగాని మీది భాగముగాని దెల్లనైన గుర్రమును నధిరోహించుము. అట్టిహయమును కొనినవానిగృహంబును నైశ్వర్యములు సర్వదా నిలచియుండును. | |
గీ. | నొసల జుక్క లేక శశికాంతి నొకకాల | 57 |
| నొసటిమీద తెల్లనిమచ్చ లేకను, మూడుకాళ్లును తెలుపుండి యొకకాలను తెలుపు లేకున్న నాయశ్వమును మొసలి యందురు. దానిని గొనవలదు. | |
క. | వలపలికాళ్ళును రెండును | 58 |
| వలపలికాళ్ళు రెండును తెల్లని వైనయెడల నాహయమును తప్పక గొనుము, ఎడమభాగము తెల్లనైన నాహయంబులను గొనవలదు. | |
క. | పాదములు మూడు గడగిన | 59 |
| మూడు పాదములు తెలుపై యొకపాదము నలుపైన మొసలి యండ్రు. అటుగాక మూడు నలుపై యొకటి తెలుపైన నది విషపాది యని పిలువబడును. | |
క. | ఎక్కగ జన దమ్మొసలిని | 60 |
| ఆమొసలి యని పిలువబడు తుగంగమును యెక్కబోవకుము. అది విషపాదియగుటచే నింద్యము. నుదుటను చక్కనిబొల్లి యున్న యశ్వము నెక్కుము. | |
క. | పట్టరు గోడిగ నేక్రియ | 61 |
| గుర్రముయొక్క పృష్ట భాగము వెల్లనై యున్నయెడల నాగుర్రమును కొనరు. అధికముగ మూత్రమును విడుచు హయమును గూడ దోషము కలుగునని తలంచి గొనసాహసించరు. | |
క. | పురుషాశ్వమునకు ముందట | 62 |
| మగగుర్రమునకు ముందటిభాగము సూర్యుని యొక్క వర్ణమైనచో బుద్ధిమంతులు దాటిపోనీయరు. తప్పక స్థిరచిత్తముతో గొందురు | |
.
క. | శ్రీజన్మసదనరాజ | 63 |
| షష్ఠ్యంతములలోనిది గావచ్చును. పెక్కులగు మాత్రుకలలొ నీపద్యము గానరాదు. | |
వ. | అభ్యుదయపరంపరాభివృద్ధిగా నాయొనర్పంబూనిన హయలక్ష | 64 |
| అశ్వములకు సంబంధించిన వివిధములగు లక్షణముల చెప్పెనేని సూచించినాడు. సులభసాధ్యము. | |
ఉ. | అంబుధివేష్టితావనియు తాజి జయంబు మహాయశఃప్రతా | 65 |
| గుర్రము లధికముగా నేభూపాలునియొద్ద నుండునో యాభూపాలుఁడు చతుస్సముద్రముద్రికధరావలయంబు పరిపాలించుచు యశఃసాంద్రుడై లక్ష్మీయుతుఁడై సర్వసౌఖ్యంబుల నొందుచు అధికవైభవము గలవాఁ డగును. | |
చ. | అరయగ సర్వలక్షణసమంచితమైన తురంగరత్న మీ | 66 |
| సర్వశుభలక్షణములను గల్గిన గుఱ్ఱ మేనూనపునియింట నొకదిన౦బు యున్నను యామానవునకు యధికంబులగు ధనంబులు లభించి స్థిరమై నిలిచియుండును. | |
మ. | జనసత్వాన్వితవైభవావళులచే సంపూర్ణమైయుండు నే | 67 |
| గ్రంథపాతముచే గడమపాదము నశించినది. అర్ధము స్ఫురించుటలేదు. | |
చ. | ................................................................ | 68 |
| గ్రంథపాతము పైపద్యముతో కలిసి పెక్కుమాత్రుకలందు కలదు. | |
చ. | దూరము బోవునప్పుడును దుర్దమశత్రునృపాలసైన్యముల్ | 69 |
| దూరదేశముల కేగవలసివచ్చినప్పుడును శత్రువులను జయింపబోవు నప్పుడును వేటాడుటకుమున్న విద్యాప్రసంగముల దేలునప్పుడు | |
| ను రాజులకు గడుంగడు సహాయ మొనరించి జయము చేకూర్చును. యిట్టి సహాయ మొనర్పదగిన వేమైన గలవా? | |
ఉ. | వారణసేవ లెన్నయిన వాజిబలుండగు రాజు కెప్పుడున్ | 70 |
శా. | విశ్వంబందు వసుంధరాపతులకున్ విఖ్యాతిబీజంబులై | 71 |
చ. | కరిరథవీరభీషణవికారజలగ్రహకోటిచేత దు | 72 |
| గజబలములు రథములు పదాతులు జలములతో నింపబడిన కందకములు గల్గి తరింప శక్యమి కాకయుండు శత్రురాజుల సైన్యమను పాలసముద్రమును ద్రచ్చుటకు నశ్వమె మందరపర్వతము. అదియే లేనిచో శత్రుసైన్యపయోధి ద్రచ్చుట యెట్లు? | |
మ. | ధరణీమండల మెల్ల నశ్వముల చేతం జాల సిద్ధించు న | 73 |
| రాజ్యభోగములు అశ్వముల చేత లభించును. రాజ్యమువలన ధర్మార్థకామమోక్షంబులను చతుర్విధ ఫలంబులు లభించును. కా | |
| వున రాజుల జయమునకు సౌఖ్యమునకు (యిహపరసౌఖ్యమునకు) మూలకారణము లీయశ్వములె గదా. | |
శా. | దావానేక పరోహిరంబు ధరవోత్తాలంబు శాంతాపశం | 74 |
చ. | పరశుభలక్షణంబులను వర్ణనకెక్కిన ఘోటకంబులన్ | 75 |
క. | వర్జితదుష్కృతసుకృతో | 76 |
సీ. | చెలగి దేవాసురాదులకు నయ్యింద్రుడు | 77 |
మ. | సుమనోవాహిని రోమరాజి జలధి స్తోమంబు కాంచీకళా | 78 |
చ. | తురగము నాజి నెక్కి నిజదోర్బలలీలల జూపి విద్విష | 79 |
ఉ. | నెమ్మది లోన నెంతయును నిశ్చలభక్తి చరింపరేవు నే | 80 |
చ. | సమవిష మాజి రంగముల శత్రుశరంబుల దూరి పారుచో | 81 |
మాలిని. | పరిహృతరిపు గర్వా ప్రాప్త గర్వాప హర్వా | 82 |
గద్యము..................................................
భైరవాచార్యపుత్ర మనమంచిభట్టు ప్రణీత
మైన హయలక్షణవిలాసంబునందలి
ప్రథమాంకురము