Jump to content

అశ్వలక్షణసారము/ద్వితీయాంకురము

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు

అశ్వలక్షణసారము

ద్వితీయాంకురము



రమణీసేవాస్పద
పారీణ వివేకపరమపావనమూర్తీ
సారాచారవదాన్య
క్ష్మాహరు విద్యావిహార కంపకుమారా.

1


లక్ష్మీదేవిని సేవించునటువంటి వివేకములుగలవాడు పావనమైన
వాడా... కృతిపతియైన కంపకుమారుని కన్వయము.


క.

తురగస్తుతి పద్యారస
ధరవిశ్రుతగతుల రీతి దగజెప్పెద నా
దరభరితహృదయపద్మము
కరమరుదుగ జినికి దొడవుగా జేయు మొగిన్.

2


క.

వరలక్షణనామంబులు
పరిపాటిగ జెప్పుచోట పలికిన రీతుల్
పరిశించి కరుణసేయుడు
సరసగుణోదారు లయిన సత్కవులెల్లన్.

3

శుభలక్షణముల నామములను అవియుండు స్థానములను బాగుగా పరిశీలించి ఒప్పులు పరిగ్రహించి తప్పులు మన్నింపుడు. ఈపద్య
ము గ్రంథారంభములోనిదై యుండివచ్చును.


క.

 ప్రకటంబుగ నావృత్తము
మంగళము సత్సావలీఢ మూర్మము సాదు
ర్ధకమును శుక్తిశతపదియ
నగసుళ్లీ క్రియ నెనిమిది యేతద్రూపంబుల్.

4


ఆవృత్తము, ముకుళము, వత్సము, అవలీఢము, మూర్మము, పాదుకార్ధము శుక్తి, శతపదియను ఎనిమిదివిధంబులుగ నుండును.


సీ.

ఆవర్తన మరాపగావర్తమున కెన
             పాదుక పాదంబు పాయగొమ్మ
ముకులంబు మల్లికా ముకులంబు సైదోడు
             శతపాది జర్రికి సరిగడంబు
చిప్పకు శుక్తి నెచ్చిలి పాదుకార్ధంబు
             తునిసిన భాగంబు తోడుదోడు
దూడ నాకువునకు దొనయ వల్మీకంబు
             మూకకు మంచునమూహ మరయ
నిట్టిసుళ్ళ ప్రమాణంబు లేర్పరింతు
పూర్వశాస్త్రక్రమంబున బొల్పు మిగుల
అహితహృద్బల్లరాయసౌహత్తిమల్ల
మహిత విభవేంద్ర కంపకుమారచెంద్ర.

5


అవర్తమనుసుడి - గంగలోనిసుడి, ముకుళము - మల్లెమొగ్గ, శతపాది - జెర్రి, శుక్తి - ముత్యపుచిప్ప, పాదుకార్ధ - విరిగినపాదంబు, వల్మీకము - పుట్ట, మూక - మంచు సమూహవలెయుండును.

వ.

................తత్ప్రమాణంబులు సుళ్ళయొక్క ప్రమాణంబుల చెప్పుచున్నాడు.


సీ.

అంగుళత్రయమున నవలీఢకము నిల్చు
             రెండంగుళంబుల నుండు శక్తి
చతురంగుళంబుల శతపాది పరినాటి
             పాటించు నంతన పాదుకయును
ముకుళంబు సుడియును మోబునంగుళ చతు
             ర్భాగంబునందు త్రిభాగముగను
పాదుకార్ధము హీనపాదాంగుళంబున
             మూకమష్టాంగుళమున దనర్చు
నిట్లు చెప్పిన వాటిని నెల్ల సుళ్లు
నిలిచెనేనియు దమతమ ఫలము నిచ్చు
నట్లు కాకుండ నం దల్ప మధికమైన
చండభుజబల మీసరి గండకంప.

7


వ.

ఇట్లు వివరించిన యెనిమిది దెరంగుల సుళ్ళులోపల శుభాశుభవర్తంబులు పరికించునెడ నావర్తంబులు ముకుసంబులు శుక్తులు శుభంబులు ప్రధానంబులై యుండు. తదావర్తంబులు వాహంబులకు కొన్ని శుభంబులు కొన్ని యశుభంబులు నన రెండు దెరంగులై యుండు నని ధృవావర్తంబులు పదియును పదినెలం బాయకుండు నాగంతుకంబులయిన శుభాశుభవర్తంబులు నూటపదమూటిలోన ముప్పదియేడు శుభంబులను దెబ్బదియారు యశుభంబులును
ననబరగుచుండు తత్పలంబులు తన్నివాసంబులు ధృవంబుల కధిదేవతలకు గ్రమంబున వివరించెదను.

8


పైన వివరింపబడిన యెనిమిది విధంబులైన సుళ్ళలోనును శుభాశుభములను గనుగొనునప్పుడు ఆవర్తము. ముకుళము శుక్తి శుభ

బాయకములై యందును. ఆవర్తములలో శుభాశుభములు కలిగి రెండు తెరంగులైన యావర్తంబులయ్యెను.


క.

ఉరమున శిరమున రంధ్రో
పరంధ్రముల రెండు ప్రస్థానములో
నుత్తరమున నొకటొకటిగ
నరవాజుల పయిని దశ పదిధృవులయ్యెన్.

9


గుర్రమునకు 10 ధృవులుండవలసినస్థానముఁలు. చూడు - ప్రథమాశ్వాసముస 11 న పద్యము, మరల నిచ్చట నేల చెప్పబడియెనో తెలియదు.
గుర్రముయొక్క తొలంకులఁకును, శిరముమీదను నుదుటను... వక్షమునందును.

అధిదేవతలు

మ.

పరగంవాజి తొలుంకులం శిరముఫై ఫాలప్రదేశంబునన్
వరుసన్ వక్షముపై జనించిన సుడుల్ వర్ణ్యంబులో సుళ్లకున్
నరనారాయణ యక్షరాక్షసధృవుల్ నక్షత్రనాథార్కులు
న్నరతాప్తుండును మందగంధవాహుడున్ నా సత్యలుం దేవతల్.

10


గీ.

మొండిమస్తకహీనమై యుండు వాజి
జకలకు జెడ్డయది కడు ముట్టదగదు
మున్ను తానున్న నెలవున నున్న హరుల
నన్ని గొనికాని నిలువనీ దెన్నిగతుల.

11


చిన్నతల గలిగియుండి సుళ్ళు లేక మొండిదైనట్టి హయమును ముట్టుటకైనను తగదు. అది శాలలోనున్న యితరగుర్రములకు గూడ హాని చేయును.


క.

నెలవుల ముప్పదియును గల
తురగంబును బ్రతుకు పెద్దకాలముశుభ మై

నిలువదు తడవేశుభములు
వెలయక యని కొన్ని ధృవులు వెలితైయున్నన్.

12


ముప్పదిసుళ్ళకు తక్కువయైయున్న గుర్రము ఎక్కువకాలము బ్తుకనోపదు.


క.

నెలవులు విడిచిసదమలో
పల నొక్కటి విడువబడిన పరిపాటి మెయిన్
నిలువక తక్కినధృవములు
గలతురగము బ్రతుకు వాడు గట్టగనగునే.

13


ధృవు లుండవలసిన స్థలములలో నున్న యెడల నాగుర్రమును బ్రతుకదలచువాడు కట్టదగదు.


క.

హీనావర్తంబులు ఫల
హీనముగా జేయుకొలది నెక్కువయైనం
మానని నెవ్వగ నొసగును
గానం ధృవుకొలఁది నిలుపగావలె హరికిన్.

14


ఆవర్తంబులను సుళ్ళులేని తురగము ఫలమీయజాలదు. ఎక్కువయైన నావర్తంబులు గల తురగముగూడ తీరనివ్యధ నొసగును. గాన కొలదిగా ధృవులు గలిగి హరిని నిలుపవలయును.


క.

నడుము దెగి రెండదెగవై
పొడమినధృవుగలుగువాజి బోదోలకనే
జడుడు తెగి నెక్కు నాతని
ఒడలుసదల పొత్తకూడి యుండడు తడవై.

15


సుడినడమున తెగి రెండు చేయబడిన తురగమురు సాహసించి యెక్కువాడు చిరకాలము జీవించడు.


క.

నెలవుల నిలుపక దావలి
వలకలిదెసకు తొలగియున్న వలపలిసుడి దా

పలిదెసకు జనిన హరి భూ
స్థలి నిజభూవిభుని రాజ్యవిత్తచలనలు సేయున్.

16


కుడివైపున నుండవలసిన సుడి యెడమవైపునను ఎడమవైపున నుండవలసిన సుడి కుడివైపునను యున్న తురంగము యజమానుని ధనహీనుని జేయును.

శుభావర్తంబులు

క.

సెలవుల నుదట బాహులతో
కలనొస కంఠతలల కేశాంతములన్
గూబలపై సరసత
గల సుళ్ళు శుభము నిచ్చు కంపనృపాలా.

17


శుభావర్తలక్షణంబుల దెల్పుచున్నారు.
సెలవులందును నుదుటలందును బాహువులందును, నొసటలందును కంఠగలమందును కేశాంతమందును చెవుగూబల యందును సుల్లుగల తురగము శుభముల నొసగును.


సీ.

శలవుల కేశాంతముల రెండు రెండట్ల
             కొలకుల పదల వీనుల మొదళ్ళ
మూడు నాలుగు రెండు మూడులై నెలవుల
             నాల్గింటసుళ్లున్న గల్గునొసల
అదిమూడు నాల్గునై పదమూడుచోట్లను
             పండ్రెండు సుళ్ళలో భాగములను
కరయుగంబున రెండు గడలనివాడ
             వస్తువముల మూడు వరుస నిట్లు
నెలవు లిరువదిన్ని బెటవార నిలిచిన
సుళ్లు ముప్పదియేడు శుభతరములు

తత్ఫలంబులెల్ల తర్వాత వివరింతు
కంపరాజ భూనిలింపరాజ.

18


సెలవుల యందును కేశాంతములయందును వీరుల యొక్క మొదల్ళును.


క.

చక్కగ సెలవుల రెంటన్
జక్కనిరోమజములున్న సైంధవరత్నం
బెక్కన రౌతుకులంబున
నక్కాలమునిచ్చుచుండు నిష్టార్థంబుల్.

19


సెలవులయండు రెండురోమజములు (సుళ్లు) గలిగినటువంటి తురంగమును ఎక్కినరౌతునకు సర్వకాల సర్వావస్తలయందును యిష్టార్థముల నిచ్చుచుండును.


క.

శుక్తులు కేశాంతములను
వ్యక్తములై రెండుగల్గు వాహము నెక్కన్
యుక్తిగలవాడు విజయా
సక్తుండౌ పుత్రపౌత్రసంపద గలుగున్.

20


కేశాంతములందు సుళ్లు కలిగిన గుర్రము నెక్కినవాడు విజయుడై పుత్రపౌత్రసంపదలతో తులతూగుచుండెను.


గీ.

హయము రంద్రోపరంధ్రపర్యంతభూమి
గానవచ్చిన సుళ్లు మేఖలములంచు
అట్టి మేఖలి కెక్కిన యధిపు డెపుడు
మణివిభూషణ సౌభాగ్య మహిమ దనరు.

21


క.

నిలుతురు తురంగవేదులు
నెలయగ జెవిగూబలందు వృషభావర్తాం
బులు గల్గుతురగరత్నము
విలసన్మణికుండలాదివిభవము లిచ్చున్.

22

చెవి గూబలయుదున్న సుడికి వృషభావర్తం బనంబడును. వృషభావర్తంబుగల తురంగమును హయలక్షణశాస్త్రసంపన్నులు అధికవిభవంబుల నిచ్చునని త్వరితముగ నిలుతురు. (కొందురు).


సీ.

నలుమూలలనుండు నాల్గురోమజముల
             బాతురంతికమను ! సౌంజ్ఞ దనరి
ముమ్మూలలందుండు మూడురోమజములు
             త్రేతాగ్ని నాగ విఖ్యాతి దనరి
మొగిదంతియై యుండు మూడురోమజములు
             నిశ్రేణికాఖ్యమై నివ్వటిల్లు
సంగడియై రోమజములు రెండుండును
             యమళమనామధేయంబు మించి
హయముఫాలంబుమీద నీ యాకృతులను
దావకంబుల నాల్గింట దనరి మించి
సుళ్ళు పండ్రెండు ఫలమును సొరిది వినుము
రాజదేవేంద్ర యోభళ రాజకంప.

23


నాలుగుమూలలను నాలుగు సుళ్ళుండినయెడల నద్దానిని బాతురంతికమందురు. త్రికోణాకారముగ మూడుమూలల సుళ్లుండిన త్రేతాగ్నియందురు. దొంతిని విధంబున మూడుసుళ్లుండిన నిశ్రేణిత యనంబరగును. రెండుసుళ్లు సమీపంబున నుండ యమక మందురు. ఈసుళ్ళన్నియు నొసట నుండవలయును వీనిఫలముల జెప్పుచున్నాను.


క.

నెన్నొసలజాతురంతిక
మున్న తురంగంబునుతమహోత్సవకరమై
సన్నుతధరణీరాజ్యస
మున్నతసౌఖ్యంబు లిచ్చు నోభళకంపా!

24

నెన్నోసలుమీద చాతురంతికమను సుడియున్న తురగమును మహోత్సవకరమైన ధరణీరాజ్యసుఖంబుల నిచ్చునని విలుతురు.


క.

నిశ్రేణితఫాలంబున
విశ్రుతమగు ఘోటకంబు విశ్వములోనన్
అశ్రీనిలసత్పరిరంభో
గశ్రేయవిభవ మిచ్చు గంపమహీశా.

25


నిశ్రేణికయను నామధేయముగలసుళ్ళు ఫాలభాగముపై నేయశ్వమున కుండునో అది విభవైశ్వర్యముల నొసగును.


మ.

పదిలం బారగ సుళ్ళునాలుగు నురోభాగంబునం దిక్కులం
గదియంగాదగు రోచమానము సుముఖ్యస్థానమం దుండెనా
నది శ్రీవక్షకి నామధేయమగు నాయశ్వంబు చేకూర్చు స
మ్మదలక్ష్మీశయభోగభాగ్యవిలసన్మాన్యప్రతాపోన్నతుల్.

26


ఉ.

నాలుగురోమజాతముల నాలుగుమూలల పేరురంబు పై
దాలిచియున్న తేజి ప్రమదంబున నెక్కెడి మానవేశ్వరుం
డాలయలోన శత్రునిచయంబు నణంచి తదీయ ల
క్ష్మీలలనావిశేషసుడి కేరిగనున్ మహికంపభూవరా.

27


గీ.

సోలిమరముమీద శుక్తులుమూడుండు
సైంధవంబు సర్వసౌఖ్యదంబు
దాని నెక్కి శత్రుసేనల జెండాడి
విభుడు మగుడి దివ్యవిభవు డగును.

28


ఉరముమీదను మూడుసుళ్ళుగల తురగము సర్వసౌఖ్యములను ఇచ్చును. అట్టిగుర్రము నెక్కినవాడు శత్రు సేనల చెండాడి అధికవిభవము కలవాడగును.


క.

అంగద నామముగల్గుతు
రంగము బాహువులు సుళ్లు ప్రఖ్యాతముగా

రంగ నవరత్నవిభవా
సంగత మొగి నిల్ప సర్వసంపద లొసగున్.

29


అంగదనామము గలిగినటువంటి తురంగములకు బాహువులందు సుళ్లున్న యెడల నానావిధరత్నభూషణములగు సర్వసంపద లొసగును.


క.

దేవమణి దేవమణియును
మానవుని గళంబు జేరి మహినుండుట న
ద్దేవమణి గల్గుతురగము
దేవేంద్ర శ్రీయొసంగు కృతిగరిం నృపా!

30


సీ.

ప్ర్రాసాదతోరణవరత్రింశ...........
             సరసిజవేదికాస్వస్తికములు
త్రేతాగ్నియమళనిశ్రేణికా శ్రీవృక్ష
             చాతురంతికగదాచక్రములును
కలశాంగలశుక్తి ఖర్జూరఖండేందు
             వజ్రయూపాంకుశకల్పకములు
అశ్వత్థవర్ణ సూర్యాష్టపదాంబుజ
             పాంచజన్యంబుల పగిది నుండు
ధృవు లురముపై నుండె నొసలిపై నొండె గల్గు
తురగరత్నంబు నెక్కిన నరవరేణ్యు
డరుల నిర్జించి తద్రాజ్య మనుభవించు
రాజకులదీప యౌభళ రాజకంప.

31


సీ.

కటికంఠనాసికాపుటగండకరమూల
             జానుమాన్యాహనుస్కంధములను
అలీఢసృక్సిండపాలాశ్రుతాండవ
             కుక్షివాలస్థూలక్రోడములను

భ్రూమధ్య కర్ణాగ్రములరెండు రెండుగా
             క్రోడఘోణాసనప్రోధములను
కాకసగణనాభి కకుచుత్తరోష్టపు
             హృతనాభిగండంబు లొకటియొకటి
కుష్ట్రికముల గళల గూర్భల జంఘుల
నాల్గుకాళ్ళసుళ్ళు................సుళ్ళు
మొగిసి సాన మెగువ మూగి డెబ్బదియారు
గాని హయమునకు మేనకంప.

32


క.

చిత్తము సుడియడరాచును
విత్తుల సుడి పుత్రహరము వీపున సుడి దా
హృత్తమునకు సరి హరికిని
కుత్తుక సుడియున్న హయమ్ము గొనరాచార్యుల్.

33


బీజములపై సుడియున్న తురగమును ఎక్కినరౌతునకు పుత్రనాశనమగును. కుత్తుకమీద సుడియున్నను ఆతురగము కొనుటకు తురంగశాస్త్రజ్ఞులు సమ్మతించరు.


చ.

కటమున శంఖదేశముల కన్నులకొల్కుల ప్రోధగండహృ
త్నుటముల కక్షమూలముల పుచ్చగుదంబుల్ క్రిందటన్ కకు
త్తటముల కొక నాసనపదంబుల జంఘల జానుసంధులన్
బటవగుసుళ్లు వింశతియు పైనను యారుమహోగ్రదోషముల్.

34


గ్రంథపాతమువలన యీ పద్యము నశించినది. అక్షరములు స్ఫుటముగ కాన్పించుట లేదు. అచ్చుపుస్తకముందున్న పద్యమున తప్పులు మెండుగ గానంబడియెను. అందుచే విడువబడెను.

35


ఉ.

కాకసమందు రోమజము గల్గినవాజియు రౌతు నాజిలో
నూకి కళేబరంబు మరి నూల్కొనియుండగ జేరి యుగ్రపుం

గాకులు గ్రద్దలుం గరచి కండలు గుండెలు బీకిబీకి పే
రాకలితోడ మ్రింగుభయదారనము ల్దిశలెల్ల నిండగన్.

36


చ.

హరికకుదంబుపై సుడి మనోదురితంబుగ సర్వసౌఖ్యసం
హర మొనర్చు నట్టిసుడి యశ్వము గట్టిన నింట చుట్టినన్
సురలకు విప్రముఖ్యులకు జూడక ముట్టగ యివ్వనొప్పు లే
కరి రిపుడేలు రాజ్యమున కప్పుడె పారగ కోటలప్పగున్.

37


గుర్రమునకు మూపుర ముండవలసిన స్థలమున సుడియున్నయెడల నయ్యది మహాదురితములు గలిగించును. కావున అట్టి సుడి గల తురగ మిటచుట్టినయెడట కంటిదానిని చూడక విప్రుల కీయవలయును. లేదా శత్రురాజ్యమునకు దోలవలెను.


క.

కక్షావర్త తురంగము
నక్షీణబలంబుగల్గు నధిపతికైనన్
నాక్షేణమ్ముల వానల
నక్షయముగ దట్టవు నాభళాదిపకంపా.

38


కక్షావర్తమను సుడిగల తురంగము అధిపతికి నష్టము కలిగించును.


క.

ఎదనొప్ప నంపవానల
గదియుచు గురియించుననుచు ఘను లెవ్వరుం
గదిసి కనువిచ్చిచూడరు
హృదయావర్తంబు వాజి నెక్కందగునే.

39


హృదయావర్తమును సుడిగల తురగము నెక్కినచో శరపరంపరల జిక్కి, ఓటమి జెందుదుమని జను లెవ్వ రద్దానిని జూడరు.


ఉ.

జానువునందు సుళ్ళుగల సైంధవమున్ బాది నెక్కువాడు శో
కావలదగ్ధగదేహుఁనడగు కాంక్షణచే యది శాల నుండినన్

మానకచో వైరినృపమార్గణరోగవిషాణ్నిలదా
ధీనుని జేసి రాజ్యసుఖహీనుని జేయుట తధ్య మేరికిన్.

40


మోకాళ్లను సుళ్ళుగల తురగము నెక్కినవాడు శోకదవానలమందు జిక్కి యుండును. అట్టిగుర్రము ఎవనిశాలలో నుండునో యాతడు చొంగల చేతను శత్రురాజులచేతను రోగాదులచేతను పీడించబడి రాజ్యసుఖదూరు డగును.


క.

వెన్నున సుడిగలతురగము
కన్నంతనె విడక యెక్క నడగుట యెల్లన్
మున్నుగొని బహ్మరాక్షను
దున్న మహీజంబు నెక్క నుబ్బుట తలపన్.

41


వెన్నుపై సుడిగల తురగమును చూచినంతనే విడిచి పెట్టక ఎక్కుటచూడగా బహ్మరాక్షసుడు నివసించియున్న మహీజమును ఎక్కుటవంటిది.


చ.

హరికకుదప్రదేశముల నశ్వము రొమ్మున వాజి వెన్నునన్
తురగము జానుదేశముల దోచినసుళ్లు మహోగ్రదోషవి
స్ఫురణను దాని..........జూచి జలంబుల గ్రుంకు నట్టి భూ
సురులకు దానమిచ్చి పరిశుద్ధుడు గావలె కంపభూవరా.

42


క.

బటువై యావర్తంబులు
కటముల రెండెడల గల్గు గంధర్వము లు
త్కటదోషకారి యది దా
కటకటమున పతిని జమునికడ కనుపుజుమీ.

43


గండభాగములందు రెండుప్రదేశముల సుళ్ళుగల తురగములు ఎక్కువయైన దోషములు కలిగించవనియు శీఘ్రకాలంబున రౌతును యామ్యదిశానాథునిపురమున కంపును.

క.

శంఖావర్తతురంగము
సంఖ్యాతబలంబుగల్గు జనపతిసేనన్
పుంఖానపుంఖశరముల
ప్రేంఖితుగా జేసి యతని పెంపణగించున్.

43


శంఖావర్తనమను సుడిగల తురగమునెక్కిన రౌతుయొక్క చతురంగసేనలను చంపి అతనియొక్క పెంపు సంపద నశింపజేయును.


క.

శోకావర్తతురంగము
భీకరహాయకరిపదాతిబృందమునైనన్
జీకాకు సేయుగానం
గైకొన రత్తేజి రాయగండరగాలీ.

44


శోకావర్తననును సుడిగల తురగము గలిగియున్న సేన పరరాజులచే చీకాకునొందింపబడునని రాజులు అట్టిహయంబులు కొనరు.


క.

పండితులు ఘోటకంబులు
గండములనైనసుళ్ళు కర్తలకు మహా
గండము లని హయవేదులు
పండితసమ్మదము జూపి పల్కిరి మొదలన్.

45


గుర్రములకు గండభాగములందు సుళ్ళుండినయెడల యజమానునకు గండమగునని హయవేదులు జెప్పిరి.


క.

దండముసుడి గల తురగము
భండనమున నమ్ముతోడ బలుదెస ననుపున్
చండమరీచీవలస
న్మండలమధ్యప్రదేశమార్గము దూరన్.

46


క.

క్రోడావర్తతురంగము
వేడుక నెక్కంగగోరు వెఱ్ఱికి నోరున్

మూడుట నెక్కమయని ము
న్నాడిరి హయశాస్త్రవేదు ళౌబలకంపా.

47


క్రోడావర్తతురంగమును ఎక్కదలచువానికి నోరు మూయబడుట సంభవించును. అపజయము కలుగును. అన్ని హయవేదులైనవారలు దెలిపియుండిరి.


గీ

గ్రంథపాతము బాణనామకక్రిముల కాహారమైనది స్పష్టముగా గానిపించుట లేదు.

48


క.

నాసాపుటమున ధృవులును
భాసిల్లెడు వాహ మెచట బంధురరోగ
వ్యాసంగునిగా చేయుట
మోసంబది దానినెక్కు మూఢుడు గలడే.

49


ముక్కురంధ్రములసమీపమున సుళ్లుగల తురగమును ఎక్కజనదు. ఆతురంగము నెక్కుటవలన రౌతునకు రోగప్రాప్తియగును. ఎంతమూఢుడైనను దానినెక్కబోడు.


క.

వ్యాధులచే గడు
బాధించుచు నేత్రకూలు భవరోగములన్
శోధకులు వినుడు మీరె వి
రోధము గావించు హయము భ్రూమిద్విముడున్.

50


నేత్రకూటములందు రోమములు గలిగిన తురంగము యజమానుని మనోరోగములచే పీడింపబడునట్లు చేయునని యెఱుఁగవలయును.


క.

ఘోటంబుల సుళ్ళుండిన
ఘోటంబుల పతుల మీరి కులము నణంచున్
పాటించుచుండి నడచును
పాటించిరి శాస్త్రవిధులు బర్చరబాహా.

51


సులభగ్రాహ్యము.

క.

ముకుదూలంబున నడుమున
ప్రకటితముగ రోమజంబుపాలిట్లిన ఘో
టకము విభుమృత్యుదూతని
సకలతురంగజ్ఞులెల్ల చదివిరి మొదలన్.

52


ముక్కుదూలము యొక్క మధ్యను సుడియున్న తురంగము మృత్యుదేవతయొక్క దూతయని దలచి హయలక్షణవేత్తలు బలుకుదురు.


ఘనమగు దారిద్ర్యంబున
మునగగ నెదగోరునట్టి మూఢుడు గొనుచో
హనుజములు కొనుచునాహము
ననుపమమగు నారాయ మీనలాంఛితకంపా.

53


దవడలయందు రోమములుగల తురగమును దరిద్రముగోరుకొనువాడు దక్క నితరుడెవ్వడును కొనడు. మిక్కిలి దారిద్ర్య మొనగూర్చును.


క.

కరగంబు మీదిపెదవిన్
నిరతముగా రోమజంబు నిజమగుతల్లిన్
సురరాజు జూడననుపును
చిరకాలంబుండనీదుసిద్ధం బధిపా.

54


తురగముయొక్క మీదిపెదవిపై సుడియున్న యెడల రౌతుయొక్కతల్లిని స్వర్గమున కంపును.


క.

పొలియంచు వాజిప్రోధ
స్థలికిందటి మూడురోమజంబులలో
పలిసుడి పతిజనకునివల
పలిపతియన్న గనుమధ్యభాగము పతియున్.

55

గుర్రముయొక్క ముక్కుక్రిందను మూడు సుళ్లుండిన యెడల దాపలిసుడి రౌతుయొక్క జనకుని వెలుపలిసుడి రౌతు యొక్క సోదరుని మధ్యసుడి రౌతును సంహరించును.


క.

పెదవులసుళ్ళు హయం బే
విధమున నిజభర్తసౌఖ్యవిభవము లెల్లన్
నిధుబింబము నలరాహువు
విధమున నది మ్రింగు దనకు వ్రగ్గైనయెడన్.

56


రెండు పెదవులందును సుళ్ళుండరాదు. ఉన్న యెడల రౌతుయొక్క సిరిసంపదలను చంద్రుని రాహువు కబలించురీతిని గబళించును.


క.

కందము సుడిగలతురగము
నిందింతురు తురగశాస్త్రనిపుణులు దానిన్
డెందమును భీతి గల్గిన
ముందర మనువారు వాజి మొన నెక్కుదురే.

57


మూపున సుడిగలతురగమును హయలక్షణవిదులైనవారలు గొననిచ్చగింపరు.


క.

భావకులు వినుదుతురగము
గ్రీవావర్తంబు మిగుల గీడై భువిలో
నేవిధమున నారోహకు
జీవంబున తిరుగనీదు సిద్ధంబు హరీ.

58


గీవావర్తమను సుడిగలతురగము రౌతునకు హానిసేయుచు పెక్కుదినము లాతని భూమిలో నిలువనీయదు.


క.

మన్యావర్త తురంగము
విన్యాసము భర్తవంశవిభుప్రాణముపై
అన్యాయము తలచుట గుణ
ధన్యాత్ములు దాని నెక్కదగగొన రెందున్.

59

మన్యావర్తమను సుడిగలకురంగము యజమానుని ప్రాణముల దీయదలచునని తలచి ప్రాజ్ఞులైనవార లద్దాని నధిష్టింపనొల్లరు.


క.

మునుచెంపల రోమజములు
గనుపట్టు హయంబు నెక్కగడుగుట యనిలో
తనభటు డానుతథ్యము
నెనుబోతును ప్రియముతోడ నెక్కుట కృష్ణా.

60


ముందరిచెంపలపై సుళ్ళుగలతురగమును యెక్కుట యుద్ధభూమికి భటసైన్యపరినృతుఁడై ఎనుబోతుల నెక్కి పోవుట వంటిది. అశుభకరము.


క.

తక్కగ శత్రుక్షోభము
మిక్కిలిగా జేముచుండు మేదినినిూదన్
నిక్కంబై వాహనముల
ప్రక్కల రెండేసిసుళ్ళు బర్బరబాహా.

61


గుర్రముయొక్క రెండుప్రక్కలయందును రెండేసి సుళ్ళుండినహయము తన యజమానునియొక్క శత్రువులు మిక్కిలిగా దుఃఖించునట్లు చేయును.


క.

పెట్టెడసుడిగలతురగము
నెట్టణరణవీధిలోన నిశితాస్త్రములన్
పట్టించు రౌతు నప్పుడె
జుట్టించును సర్జరీకుచంబుల కెలవిన్.

62


పట్టెడ పెట్టుచోట సుడిగలతురగము యజమానుని రణరంగమందు పట్టించి శత్రువుల కప్పగించును.


క.

తక్కెడిరోమంబులపై
జిక్కు నెడబాయనీక చెలువంబొందం

నొక్కించు కర్తసంతతి
పుక్కిటసుడిగల్గువాజి పోకంబగునే.

63


సులభసాధ్యము.


క.

గుదనాభింకటిశిలల
నుదరంబుల సుళ్లుచేత నొపరినవాజిన్
మదమణగ గడమకర్తల
నుదురాయయ వేదనలకు నొప్పునజేయున్.

64


సులభసాధ్యము.


పెందొడల సుళ్లవాహము
సందేహము లేక భువిని సమరావనిలో
జిందంబూడిన విధమున
బృందారక నుతులమీద పెలుచంద్రోచున్.

65


పైదొడలయందు సుడిగల తురంగము యజమానుని రణరంగమున చంపును.


క.

బీజంబుల సుళ్లుండిన
జాజుల గొననొల్లరెట్టివారును భువి న
త్తేజులు పుత్రశోక
బ్రాజష్ణులజేయుగాన పరిహారంబుల్.

66


బీజములపై సుళ్లుగలిగిన తురంగములను యెవ్వరును గొనసాహసించరు. ఆగుర్రములు యజమానులకు పుత్రశోకము తప్పక కలిగించును. గావున వర్జనీయములు.


క.

క్లేశయుబొందగ జేసెవి
నాశముగా వించుననుచు | నాగరికుని
ద్దేశంబు గలదు గావున
గోశావర్తంబువాజి గొనరా దెందున్.

67

గోశావర్తమను సుడిగల తురంగము పలువిధములైన క్లేశముల నొందించి యజమానులకు నాశనము గావించునని పెద్దల పల్కులు కలదు గావున యట్టితురంగములను కొనరాదు.


క.

నందనులు దాను పరమా
నందంబున నుండదలచు నరనాథుడు దా
ముందును వెనుకల
నందిరువుల సుళ్లున్నహయల నవనిం గొనునే.

68


సులభసాధ్యము.


తక్కక మోకాళ్ళను నిరు
పక్కల నుళ్ళున్ననాజి
దెక్క విజయము గలదై యనుపుని
విక్రమబడి ఘ్రోన్నమెల్ల నిరుపమకీర్తీ.

69


పద్యమునందు లక్ష్యము తప్పుగా నున్నది. అర్ధము స్పురించలేదు.


క.

వాసముల సుళ్లు హరులం
దోషంబులు పుట్టుననుచు తొల్లిటి పెద్దల్
వ్రాసిరి గావున దానిని
దోసం బెంచగ నెక్కరాదు రతిరాజనిభా.

70


ముక్కుమీదను సుళ్లుగల హయమువలన దోషము లధికముగా జన్మించుననుచు పెద్దలు వచించియుండిరి కావున దాని నెక్కవలదు.


క.

చెనటి గళావర్తపుహరి
గొని వెరుపక యింట గట్టుకొని యుండెడి యా
తనియింట మృత్యుదేవత
యనయము కాపురము నిలుచు నది సంశయమే.

71

గళావర్తముగల తురంగరత్నమును భీతిలేక యెవడు తనయింట నుంచుకొనునో యాతనియింట మృత్యుదేవత నిలుచుననుట కేమాత్రమును సందియము లేదు.


గీ.

కర్నహీను జేయగాదేని రవుతును
కర్ణరోగబాధకలితు జేయు
చెవుల సుళ్ళు వాజి జిట్టని యెవ్వారు
నెక్కనేల వగల సొక్కనేల.

72


చెవులయందు సుడిగల తురంగము త న్నధిరోహించువానిని కర్నరోగముచే పీడించబడువానిగా నొనర్చును లేకున్న చెవులు లేనివానిగా జేయును. (చెముడు వచ్చును.)


గీ.

కుష్టికముల జంఘల గళ కూర్చ జంఘ
......సుళ్ళు గల్గు వాజి జొనిపి
యెక్కబోవువాడు జమునిపొడ గాన
బోవువా డనిరి శాస్త్రవిదులైనఘనులు.

73


గ్రంథపాతమున నర్ధము స్ఫురింపదు.


క.

తనపతియు దాను నిక్కము
ననిలోపల నణగునని నహర్తి హయం
బును దూషించిరి త్రికతల
మన సుడిగలవాజి చందమున కంపనృపా.

74


నహవర్తియను సుడిగల తురంగము తన పతితోగూడ యుద్ధభూములందు గూలుదురని పెద్దలు వచించిరి. త్రికతలమున సుడి యున్నవాజిగూడ నట్టియవస్థనే పొందును. త్రికతలము - పృష్టభాగము.

ఇవి క్షేత్రకాలఫలములు.

క.

మేలుదెస గీడి సుళ్లును
మేలు ధృవుల్ గీడుచోటు మేల్కొనియున్నన్

మేలుం గీడును జాయా
సాళువ బిరుదాంక కంప జగతీనాథా.

75


క.

పల దెసగెడు నలపై దా
పలిదెస గోడిగలమేన న్రభవించునను
ళ్ళెలమిన్ గీ డొనరింపవు
కలియుగకర్ణావతంస గంపకుమారా.

76


చ.

అరయ ప్రదేశమధ్యమున యందు దొలంగక నిల్చియున్న రో
మరుహఫలంబు నల్పమగు మధ్యమమైన ఫలంబు చూపు నా
యిరుగడలం జనించు సుడి హీనఫలంబు డగ్రనోమజం
బరుదుగ తత్ఫలంపుక్రమమాలిక రోమజు యెన్ని జూడగన్.

77


లక్షణములను లక్షణవర్తనములు
చూచుచోటను మేలైన సుళ్లు మిగుల
సదృశ్యమైన యశ్వంబుగా జనును గొనగ
కాకయున్నను దప్పగు గంపభూప.

78


హరసిదళక్షేత్రంబుల
పరిపాటి యెరింగి హరులు సయిదోచిన రో
మరుహఫలములు దాకెటి
పరిహరణము జెప్పవలయు భావజ్ఞుండే.

79


క.

లుధితమదలోభి పారగ
పరితగుణాంకిత మహాత్మ పబంధానన
కఠినపుహృదయభూరుహ
కుఠారకఠారిరాయ గుణరత్ననిధీ.

80


క.

ఉత్సవనాకాధీశ్వర
వత్సలశరణాగతామృతస్తుతపరిచా

కాత్సంక్షోభితసుఖసం
దీత్సిమతీచాళ్లువాకధీ ప్రజ్ఞనిధీ.

81


మాలిని.

సుఖవిబుధసుధామా సోమనిక్షిప్తహేమా
ప్రకటసుభగరత్నా ప్రాప్తరాజికయత్నా
పకటసాధుమాజా సస్సురదౌరికాదౌ
ప్రకృతితినికృతికారీ పారిజాతానుకారీ.

82

గద్య
భైరవాచార్య పుత్ర మనుమంచి భట్టుప్రణీతమైన
హయలక్షణవిలాసంబునందలి అవర్తలక్షణం
బన్న ద్వితీయాంకురము.