అమెరికా సంయుక్త రాష్ట్రములు/రెండవ అధ్యాయము

వికీసోర్స్ నుండి

అమెరికా సంయుక్త రాష్ట్రములు.

రెండవ అధ్యాయము.


అమెరికాను యూరఫుజాతు లాక్రమించుట.

యూరపియనులు
అమెరికాను
కనుగొనుట

1458 వ సంవత్సరమున కాన్ స్టాంటినోపిలు తురుష్కుల వశమయ్యేను. బాల్కనురాష్ట్రములన్నియు యూరపియనులు వీరి రాజ్యములో చేరెను. ఈజిప్టు దేశముకూడ వీరికిందికి వచ్చెను. ఆఫ్రికా ఖండముయొక్క యుత్తరభాగమును యూరపు ఖండము యొక్క తూర్పుభాగమును తురుష్కుల వశమందుండుటయు మహమ్మదీయులగు తుకుష్కులకును క్రైస్తవులగు యూరపు జాతులవారికిని బద్ధ ద్వేషము కలిగియుండుటయ, యూరపు జాతులవారదివరకు ఆసియా ఖండములోని హిందూదేశము, చైనా, జపాను దేశములతో చేయుచున్న వాణిజ్యమున కాటం కమును కలుగచేసెను. ఇదివరకు ఆసియాఖండపు వర్తకమునకదే త్రోవగ నుండెను. ఇపుడు త్రోవలో తురుష్క సుల్తాను

వచ్చి చరెను. సుల్తానుగారి యనుగ్రహమును పొందిన వెనీసు పట్టణము వర్తపకు సౌకర్యములను పొంది భాగ్యవంత మయ్యెను. వారి యనుగ్రహము పొందజాలని జినోవాపట్టణ ముయొక్క వర్తకము నశించి క్షీణించెను. సముద్రముల మీద ఆసియాఖండమునకు వచ్చి చేరుటకు కొత్తత్రోవలు కను గొనవలెనని యూరపుఖండపు జాతులు ప్రయత్నములను చేయ సాగిరి. ఆసియాలోని తూర్పు దేశములతో వర్తకము చాల లాభకరముగ నుండెను. ముఖ్యముగ హిందూదేశముతోటి వర్తకముచేయుట మహాభాగ్యమని తలచిరి. అక్కాలమున ఐశ్వర్యమునకును నాగరికతకును వర్తక వ్యాపారములకును హిందూదేశము ప్రపంచములో కెల్ల మిగుల ప్రతిష్ట కలిగి యుండెను. మేలైన దూది పట్టు ఉన్ని వస్త్రములును, రత్నము లను, లోహవుసరుకులును, రత్నకంబళ్ళు తివాసీలును, పరిమళ , ద్రవ్యములును, మొదలగునవి హిందూదేశమునుండి యూరవునకు విరివిగ ఎగుమతి యగుచుండెను. ఎటులైన హిందూ దేశమునకు తోవలు కనిపెట్టవలెనని వివిధజాతులవారును ప్రయత్నములు సలిపిరి, ఆఫ్రికా ఖండమును చుట్టి హిందూ దేశమునకు నచ్చుటకు ప్రధమమున పోర్చుగీసువారు ప్రయత్నించిరి. 1486వ సంవత్సరమున డయ్యజు అను పోర్చుగీసువాడు ఆఫ్రికా ఖండము యొక్క దక్షిణభాగమువరకును వెళ్ళి తిరిగివచ్చెను, జనోవా కాపురస్తుడగు క్రిస్టీఫరు కొలంబసు అను నాతడు సూటిగ అట్లాంటికు మహాసముదములో పడమరగ ప్రయాణముచేసి హిందూ దేశమును చేరవచ్చునని నిశ్చయించెను. అప్పటి కమెరికా ఖండ మనునది గలదని


యూరపులో నెవరికిని తెలియదు. మార్కొపోలో యను నతని ప్రయాణములవలన ఆసియాఖండము మిగుల గొప్పదని తెలియును. కొలంబసునకు భూమి గుండ్రముగ నున్నదని తెలియును. కావున తాను పడమరగా అట్లాంటికు మహాసముద్రములో పోయినచో ఆసియాఖండమును జేరితీరెదనని తలచెను. అనేకసార్లు అట్లాంటికు సముద్రములో కొంతవరకు ప్రయాణముచేసి తిరిగి వచ్చుచుండెను. ఒక సారి ఐస్ లాండు ద్వీపమునుచేరి తిరిగివచ్చెను. ఇతనివద్ద దూరప్రయాణము చేయుటకు ద్రవ్యము లేదు. పోర్చుగీసు రాజగు రెండవ జూనుతో నీతడు తాను చేయదలచిన కార్యమునుగూర్చి మనవిచేసి ద్రవ్యసహాయమును గోరెను. ఆయన నీతనిని లక్ష్యముచేయక తానే స్వయముగా నౌకలను బంపెను. కాని దానివలన ప్రయోజనము కలుగలేదు. అప్పుడు కొలంబసు స్పైన్ దేశపు రాజునాశ్రయించెను. ఆసమయమనే స్పెనువారు మహమ్మదీయులతో పోరుసలుపుచుండిరి. స్పెన్ దేశీయులు తమదేశ ములో సారనన్ ముసల్మానుల యధీనమందున్న ప్రదేశమును తిరిగి స్వాధీనమును పొందుటకు యుద్ధము చేయుచుండిరి. కావున 'స్పైన్ వారివలన కొలంబసుకు సహాయముగాలేదు. అంత కొలంబసు తనతమ్ముని ఇంగ్లాండు దేశమును పాలించుచున్న హెన్రీరాజు వద్దకు బంపెను, కాని అచటనుండియు సహాయము రాలేదు. 1492 వ సంవత్సరమున స్పెన్ వారు ముసల్మానుల నోడించి తమదేశమునుండి వెడలగొట్టిరి. అప్పుడు స్పైన్ రాజు యొక్కయు కొందరు స్పైన్ దేశీయులగువర్త కుల యొక్కయు సహాయమువలన, కొలంబసు మూడు నౌక


లతో అట్లాంటికు సముద్రయాసముచేసెను. అనౌకలలో నొక దానికి మాత్రమే పైకప్పుగలదు. తక్కిన రెంటికిని వైకప్పుకూడ లేదు. ఆయన తనతో కూడ ఎనుబది ఎనిమిది మంది మనుష్యులను తీసుకొని బయలు వెడలెను. రెండు నెలల తొమ్మివి రోజులు నడినముద్రములో ఒకేవైపుగా ప్రయాణము చేసెను. ఈ లోపున ఆయనతోనున్న వారికి విసుగు పుట్టెను. కొంత కాలమునకు నిరాశ జనించెను. ఎప్పటికిని సముద్రము మీద నిటులనే ప్రయాణము చేయవలెనేమోయను భీతి కలిగెను. తుదకు పక్షులు కనపడెను. ఆశకొంత వరకు కలిగెను. 1492వ సంవత్సరము అక్టోబరు 11వ తేదీన రాత్రి పదిగంటల కొక దీపమును చూచిరి. మరునాడుదయమున భూమికనబడెను... ఆయుదయముననే స్పైన్ దేశపు పతాకములతో నూతన ప్రపంచములో కొలంబసు దిగెను. అదేశములో మోటజాతులు నివసించి యుండిరి. ఆదేశములో నవుడు హిందూ దేశమును (ఇండియాను) పాలించుచున్నటుల తాను వినిన రాజు పాలించుట లేదు. ఆదేశము తాను వినిన ఇండియా (హిందూదేశము') వలెలేదు. దానిలో ప్రవేశించి యంతయు పరికించి చూచెను. అవి ద్వీపములు. వాటికి పశ్చిమ ఇండియా ద్వీపములని నామకరణము చేసెను. కొంతబంగార మును, ప్రతి ని, క్రొత్తకపు జంతువులను, పక్షులను, ఇద్దరు ఎర్రఇండియనులను తీసుకొని ఆయన తిరిగి 1498 వ సంవ త్సరమున యూరపు ఖండమును చేరెను. మరల నా సంవత్సర ముననే క్రైస్తవమత ప్రధానాచార్యుడగు పోపు యొక్క అనుజ్ఞనుపొంది పదునేడు పడవలతోడను పదిహేను వందల

మంది జనులతోడను నానూతన ద్వీపములను స్పైన్ రాజు పక్షమున స్వాధీనమును పొందుటకు క్రిస్టఫరు కొలంబసు పయన మైపోయెను. వాటిని వశపరచుకొని స్పైన్ రాజుయొక్క, ప్రతినిధిగా కొంత కాల మాయనపాలించెను. ఇది యమెరికా ఖండమునకు తెల్లజాతుల వారువచ్చి చేరుటకు ప్రారంభము. స్పెన్ దేశమునుండి అనేకు లీద్వీపము లలోనేగాక వీటికి సమీ పముననున్న యమెరికాఖండమునగూడ వలసవచ్చి నివసించిరి. అమెరికా యొక్క నూతన భాగములను కనిపెట్టుచు నాక్రమించుకొనుచుండిరి,


ఇంతలో పోర్చుగీసువాడగు వాస్కోడిగామా 1498 వ సంత్సరమున ఆఫ్రికాఖండమునుచుట్టి హిందూదేశము దేశమును చేరెను. 1519వ సంవత్సరమున చేరుట,

హిందూ స్పైన్ రాజు కొలువునందుండిన మెగల్లర్ అను వాడు అయిదు

దేశము పడవలతోను రెండువందలమంది మనుష్యుల లోను స్పైక్ దేశమునుండి

చేరుట
బయలు దేరి దక్షిణ అమెరికాయొక్క దక్షిణ భాగము చుట్టును సముద్రము

మీద తిరిగెను. అక్కడనుండి పెనామా జలసంధివరకును పోయెను. పశ్చిమముగా పయనముచేసి ఫిలిఫ్పైన్ ద్వీపములను కనుగొనెను. అచట దిగి యాద్వీపవాసులతో పోరాడి హతుడయ్యెను. అతనితో వెళ్ళినవారిలో చాలమంది కూడ చంపబడిరి. 1522 వ సంవత్సరమున కొక పడవయు ముప్పది యొక్క మంది మనుష్యులును స్పైన్ దేశమునకు తిరిగిపచ్చిరి. ఇంతటినుండియు 'స్పైన్ వారును పోర్చుగీసువారును అమెరికాఖండములోని మధ్య భాగమును దక్షిణభాగమును క్రమక్రమముగా సంతయు

"నాక్రమించుకొనిరి. ఇక నేబది సంవత్సరముల వరకును పరాసువారును, డచ్చి (హాలెండు) వారుసు, ఆంగ్లేయులును, అమెరికాకుగాని హిందూదేశమునకుగాని బయలు దేరలేదు.

{{స్పైన్ పోర్చుగీసు వారి లాభములు}} పోర్చుగీసువారే ముందుగ హిందూదేశము లోని స్పైన్ పోర్చుగీసు రాజులనాశ్రయించి కొన్ని సముద్రరేవులలో స్థలములను సంపాదించి యచటగిడ్డంగులను కట్టుకొని వ్యాపారము చేయుచుండిరి. స్పైన్ వారును పోర్చుగీసువారును త్వరితముగ మిగుల నైశ్వర్య పంతులయిరి. ఆసియా ఖండముతో వర్తకమువలన చాల లాభము వచ్చుచుండెను. అమెరికా శీతోష్ణస్తితి మిగుల యనుకూలముగ నున్నందున చాల మంది యచటికి వలస వెళ్ళి సౌఖ్యముగ నివసించుచుండిరి. అచట వీరు దేశమాక్రమించుట కెట్టి అడ్డును లేకుండెను. అమెరికాలోని భూమలు గనులు అడవులు వీరివశ మయ్యెను. బంగారముతోను మేలైన సరకులను నిండిన పడవలతో ఆసియానుండియు ఆమెరికానుండియు నీరెండుజూతుల వారును తమదేశములకు వచ్చుచుండిరి. వీరిలో వీఱికి కలతల కలుగకుండ వీరి గురువగు (పోపు) రోములోని క్రైస్తవ ప్రధానాచార్యుడు. కాగితము మీద నొక గీతగీసి ప్రపంచములోని కేఫువర్డిలంకలకు పశ్చిమ భాగమంతయు స్పైన్ వారికిని, తూర్పు భాగమంతయు పోర్చు గీసువారికిని ఇచ్చి వేసెను. ఈ యుభయజాతుల సాధారణ యైశ్వర్యాభివృద్ధిని చూచి యూరపు ఖండములోని తక్కిన జాతుల వారందరును మేల్కొనిరి.

స్పై౯ వారు వెళ్ళునప్పటికి అమెరికాలోని పశ్చిము మెక్సికో, పెరూ యిండియా ద్వీపములలో తామ్రవర్లముగల మోటవారు నివసించుచుండిరి. వారిని స్పెన్ వారు చంపిరి, దోచుకొనిరి, చంపగ మిగిలిన . వారిని బానిసలుగ పట్టుకొనిరి, బానిసలుగ పట్టుకొనిన వారిని క్రైస్తవులుగ

 మెక్సికో పెరూ
లోని ఎర్ర
ఇండియను
రాజ్యముల
నాశనము

చేసిరి.. క్రైస్తవులుగ చేయబడినను బానిసత్వమునుండి విముక్తి కాలేదు. నల్లవారు తమక్రింద బానిసలుగ నుందుట సహజధర్మమని తెల్లవారు నమ్మిరి. అమెరికా ఖండములోనికి సైన్ వారు జొరబడిన కొలదియు కొంతవరకు నాగరికతను చెందిన ఎర్రయిండియను లగుపడిరి. మెక్సికో, పెరూ దేశములలో మిగుల నాగరీకు లగు ఎయిండియనులు గొప్పరాజ్యములు స్థాపించుకొని నివసించుచుండిరి. వీరు ఆసియా ఖండముయొక్క గాని యూరపు ఖండము యొక్క గాని నాగరికతలకు సంబంధము లేని స్వతంత్ర మగు నాగరికతను నిర్మాణము గావించుకొనియుండిరి. ఈ జాతులను కూడ స్పైన్ వారు ముట్టడించిరి. . కోర్టేజి " యను స్పెన్ వాడు పదకొండు పడవలలో నాలుగువందల మంది స్పైన్ "సైనికులను రెండువందలమంది ఎర్రయిండియను సైనికులను పదునాలుగు ఫిరంగులను వెంట గొని మెక్సికో దేశము పై దండయాత్ర సలిపెను. ఆదిపరకే అచటికి వచ్చి ఎరయిండి యములచే ఖయిదుచేయబడి ఎర్రయిండియనుల భాషను బాగు గా నేర్చుకొనియున్న స్పైన్ వాదొక డీతని కలసెను. వాని వలన నాకాలమున మెక్సికో రాజునందు ఎరయిండియను ప్రజ

.. .

\లలో కొంతమంది కిష్టము లేదని ఈతనికి తెలిసెను. మెక్సికో ప్రజలను తమ స్వదేశరాజు యొక్క దుర్మార్గము నుండి రక్షించుటకు వచ్చినటుల స్పైన్ వారు నటించసాగిరి. కొంద రె యిండియను ప్రజలు నమ్మి స్పైన్  వారితో చేరిరి. స్పైన్ వారు. ఎర్రయిండియనులచే స్వదేశ రాజు పై తిరుగబాటులు చేయించిరి. 1510 వ సంవత్సరము న స్పైన్ వారు మెక్సికోలోని పల్లపు భూములలో ప్రవేశించి తిరుగ బాటు దారులకును రాజుకుసు మధ్యవర్తులుగ సున్నటుల నటించి రాజుతో రాయ బారములు సలుపసాగిరి. రాజు స్పెఁన్ వారితో స్నేహము నొంద యత్నించుచుండెను. మరికొందరు ప్రజలకు తమరాజు, విదేశీయులగు స్పెయిన్ వారితో స్నేహముగనుందుటకిష్టము లేక. రాజుపై తిరుగబడి రాజును చంపి వేసి స్పెయిన్ వారిని ముట్టడించి కొందరిని హతులను గావించిరి. . కోరేజీ సముద్ర తీరమునకు పారిపోయెను. తరువాత కొత్త సేనలు స్పెయిన్ దేశమునుండివచ్చి కొంతకాలము పోరాటమునలిపి మెక్సికో చేశమునంతను ఆక్రమించుకొని స్వాధీనమును పొందిరి. స్పెయిన్ వారు మెక్సికో దేశమున రాజ్యమును స్థాపించుకొనిరి. స్పెయిన్ వారు కొంద రెర్రయిండియనులను చంపిరి. మిగిలిన వారిని బానిసలుగ చేసికొనిరి. వారిని రోమనుకాథలిక్కు లో క్రైస్తవమతమును స్వీకరింప జేసిరి. వారీస్వభాషను నిర్మూలనముచేసి వారికి 'స్పెయినుభాష నేర్పిక. బానిసలకు స్వభాష. స్వధర్మము లుండనేరవు. అనేక మంది గుంపులు గుంపులుగ స్పెయిన్ దేశమునండి వచ్చి మెక్సికో దేశమున నివసించిరి. . అచట గనులను త్రవ్వించుకొనియు తోటలను వేసియు చాల 


ధనమును సంపాదించిరి. తమ కిందనున్న ఎర్రయిండియును బానిసలచేతను, ఆఫ్రికాఖండమునుండి పట్టుకొని వచ్చిన నల్ల నీగ్రోబానిసలచేతను, భూములలోను గనులలోను తోటల లోను పనిచేయించుకొనిరి. ఇటులనే 1580 వ సంవత్సరమున పై జరో అను నతని క్రింద స్పైన్ పొరు మరియొక దండయాత్ర సలిపి పెరూదేశము నాక్రమించిరి. అచటనుకూడ మెక్సికోలో వలెనే చంపగా మిగిలిన ఎర్రయిండియనులను బానిసలుగ చేసికొని గనులలోను తోటలలోను భూములలోను ' పనులు చేయించుకొనిరి. ఈ విధమున నే పోర్చుగీసువారుబ్రెజిలు దేశము నాక్రమించిరి, ఆచటి ఎయిండియనులను కూడ నిటులనే చేసిరి. స్పైన్, పోర్చుగలు ప్రభుత్వములక్రింద మెక్సికో, పెరూ, బ్రెజిలు దేశములు మూడును బానిసవ్యాపారమువకును ధనాభివృద్ధికిని మిగుల ఖ్యాతిని పొందెను. అమె రికాఖండము యొక్క బంగారు వెండి గనులీ రెండు జాతుల వారిని యూరపుఖండములో కెల్ల యైశ్వర్యవంతులను చేసెను. స్పైస్, పోర్చుగీసు దేశమువారి యైశ్వర్యాభివృద్ధిని చూచి హాలెండువారును, పరాసుపోరును, ఆంగ్లేయులును ధనసంపాదనకై సముద్రము లమీద బయలు దేరిరి. జర్మనీ దేశమపుడు ఆస్ట్రియా చక్రవర్తియగు స్పైన్ రాజు యొక్క పాలనమునం దుండుట వలన స్పెన్ వారికి పోటీగ తక్కిన యూరపుజాతు లతోపాటు నూతన దేశముల యాక్రమణకొరకు జర్శను దేశీయులు బయలు దేరజాలక పోయిరి. తమదేశములోని విదేశ ప్రభుత్వము కింద వత్తిడినొందుచున్న జర్మనులు తమ యజమా నులగు స్పైన్ వారితో పోటీగ ఖండాంతరములకు బయలు


దేరుట అసంభవమయ్యెను. కావున జర్మనీవారు ఆసియాలో గాని అమెరికాలోగాని తక్కినజాతులవలె రాజ్య సంపాదనము చేయలేదు.

{ఆప్రికాను
కనుగొనుట}

(3) అమెరిశాఖండముతో పాటు ఆఫ్రికా ఖండముకూడ యూరపియను జాతులచే కనుగొనబడెను. ఆఫ్రికాను ఖండములో ముఖ్యముగ భూమధ్యరేఖకు కనుగొనుట, (Equator) దక్షిణముననున్న భాగములో నాగరకజాతులు లేరు. వైశాల్యమునందు మితి లేనిదై యూర పుజాతులు నివసించుటకు యోగ్యమై, ధనాభివృద్ధి కుపయుక్తమై, యున్న నీప్రదేశమును కనుగొనుట గొప్పయదృష్టమని తెలజాతులవారు భావించిరి. తమదేశములలో జనసంఖ్య విశేషముగ వృద్ధి చెంది చాలమందికి కడుపునిండ తిండి దొరకని స్థితిలో సుండగ, ఇచ్చట గనులనుత్రవ్వి తోటలను వేసి భూములను సేద్యము చేయించుకొని త్వరితముగ ధనవంతులగుటకు మంచి యవళాశ మొదవెవని తలచిరి,

{యూరపియను
జాతుల మధ్య
పోరాటము}

కొత్త ప్రదేశములు కనుగొనబడినవి. అవి యోగ్యమయినవి, లాభకరమైనవి. కాని వాటిని నీతెల్లజాతుల మధ్య పంచి పెట్టు వారెవరు!అప్పటి?" మెసపొటేమియను ఆంగ్లేయులకును" పోరాటములు."సిరియాసు పరాసు వారికిని” “ధ్రేసునుగ్రీసు వారికిని" వంచి పెట్టు నానాజాతుల సమ్మేళనము పుట్టలేదు. కావున ధనార్జనముకొరకును రాజ్య సంపాదనముకొరకును యూరపు ఖండ ములోని వివిధ జాతులవారు పోటీగ బయలు దేరిరి. వీరిమధ్య ' ఘోరయుద్దములు జరిగెను. సముద్రములమీదను భూమి “మీదను వీరిమధ్య ననేకదోపిళ్లుహత్యలు జరిగెను. వీరి మధ్యధర్మ నిర్ణయము చేయుటకు పశుబలము తప్ప వేరు సాధనము లేదయ్యె. బలవంతులు లాభమును పొందుటయు బలహీనులు క్షీణించు టయు జరిగినది.

{యూరోపియను
జాతుల రాజ్య
సంపాదన

రోములో కూర్చుండి ప్రపంచము నంతను స్పైయిన్, వారిని పోర్చుగీసు గారికిని నొకకాగితముమీద గీతగీయుటతో పంచియిచ్చిన ప్రధాన క్రైస్తవ పాదనము, మతాచార్యుని పంపిణీని తక్కిన జాతులవారు గౌరవించ లేదు. ఆంగ్లేయులును, డచ్చి వారును, స్వీడను వారును, తాము పొటెస్టంటులమని చెప్పి 'పోపును ధిక్కరించిరి. రోమను కాథలిక్కు మతాచార్యుని (పోపు) శిష్యుడగు పరాసురాజుకూడ తనగురువు చేసిన పంపక మును తిరస్కరించి పోరాడి చేతనయినంత సంపాదించుకొనుట కతని మనస్సాక్షి బాధ పెట్టలేదు. ఎర్రయిండియముల దేశములలో నిష్కారణముగను వారియనుమతి లేకుండగను ప్రవేశించి యాక్రమించుకొనుటకును వారిని నాశనము చేయుటకును బానిసలుగ చేయుటకును తెల్లజాతులవారి మనస్సాక్షిఅనలే బాధ పెట్టలేదు. కాని అమెరికాలో అందరును నమా నముగ సంపాదించలేదు. స్పెర్, పోర్చుగీసు దేశముల వారిదివరకే మధ్య అమెరికాను దక్షిణ అమెరికాను కొన్ని పశ్చిమ యిండియా ద్వీపములను సంపాదించుట చూచియుంటిమి. డేసులు ( డెన్మార్కు వారు ), కొన్ని పశ్చిమయిండియా ద్వీపములను మాత్రము సంపాదిం దిరి. స్వీడను వారికేమియు

లభ్యము కాలేదు. హాలెండుగారుసు (డచ్చివారు) బహు - కొద్దిగనే సంపాదించిరి. హాలెండువా రాక్రమించిన "న్యూ - ఆంస్టర్డాం ” 1674 వ సంవత్సరమున ఆంగ్లేయులవశమయ్యెను. దాని కాంగ్లేయులు • న్యూయార్క'ని పేరిడిరి. గ్వయ నాయును హాలెండువారాంగ్లేయుల కిచ్చిరి. పశ్చిమ యిండియా ద్వీపములలో డేసులు సంపాదించిన వాటిని కూడ నాం గ్లేయుల కిచ్చిరి. 4.

{కెనడా
దేశము}

ఆంగ్లేయులు ప్రధమ జేస్సు, మొదటి చార్లెసు, రెండవచార్లెసు, రాజులయొక్క నిరంకుశత్వ ముక్రీందను మత నిర్బంధములక్రిందను బాధలునొం దుటకూడ తటస్థించినందున తెలివిగల వారును ధైర్యశాలులుసగు పారసీకు లాంగ్లేయ దేశమునుండి బయలుదేరి యుత్తర అమిరికాకువచ్చి వలసనేర్పరచుకొనిరి. పరాసులుకూడవచ్చి యుత్తర అమెరికాలో నివాస మేర్పరచుకొనిరి. కాని ఆంగ్లేయులు వచ్చినంతముంది రాలేదు. ముఖ్యముగ నుత్తర దేశమగు కనడా దేశములోని మంచి భాగములను పరాసు ( పెంచి, వా రాక్రమించిరి. కాని కావురముండుటకు తగిన మనుష్యులను పరాసు దేశమునుండి బంప లేదు. పట్టణములను విశేషముగ' నిర్మించ లేదు, కోటలను తగినన్ని కట్టలేదు. ఆ దేశములోని ఎర్రయిండియనులను తమక్రిందికి చేర్చుకొని యా దేశమంతయు తమదే యని మాత్రము చెప్పిరి. పరాను దేశముషండి యోగ్యులగు మత బోధగులును ప్రయాణికులును పచ్చిరిగాని తగినంతమంది పౌరులు రాలేదు, కనడాలో పరాసువారు లక్షమంది మాత్రమే కాపురముండగ కనడాకు దక్షిణమువనున్న వలస ప్రాంతములలో నాంగ్లేయులు పదిలక్షలమంది కాపురముండిరి. ఈ ఆంగ్లేయ వలసరాష్ట్రముల వారుసు. ఇంగ్లాండునుండి వచ్చిన ఆంగ్లేయ సైనికులును కనడా దేశము నాక్రమించుటకై ఫ్రెంచివారి పై అప్పుడవుడు యుద్ధములు సలిపిరి. 1754 వ సంవత్సరములో జరిగిన యుద్దము వలన స్థితిగతులు మార లేదు. కాని 1767 మొదలు • 1768 వరకు యూరపులోను హిందూదేశములోను అమెరికాలోను ఆంగ్లేయులకును , పెంచి వారికిని జరిగిన ఏడుసంవత్సరముల యుద్ధములో ఆంగ్లేయులే గొప్పజయములను పొందిరి. ప్రపంచ రాజ్యమును ఫ్రెంచివారి నుండి ఆంగ్లేయులు లాగికొనిరి. 1763 వ సంవత్సరమున జరిగిన పారిసుసంధివలన హిందూదేశ సామాజ్యమును కనడా దేశమును ఫ్రెంచివారు ఆంగ్లేయులకు వదలి వేసిరి. కనడా దేశ మాంగ్లేయుల వశమయ్యెను. అదివరకు కనడా దేశమునకు వలసవచ్చియున్న పరాసువారును తరువాత కనడా కు కాపురమునకు వచ్చిన ఆంగ్లేయులును కలసి కనేడియను జాతివారయిరి. ఇటులనే హిందూ దేశమునకు మొదటి కాపురస్తులగు హిందువులును తరువాత కాపురమునకు వచ్చిన మహమ్మదీయులును పారసీకులురు కలిసి హైందవులయిరి. కనడా దేశమును తమ మాతృభూమిగ అచట కాపురమున్న ఆంగ్లేయులును పరాను వారును , ప్రేమించు చున్నారు. పరానువారు తక్కువ సంఖ్యాకులగుటచే విశేష సంఖ్యాకుల భాషయగు ఆంగ్లేయ భాషనుకూడ నేర్చుకొనిరి. హిందూ దేశములో కూడ విశేష సంఖ్యాకుల భాషయగు


హిందూస్తానీ భాషను తక్కిన వారు నేర్చుకొనవలసియున్నారు.కనడా యొక్క రాజ్యాంగ భాష ఆంగ్లే యభాష అయినది. కనడా దేశములో కొంతకాలము వరకు ప్రోటస్టంటులగు ఆంగ్లేయులకును రోమను కాథలిక్కు లగు పరాసువారిని కలతలు కలుగుచుండెను. ఆంగ్లేయ గాజ్యముమీద తిరుగబోటుకలిగెను. కాని బ్రిటిషు రాజ్యాంగ వేత్తలు కనడా దేశమునకు స్వరాజ్యమిచ్చినచో నీకలతలు నివారణయగుసని తలచి బ్రిటిషు సామాన్యంతర్నితమగు స్వరాజ్యమునిచ్చిరి. అప్పటినుండియు ఆంగ్లేయ పరాసు కలతలు నశించినవి. ఉభయజాతులును ఐకమత్యముకలిగి తమ మాతృదేశాభివృద్ధికై బాగుగ పని చేయుచున్నారు. దేశాభిమానము జాతీయ భావము సంపూర్ణముగ కలిగినవి. స్వరాజ్యము రాగానే తమ ప్రక్క దేశమగు అమెరికా సంయుక్త రాష్ట్రములతో బాటు తమ దేశమునుకూడ సభివృద్ధి చేయు బాధ్యత అందరిమీదను ఏడుటవలన అదివరకు గల సాంఘిక స్పర్ధలును అసూయలును మత వైషమ్యములను వదలి వై.చి యుబయ జాతులవారును జవాబుదారితో తమ దేశముయొక గొరపము కొరకు కృషి సలుపుచున్నారు. ఇప్పుడు కనడా దేశము ప్రపంచములోని తక్కినయన్ని స్వతంత్ర దేశములతో పొటు అభివృద్ధిని గౌరవమును కలిగియున్నది.

కనడా దేశమును ప్రెంచి వారు పోగొట్టుకొనిన తరువాత ప్రెంచిగ్వైనీయును కొన్ని ద్వీపములును తప్ప అమెరికా ఖం డమునందు ఫ్రెంచివారికి పేరువడసిన ప్రదేశము, లేవియు లేవు. ఆంగ్లేయులకు శనడా దేశమేగాక, యుత్తర అమెరికాలో న్యూ


ఫౌండ్లాం సుద్వీపమును పశ్చిమయిండి యాద్వీపములలోని కొన్ని పెద్దద్వీపములును, దక్షిణ అమెరికాలో బిటిషు గ్వైనాయును కొన్ని యితరద్వీపములును కూడగలవు. . కనడా దేశమునకు దక్షిణముననున్న ప్రదేశమును, ముఖ్యముగ నాంగ్లేయు లాక్రమించి చాలకాల మాంగ్లేయందేశపు పౌలనముక్రిం ద నుండిరి, తరువాత నాంగ్లేయదేశముతో కలహించి అమెరికా సంయు క్త రాష్ట్రములను పేరున స్వతంత్ర మును పొందిరి. వీరిచరిత్రమే మనమిపుడు చదువుచున్నాము. ఈ ఆంగ్లేయవలస రాష్ట్రములు స్వతంత్రముకొరకు యుద్దము చేసిన నాటికి పదమూడు రాష్ట్రములుమాతమే యుండెను. వాటి నిగూర్చి సంగ్రహముగ రాబోవు అధ్యాయము నందు వివరించెదము.