అమెరికా సంయుక్త రాష్ట్రములు/మూడవ అధ్యాయము
అమెరికా సుయుక్త రాష్ట్రములు.
(1)
మూడవ అధ్యాయము ,
పదమూడు వలస రాష్ట్రములు.
{ స్పైయిన్
వారి వలసా
ప్రయత్నములు
ప్రధమమున 1512 వ సంవత్సరమున సైయిన్ దేశవాసియగు పాన్సీ డివియను సతడు ఉత్తర అమెరికాలోని ఫ్లోరిడా తీరమును చేరిను.దానిని స్పైన్ రాజు పేర స్వాదీసమును పొం దెను. అక్కడ కొందరు స్పైయిన్ దేశీయులను కాపురమునకు తీసుకొనిరాగ వారినందరిని అచటి ఎర్రిండియనులు చంపిరి. 1520 వ నువత్సరమున నిద్దరు స్పెయిన్ దేశీయులు తరువాత కారొలీనా యేర్పడిన ప్రాంతమునకు వచ్చి కొంద రెర్రయిండి యములను పట్టుకొని బానిసలుగా తీసుకొనిపోయిరి. 1599 వ సంవత్సరమున ఫర్థినండు సోటోయను మరి యొక "స్పెన్ దేశీయుడు. అమెరికాకు వచ్చి మిస్సిసిపీనది ప్రాంతమున సంచారము చేసెను. కొందరు స్పెయిన్ వారచ్చ ట కాపురముం
,డుటకు యత్నించిరి, గాని ఎర్రయిండియనుల అభ్యంతరముల వలన వీలుకలుగలేదు. మిస్సిసిపి నది ప్రాంతమున పోటో చూచినపు డెర్రయిండియసులు సాధువులు గను వ్యవసాయకులు. గను సుండిరి. గాని స్పేయిన్ దేశీయులు వారిని బానిసలుగ పట్టుకొనుటయు, స్వల్ప యనుమానముపైన వారి చేతులు' ఖండించుటయ, తమకు తోవ చూపువాడు లోపముచేసి "నేవుడు వానిని వేటకుక్కలు చంపితినుటకు వప్పగించుటయు, స్వల్పకారణములకు వారి గ్రామములు తగుల బెట్టుటయు, నొకప్పుడు మనుష్యులనుకూడ మంటలలో పడవేయుటయు, మొదలగు క్రూరకృత్యములు చేసియున్న శారణముచేత, ఎర్రయిండియనులు తరువాత వెళ్ళిన తెల్లవారిని మిగుల యనుమానముతోడను విరోధ భావముతోడను చూచుట తటస్థించెను. ఇంతటితో స్పైయిన్ దేశీయు లీప్రాంతములలోనికి వలస వచ్చుట మానుకొనిరి.
{పరాసు వారు}
1162,64వ సంవత్సరములలో ఫ్రాన్సు దేశమంలో మతవిషయిక నిర్బంధములచే బాధనొందిన . హ్యూజినాట్లను ప్రొటి స్టెంటు మతస్థులగు పరాసు వారువచ్చి కారొలీనా ప్రాంతముల నివాసముల నేర్పర చుకొనిరి. పరాను దేశపు రాజగు పదవచార్లెసు పేరున నా ప్రాంతమునకు ఈ కారొలీనా, యను నామమిడిరి. రోమను కాథలిక్కులను స్పైన్ వారికి వీరియందు గల విరోధముచే స్పెన్ దేశపు సైనికులిచటకువచ్చి వీరినందరిని పట్టుకొని పరాసువారని గాక ప్రొటస్టంటులని" యుందీసిరి. ఇంతటితో నీవలస రాజ్యమంతరించెను. ఈఘోరకృత్యము , పరాను దేశము నకు తెలిసి పరాను సేనానియగు గర్నను మూడునౌకల మీద కొంత సేసతో బయలుదేరి అమెరికాకువచ్చి స్పెయిన్ "దేశీయులు కావుర మున్నచోటుల ప్రవేశించి స్పెయిసువారి నందరిని ఖైదీలుగా పట్టుకొని స్పెస్ దేశీయులని గాక "ద్రోహులు బందిపోటు దొంగలు హంతకులున"ని యురిదీసెను. స్పయిన్ దేశీయులు 1665 వ సంవత్సరమున అమెరికా సంయుక్తకరాష్ట్రము లలో నేర్పరచుకొనిన ఈ సెంటు ఆగస్టయిను' అను ప్రాతనివాసము మాత్రమే మిగిలెను.
(2)
{వర్జీనియా}
అమెరికాసంయుక్త రాష్ట్రములలో ప్రధమమున వలసస్థాపింపబడినది వర్జీనియా రాష్ట్రములోనే పరాసుహ్యుజినాట్లు కారొలీనాలో వలస నేర్పఱచుకొనుటకు చేసిన ప్రయత్నము లాంగ్లేయుల నిచటకు వచ్చుటకు పురికొల్పెను. ఆంగ్లేయుడగు సర్ వాల్టరు రాలి' 1585 వ సంవత్సరమున నాంగ్లేయ రాజునుండి దానశాసనమును పొంది యుత్తర కారొలినా పొంతమున నొక యాంగ్లేయులవలస నేర్పఱచెను. కొలదికాలములో నీ యాంగ్లేయు లకారణముగ నొక యెర్రయిండి యనుప్రభువును నతని యనుచరులను వధిం.చిరి. ఇంతటితో నెర్రయిండియును లాంగ్లేయులపై మత్సరమును బూని పెక్కువిధముల పీడింపజొచ్చినందున మరుసటిసంవత్సర మాంగ్లేయులు లేచిపోయిరి. తిరిగి 1587 సంవత్సరమున మరికొంద రాంగ్లేయు లా ప్రాంతమునకే వచ్చి నివసించిరి.' కాని వారిని ఎయిడియనులు నాశనము చేసిరి. 1606 వ సంవత్సరమున అమెరికాఖండమున వలసలను స్థాపించుటకుగాను
ఆంగ్లేయ దేశమునందు రెండుసంఘము లేర్పడెను. వాటిలో " లండను సంఘమనునది వర్జీనియాను స్థాపించెను. 1606 వ సం -వత్సరమున నిచటికి నూట అయిదుగురు ఆంగ్లేయులు మాత్రము వచ్చి నివసించిరి. వారిలో నలుగురు వడ్రంగులను పన్నెం డుమంది కార్మికులుసు సుండిరి. ఏసుక్రీస్తు ప్రభువు తల్లియగు ! వర్జిన్ మేరీ పేరున వర్జీనియా యని నీ ప్రదేశమునకు నామకరణ "మిడిరి. క్రమముగా నాంగ్లేయ దేశమునుండి చాలమంది వచ్చి చేరుచుండిరి. ఇచట పొగాకు విశేషముగా పండించబ డెను. ఇందువలన వీరు చాల ధనికులైరి. 1619 సంవత్సరమున నాంగ్లేయరాజు యొక్క అనుజ్ఞను పొంది యీ రాష్ట్రపాలవమునకుగాను ప్రజా ప్రతినిధి సభను స్థాపించుకొని.. 1622 వ సంవత్సరమున షుమారు నాలుగు వేల ఆంగ్లేయులిచట కాపుర ముండిరి, ఇరువదియొక్క సంకత్సరములలో జన సంఖ్య రెండు రెట్లధికమయ్యెను. 1620 సంవత్సరముననే యొక పోలండు యుద్ధనౌక ఈ రాష్ట్ర తీరముననకు వచ్చి ఈ రాష్ట్రవాసులకు ఆఫ్రికానుండి తేబడిన నల్ల నీగ్రోబానిసల నమ్మినది. తదాది ఇచటకు నీగ్రోబానిసలు తేబడుట ప్రారంభమయ్యెను. ఎర్ర యిండియనులకుమ ఈ తెల్ల ప్రజలకును అప్పుడప్పుడు కలతలు గలిగి ఎర్రయిండియనులు వీరిమీదపడి హత్యలు జరుపుటయా, వీరు వారినిచంపి వారి దేశము నాక్రమించుటయు జరుగుచుండెను. కొత్తగా కాపురస్తులను 'తెచ్చియుంచుటకు ప్రతి భూకామందునకును ఏబది యెకరముల స్థలమీయబడెను. - ఇందులో ఆంగ్లేయ దేశమునుండి కొత్తవారువచ్చి నివసించు చుండిరి. మరియు సాంగ్లేయదేశములో గొప్ప నేరములు
చేసినవారినికూడ నిచటకే కాపురము నకు బంపుచుండిరి. పట్టణములును పరిశ్రమలును వృద్ధిమెంద లేదు. కాని తోటలు విశేషముగా పెరిగినవి,
(3)
{మేరీలాండు}
ఆంగ్ల దేశపు రాజగు మొదటి చార్లెసు వద్దనుండి దానపట్టాను పొంది 1684 న సంవత్సరమున నిచట బాల్టిమోరు ప్రభువుయొక్క కుమారుడొక యాంగ్లేయుల వలన నేర్పరచెను. రోమను కాథలిక్కులగు ఆంగ్లేయ దేశములో మిగుల బాధలు గలగుచున్నం దున చాలమంది రోమను కాథలిక్కులగు ఆంగ్లేయులిచటకు వలసవచ్చిరి. వీరిని ప్రధమమున ఎయిండియనులు స్నేహమగ నాదరించిరి. ఎర్రయిండియను స్త్రీలు ఆంగ్ల స్త్రీలకు మొక్కజొన్నలతో రొట్టెటచేసికొనుటను నేర్పిరి. ఆరు నెలలో నీరాష్ట్రము విశేషముగా పెరిగెను. కొలది కాలములో నే ఎర్ర యిండియసులకును వీరికిని కలతలు కలిగెను. వీరి ముఖ్య పంటదినుసుకూడ పొగాకే.
(4)
{ఉత్తర దక్షిణ
కారోలినా రాష్ట్రములు
కారొలీనా రాష్ట్రమును ,ప్రధమమున పరాసు వారు స్థాపించిరి. తరువాత నిది విభజింపబడి ఉ ఉత్తర, దక్షిణ, తర దక్షణ కారొలీనాలను రెండు రాష్ట్రములుగ చేయబడెను. పరాసువారు స్పైన్ వారిచే చాలవరకు చంపబడిన తరువాత 1068వ సంవత్సరమున నాంగ్లేయులిచట వలస నేర్పరచుకొనిరి. తన బానిసలమీద ప్రతి తెల్ల యజమానికిని సంపూర్ణమగు నధికార ముండవలెననియు యజమాని బానిస ఏమిచేసినను --- సభుత్వమువారు జోక్యము పుచ్చుకొనగూడదనియు నాశాసవమును గూడ వీరు ప్రత్యేకముగ చేసికొనిరి. వర్జీనియా రాష్ట్రము నుండియు నిచటికి తెల్లవారువచ్చి నివాసమేర్పరచు కొనిరి. 1683 సువత్సరమున కొందరు పరాసువాగును 1711 వ సంవత్సరమున కొందరు జర్మనువారును కాపురమునకు సచ్చి చేరిరి. ఎర్రయిండియనుల భూములను తెల్లవా రాక్రమించుటవలన ఎర్రయిండియసులతో యుద్దములు జరిగెను. ఎర్ర్యిండియను లోడిపోయి చాపగ మిగిలినవారు మరియొక ప్రాంతమునకు పారిపోయిరి. .
(5)
{జార్జియా}
ఇది ఆఖరువ స్థాపించబడిన రాష్ట్రము . 1712 జయా సంవత్సరమున బగిలుదోర్పను నాంగ్లేయుడు రెండవ జార్జి రాజునుండి దానపట్టాను పొంది నూటయిరువది మంది యాంగ్లేయులను వలసకు తెచ్చెను. దీనికి శవన్నా ముఖ్య పట్టణముగ నిర్మించిరి. ఈ రాష్ట్రమునకు బానిసలను తేననియు కల్లు సారాయి మొదలగు మత్తు పదార్దముల నిచటికి రానివ్వ సనియు బగిలుదోర్సు ఒడంబడిక చేసెను. జర్మనీనుండి కొందఱు మొరేలియను క్రైస్త వమత శాఖకు చెందిన జర్మనులును స్కొట్లండు నుండి స్కాచివారును కూడ తరువాత వలసవచ్చిరి. 1748 సంవత్సరమున బిలిటోర్పు అమెరికాను వదిలిపోయెను. ఆయన వెళ్ళగనే రాష్ట్రమున కల్లు సారాయిదుకాణము రేర్పడెను. బానిసత్వము విరివిగా సాగెను. ఇచటతోటలలో పనిచేయుట. ఆఫ్రికా బానిసలను విశేషముగ తెచ్చిరి. ఈ సందర్భమున నొక ప్రశ్న పుట్టవచ్చును. ఆంగ్లేయరాజు ఎర్ర
-
.
యిండియముల క్రిందనున్న అమెరికాలోని ప్రదేకములను ఆంగ్లేయులకు దానపట్టా నిచ్చుటెట్లని. ఇందుకు ప్రత్యుత్తర మేమునగా ఎర్రయిండియనులకు వారి దేశములో ఎట్టిహక్కులున్న వనిగాని తెల్లజాతులవారు అంగీకరించ లేదు. మరియొక "తెల్ల జాతి వారిచే నాక్రమింపబడని ప్రదేశములనన్నిటిని ఆక్రమిం చుకొనుటకును దాన మిచ్చుటకును తెల్లజాతులవారికి హక్కు గలదని తెల్లవారుతలచిరి.
{న్యూయార్కు}
1609 వ సంవత్సరమున డచ్చి (హాలండు) తూర్పు ఇండియూ కంపినీ వారు హడ్సను అను నతనిని అమెరికాకు బంపగ నాయన డెలవేము సముద్రమును హడ్స నునది ప్రాంతమును గుమ్మరివచ్చె ను. ఇప్పుడు న్యూయార్కు పట్టణమున్న ప్రదేశమునకు వచ్చి నప్పుడు హడ్సన్ అచటి ఎయిండియనులలోని ముఖ్యులకు త్రాగుటకు సారాయము వచ్చెను. వారిది వరకు సారాయము, తాగుట నెరుగరు. మొదట యొక్కడు మాత్రమే అను మానముతో త్రాగెను. త్రాగినవారు కొంతసేపు సోలి పిచ్చిమాటలాడి సొమ్మసిలి తిరిగి మంచిస్థితి వచ్చుటను జూచి ఎర్రయిండియనుల కాశ్చర్యము గలిగెను. చాలమంది త్రాగి జూచిరి. తెల్లవారి చేత విచిత్రమగుశక్తి గలదని తలంచిరి. " మనహట్పను" అనగా "తాగుడుస్థలము” అని యాస్థల మునకు ఎర్రయిండియసులు పేరిడిరి. యిండియనులతో . స్నేహముగ నుండిరి అప్పుడు హాలండు నుండి నౌకలువచ్చి ఎరయిండియనులవద్ద పక్షుల ఈకలు
కొనుచుండిరి. వర్తకులు వేసవికాలములోనుండుటకు కొన్ని చిన్న యిండ్లను నిర్మించిరి. తరువాత నివి 'చలికాలము వరకు సుంచబడెను. ఆ పైన ఒక చిన్న కోటనుకట్టిరి. తరువాత ఆల్బ. నీయసు ప్రదేశమున 1615 వ సంవత్సరమున హాలండువారు కొంతమంది కాపురము నకు వచ్చిరి. క్రమక్రమముగ హాలండు నుండి కొత్త వారు వచ్చి చేరిరి. 1623 వరకు డెల వేరుసముద్రమునుండి కాడు కేవు వరకును సముద్రతీరముననున్న ప్రదేశ మంతయు నా క్రమించి న్యూ నెదర్లాండ్సను పేరు పెట్టిరి. ఇపుడు న్యూయార్కు పట్టణమున్న ప్రదేశమున న్యూ అంస్టర్డం పట్టణ మువృద్ధియగు చుండెను. మనహట్టనులంకను, హాలండువారు 1625 వ సంవత్సరమున ఎర్రయిండియనుల నుండి ఇరువది అయిదు డాలర్లకు కొనిరి. ఏబదిమంది తెల్ల వారిని వలస దెచ్చుట కొడంబడిన ప్రతి (హాలండు) డచ్చి భూకామందు నకును పద నారు మైళ్ళ పొడవుగల ప్రదేశము నిచ్చిది. ప్రధమమున పక్కనున్న వర్జీనియా మొదలగు నాంగ్లేయ వలస రాష్ట్రములతో స్నేహముగనే యుండిరి. కొంత కాలమునకు ఎర్ర యిండియనులతో పోరాటములు ప్రారంభ మయ్యెను. తరువాతి నాంగ్లేయుల తోను, స్వీడను వారితోను కలతలు గలిగెను. కానిరాజీపడిరి. హాలండువారికిని ఆంగ్లేయులకును యూరపు ఖం డమున యుద్ధములు జరిగి 1674 సంవత్సరమున జరిగిన సంది వలన నీన్యూ నెదర్లాండ్సు రాష్ట్రమాంగ్లేయ పాలన ము క్రింద చేర్పబడెను. అప్పటి గండియు దీనికి న్యూ యార్కు రాష్ట్రమనియు ముఖ్య పట్టణమగు న్యూఆంస్టర్థం పట్టణముసకు న్యూయార్కు పట్టణమనియు పేరు పెట్టిరి. దీనిలో నాంగ్లేయులును డచ్చి వారును (హాలండువారు), కొంతమంది. స్వీడనువారును నివసించుచున్నారు. . (7)
{న్యూజర్సీ}
(8) 1664 సంవత్సరమున నాంగ్లేయులు (న్యూయార్కు)న్యూ నెదర్లాండు) పై దండెత్తి కొంత భాగము.నాక్రమించిరి. దీనికి న్యూజర్సీయని పేరిడిరి. దీనిలోను నాంగ్లేయులున డచ్చి వారును గాపురమున్నారు.
{పెనిసిల్వేనియా
డెంవేరు
రాష్ట్రములు}
{న్యూ ఇంగ్లాండు,
మెసషుసెట్సు
కనెకేటికటు
న్యూహాంపుషైరు
రోడు అయిలండు
రాష్ట్రములు
ఈ రాష్ట్రములు అమెరికా జాతికి ముఖ్యముగు యునికి పట్టులు. ఆంగ్లేయ దేశములో ప్రభుత్వము స్థాపించబడిన - ప్రొజెస్టంటుకైస్తవ మత శాఖకు చెందని వారిని ' ఆంగ్లేయ రాజులు క్రూరముగ హి సించుచుండిరి. 1602 వ సంవత్సరమున కొందరాగ్లేయు లాబాధలుపడ లేక నింగ్లాండు నుండి పారిపోయి హాలెండు చేశములో శరణుజొచ్చిరి. గాని హాలెండు దేశపు శీతోష్ణ స్తితులు ఆచారములు వారికి సరిపడ లేదు. అందువలన అమెరికాలో వలసల నభివృద్ధి చేయుట కింగ్లాండులో నేర్పరచబడిన లండను సంఘమునకు తమ కమెరికా ఖండముస కొంతనివాస యోగ్యమగు గల మిప్పించమని దరఖాస్తు పెట్టుకొనిరి "మేమందరమును మత ప్రేమాపాలను లచే బంధించబడిన 'వారము, ఒకరిమేలు మరియొకరు చూడవలసినవారము. ఎంతదూరమైనను మత స్వేచ్చకొరకై పోవుటకు సిద్ధముగ నున్నాము,” అని దరఖాస్తులో వ్రాసికొనిరి. లండను సంఘ మీధీర బృందమునకొక దానపట్టానిచ్చెను. కాని పొపము కొంతకాలమువరకు ప్రయాణముచేయుటకు ద్రవ్యము పుట్టలేదు. కట్టుబట్టలతో నింగ్లాండు నుండి హాలెండుకు మన స్సాక్షి చెప్పిన చొప్పున వర్తించుటకై లేచిపోయియుండిరి. తుదకు లండను సంఘమునుండి యే వారు నిర్నయించిన కఠిన షరతులకెల్ల సమ్మతించి కొంత సొమ్మును సంపాదించిరి. రెండు పడవలను తెచ్చుకొనిరి. కాని ప్రయాణమయ్యే వేళకొళ పడవ యజ మాని మోసము చేసెను. 1620 వ సంవత్సరము
సెప్టెంబరు 6వ తేదీన “మేప్లవర"ను నా పడవలో నూట యిద్దరాంగ్లేయులు అమెరికాకు ప్రయాణము చేసిరి. వారు హడ్సనునది ప్రాంతమున నివసించ నుద్దేశించిరి. కాని అరువది. ఏడురోజులు ప్రయాణము చేసి - కేపుకాడు వద్దదిగిరి. నౌకలో నుండగానే నీదిగువవిధమున నేర్పాటుచేసికొనిరి. "భగవంతుని నమ్ముఖమున మనకు తెలియచేయునదేమనగా, ఈదిగువ నామోదుచేసిన 'పేర్లుగల జేమ్సురా జుయొక్క ప్రజలమైన మనము, భగవంతుని ఘనపర్చుటకును క్రైస్తవమతము నభివృద్ధి చేయు టకును మనరాజు యొక్కయు దేశముయొక్కయు గౌరవము నిమిత్తమును పరమేశ్వరుని యనుగ్రహము వలన వర్జీనియాలోని యుత్తర ప్రాంతము లలో మొదటి పలస నేర్పరచుట కుద్దేశించి యున్నాము. కాన మన అందరి యెదుటను భగవంతుని సమ్ముల మునను మన క్షేమమునిమిత్తమును మనయుదేశ్యములను నెర వేర్చుకొను నిమిత్తమును మనమొక పాలనా సంఘముగ నేర్ప డినారము. మన వలస యొక్క లాభమునిమిత్తము న్యాయ మైనట్టియు యుక్తమైనట్టియు చట్టములను మనము చేసికొనిదము. వాటికి మసము విధేయులమై ప్రవర్తింతము. దీని కొప్పుకొని 1620వ సంవత్సరము నవంబరు 11 వతేదిన మన మందరము సంతకములు చేయడమైనది" స్వేచ్ఛగలమానవులు స్వేచ్చగా తాము చేసికొనెడి శాసనములకు బద్దులై నడచుకొసుటయే యుత్తమమగురాజనీతి. దీనిని ఈ అమెరికెను వలస ప్రజ లనుకరించిరి. వారాచుట్టుపట్ల ప్రదేశములను చూచి డిసెంబరు 11 తేదీన న్యూఇంగ్లాండును స్థాపించిరి. ఆశీతాశాలము దుర్భరమగుటచే చాలమంది మరణించిరి. - . I
1621 సంవత్సరము మార్చి నెలాఖరుడు అరువది మంది మాత్ర ము మిగిలియుండిరి. మరుసటివత్సరము క్రొత్తగా ముప్పది అయిదుగురు పచ్చిచేరిరి. కాని వారివద్ద బొత్తుగా నాహార పదార్దములు లేకుండెను. ఆరు నెలలవరకందరు నొంటిపూటనే భోజనముచేసిరి. 1623 సంవత్సరమున భగవదనుగ్రహము వలన వంట బాగుగా పండినది. ఇంతటినుండియు భోజనము నకు కొదువ లేదు. కానీ రాజు యొక్క దానశాసనము వారికి లభింప లేదు. వారికి యితర నరుకులు మిక్కిలి కష్టముమీదను ప్రియముగను సమకూరెను. వారాంగ్లేయ దేశమున కెగుమతి చేయువానిని ఆంగ్లేయ ప్రభుత్వమువారు జప్తు చేసిరి. కావున ఈ రాష్ట్రము విశేషకాలమువరకు వృద్ధి చెంద లేదు. పదిసంవ త్సరములతర్వాత వీరిసంఖ్య మూడువందలు మాత్రముండెను. కాని వచ్చినవారు ధీరత్వముతో నీప్రదేశమును వీడక యుండిరి. వీరికి ప్రధమమునుండియు ఎర్రిండియనులతో పోరాటములు కలుగుచుండెను. వీరిలో నొక జట్టు చుట్టుప్రదేశముల వెదకి చూచుచున్న సమయమున ఎచటనుండియో బాణములు తగిలెను. తరువాత 1624 సంవత్సరము మార్చి 15 వ తేదీవి ఒక ఎర్రయిండియసు అడవిలో నుండి వచ్చి వీరిలో కొందరితో కలసి " మీకు స్వాగతము” అని యింగ్లీషుభాషలో చెప్పెను. ఆంగ్లేయులు వానితో స్నేహముచేసిరి, అదివరకు హంటు అను పేరుగల తెల్ల వాడొకడు ఎర్రయిండియనులతో సఖ్యము చేసినట్లు కొన్ని రోజులు నటించి తరువాత నొకరోజున కొందరెర్రయిండియనులను తన పడవలోని కెక్కించుకొని తటాలున వారిని బానిసలుగ తీసికొని సముద్రము మీధ వెళ్ళిపోయినాడని వాడు చెప్పెను. ఆరాత్రి వాడాంగ్లేయుల వద్దనుండెను. మరు నాడుదయమున కొన్ని బహుమానములను పొంది వాడేగెను, తరువాత కొద్దిరోజులకు మరి అయిదుగు రెర్రయిండియను "లతో కూడ వాడు వచ్చెను.. మార్చి 22 తేదీన వారాంగ్లేయు లను తమ ప్రభువగు మెస్ససోయిటు వద్దకు తీసికొనిపోయి స్నేహమును కుదిర్చిరి. మెస్ససోయిటుకు మరియొకజాతి ఎర్ర యిండియనులు విరోధులుగ నుండిరి. వారినుండి తనకు సహాయము చేయవలసినదని ఆంగ్లేయులను గోరెను. ఆంగ్లేయులు సమ్మతించిరి. ఈసంగతి రెండవజాతి , ప్రభువుకు తెలసి ఆంగ్లేయులతో యుద్ధము చేయుటకు వచ్చుచున్నానని గుర్తుగ బాణముల కట్టనుపంపెను. ఆంగ్లేయులలోని ముఖ్యుడు. తోలుసంచిలో కొంత మందుగుందు పెట్టిపంపెను. దీనికి భయపడి యీ రెం డవ ఎర్రయిండియను జాతివారి రాజు యుద్ధము చాలించుకొనెను. ఇంతలో మరిగొంద రాంగ్లేయు లచటికి వలసవచ్చిరి. వారివద్ద భోజనసామాగ్రి అయిపోయినందున భోజనమున , ఎర్రయిండి యనులతో న్నే హముచేసి కొన్ని రోజులకు వారినిదోచుకొనిరి. దానితో ఎర్రయిండియను లీ తెల్ల వారిని నాశనము చేయుటకై 'కుట్రపన్నిరి. కాని ఆంగ్లేయుల మిత్రుడగు ఎర్రయిండియనుప్రభువు మొస్ససోయిటు కుట్రసంగతి ఆ గ్లేయులకు తెలిపెను. కుట్రదార్ల ముఖ్యులొక యింటిలో నుండగ నాంగ్లేయులు వారిని ముట్టడి,చి హత్యగావించిరి. అప్రదేశమున నున్న ఎర్రయిండియనులందరును పారిపోయిరి. తరువాత కొందరు లోబడి ఆంగ్లేయులతో సంధిచేసికొనిరి.
ఆంగ్లేయులు పంటలు పండించి ధాన్యమును ఎర్ర యిండియనుల కమ్ముచువచ్చిరి. మంచి మంచి మృగముల చర్మము లెర్ర యిండియునులు తెచ్చి యిచ్చుచుండిరి. వీటి నాంగ్లేయు లింగ్లాండునకు రవానా చేయుచుండిరి. ఇంచు వలన యెరయిండియనులు వ్యవసాయముమాని, వేటాడి తోళ్ళ నాంగ్లేయులకిచ్చి వీరినుండి ధాన్యమును తీసుకొనిపోవు చుండిరి. ఎయిండియనుల స్థితి క్షీణించెను. ప్రధమమున న్యూ ఇంగ్లాండును స్థాపించిన ఆంగ్లేయులను “పిలిగ్రింఫాదర్సు” (యాత్రికులని) పిలుచుచుండిరి.
{మినిషుసెట్సు}
1628 సంవత్సరమున మనషుసెట్సు వలస కొందతాం గ్లేయులచే స్థాపింపబడెన'. నేలము పట్టణము ప్రధమమున ముఖ్య స్థానముగ సుండెను. తరువాత బాస్టన్ పట్టణము వృద్దియయ్యెను. 1635 సంవత్సర మున మూడు వేలమంది కొత్త వారు వచ్చి చేరిరి.
{కనెక్టికటు}
మెసషు సెట్సు ప్రాంతము నుండి కొందరు పోయి కనెక్టి కటు ప్రాంతమున వలస స్థాపించు కొనిరి. ఆప్రాంతము "పికెడ”ను ఎర్రయిండియమజాతివారిది.వారాంగ్లేయులయందు ద్వేషభాషను జూపిరి. ఒక ఎరయిండియను ప్రభువు నాంగ్లేయు లెత్తుకొని వచ్చి చంపిరి, ఇద్దరాగ్లేయులను ఎర్రయిండియనులు చంపిరి. మెసషు సెట్సు ప్రాంతములనుండి ఆంగ్లేయులువచ్చి ఎర్రయిండియ నుల గ్రామముల తగుల బెట్టి సస్యములను పొడుచేసి వెళ్ళిరి, కనెక్టికటు వలసవారు కూడ పికెడుజాతి వారిమీద యుద్ధము నకు బయలు వెడలిరి. పికెడు జాతికి విరోధులగు మొహగను లను ఎర్రయిండియను జాతివారి సహాయము సొంగ్లేయులు ఖాళీ పుట ఖాళీ పుట
సంపాదించిరి. నర్రగనుసెటు జాతి వారిని కూడ తమలో జేరవలెనని ఆంగ్లేయులు కోరిరి గాని వారు చేర లేదు. ఆంగ్లో యులును మొహగను జాతివారుసు అర్ధ రాత్రి వేళ పికెడుజాతి వారి ముఖ్య గ్రామము మీద నాకస్మికముగ పడి అన్ని యిం డ్లను తగుల బెక్టిరి. తగులవడుచున్న యిండ్లలోనుండి తప్పించు కొని బచుటకు వచ్చుచున్న పురుషులను స్త్రీలను శిశువులను పధించి ఒక గంట సేపటిలో నారువందలమందిని చంపిరి. ఆసమయమున నిద్ద రాంగ్లేయులు మాత్రము మరణించిరి. మరు నాడు మూడు వందలమంది పికెడు జాతి వారు యుద్ధమునకు రాగ వారా నాంగ్లేయులోడించి చాలమంది హతులను జేసిరి. మిగిలినవారు పారిపోయిరి... అజాతిలోని తక్కి ననారి నందరిని ఆంగ్లేయులును వారి మిత్రులగు నెర్రయిండియములును ఒక ప్రదేశము నుండి మరియొక ప్రదేశమునకు వెంటనంటి తరుముచు దొరికిన వారినల్ల నరికి వేసిరి. వారిలో రెండు వందలమంది శరణాగతులుకాగా వారు బానిసలుగ చేయబడిరి. మిగిలిన పికెడు జాతీయంతయు నిర్మూలమయ్యెను. నరగను సెటుజాతి వారీయ ద్దములో తమతో జేర లేదని వారిరాజగు మైంటోనో మో తమమీదకుట్రలు పన్ను చున్నాడని ఆంగ్లేయు లు నేరోపణ చేసిరి. ఆయన తానేమి చేయలేదనియు తన విరోధియగు మొహగనుల బాసురాజు అబద్దములు చెప్పి నాడనియు నాయన చెప్పెను. ఆంగ్లేయులు మైంటొనోమోను విచారణకు తెచ్చి నేరస్థుడని తీర్మానించి మరణశి. విధించి. చుపుటకు మొహగసుల రాజునకు వప్పగింత చేసిరి. మొహా గసుల రాజు యొక్క తమ్ముడు మైంటోనో మో తలమీద నులితో
కొట్టిచంపెను. ఈమైంటోనోమో ఇదివరకాంగ్లేయులకు పరమ మిత్రుడుగ నుండెను.
{న్యూహాంపషైరు}
1622 సంవత్సరమున కొందరాంగ్లేయులు ప్లిమతు సంఘమునుండి దానపట్టాను పొంది యంరికాకువచ్చి న్యూ హంపు పైరు వలనను స్థాపించిరి.
{రోడు అయిలండు}
మెసషు నెట్ను రాష్ట్రము లో రోగరు విలియమ్సు అను మతబోధకుడు మనస్సాక్షి ప్రేరేపించిన ప్రకారము ఈశ్వరుని ప్రతివారు నారాధింపవచ్చు నని బోధించెను. ఇందు కారాష్ట్రములోని ప్యూరిటసు క్రైస్తవులీతనిని బహిష్కరించిరి. రోగరువిలియమ్సు పారి పోయి పదునాలుగు వారములు తిండి విశ్రాంతి ఎఱుగక తిరిగెను. ఆంగ్లేయులెవరు నీతనికి తావునివ్వలేదు. నరగనునె టులను ఎర్రయిండియనుల జాతివారి ప్రభువగు మైంటోనో 'మో ఈతని నాదరించి యతిథ్యమిచ్చి విశేష విస్తీర్ణముగల భూ మి, దానముచేసెను. ఇందులో అతను నివసించెను. కొలది కాలములో ననేక మంది యాంగేయు లిచటకు వచ్చి కాపుర ముండిరి. దీనికే రోను అయిలండని పేరు. ఈ మెంటోసోమా ప్రభువునే కనెక్టికటు రాష్ట్రపు ఆంగ్లేయులు మరణశిక్ష విధించి శంపించి యుండుట మనము చూచి యున్నాము. రోడు అయిలండులో సంపూర్ణ ప్రజాస్వామ్యమును పూర్తియగు మత స్వే చ్చయు నెలకొల్పబడెను.
మెసషు సెట్సు వలసనుండి జూన్ ఎలియటను అంగ్లేయుడు
{పిలిపురాజు
యొక్క యుద్దము}
ఎర్ర యిండియనులలో క్రైస్తవ మతము వ్యాఇంప జేయ యత్నించెను. బైబిలు ఎర్ర యిండియనులు భాషలోనికి మార్చెను. ఒక ఎర్రయిండియను బి.ఎ. పరీక్షయందారితేరెను. ఎర్రయిం డియనులు నివసించు కొన్ని గ్రామములు క్రైస్త పమతములో చేరెను. కాని మరికొన్ని జాతులకు క్రైస్తవమత వ్యాపన మిష్టముగ లేదు. అదివర కింగ్లీషు వారికి స్నేహితులుగనున్న వామనోగు లను ఎర్రయిండియను జాతివారు ఆంగ్లేయులచే సముద్రతీరము వరకును తరుమబడిరి. వారిరాజు మెస్సపో యిటు మరణిం చెను. అతని కుమారులలో నొకనిని ఆంగ్లే యులు పట్టుకొని చెరసాలలో యుంచినందున అచట దుఃఖము చేత సతడు మరణించెను. మరియొక కుమారుడు ఫిలిప్పు అను " పేరుగల వాడు రాజయ్యెను. ఒక ఎర్రయిండీయను ఆంగ్లేయుల రహస్వపు కొలువున చేరి తన జాతి వారి గుట్టుతెలుపుచుండినందున నాతనిని తనజాతి వారు చంపి", అతనిని చంపిన వారిని ఆంగ్లేయులు పట్టకొని " యురి దీసిరి. ఇందుకు ప్రకారముగ ఎయిండియను యువకు లాం గ్లేయులపై ' దండెత్తిపై ఎనిమిది తొమ్మిదిమంది ఆంగ్లేయులను హత్య గావించి. ఫిలిప్పురాజు కిదియుయసమ్మతమే. కాని ఆంగ్లేయులు ఫిలిప్పు రాజుయొక్క.. రాజ్యమును ముట్టడి వేసిరి. ఆంగ్లేయులను జయించుట యసంభవమని.. అతనికి: దోచెను. వారము దినములలోపల ఇండియనుల ప్రదేశమునంతను ఆంగ్లేయు లాక్రమించుకొనిరి. చావగమిగిలిన యిండి మనలు పారిపోయి. ఫిలిప్పురాజు పారిపోయి యితరయిండియను జాతుల శరణుజొచ్చెను ఒక చోటనుంచి మరియొక చోటునకు బోయి యిండియను జాతు లనందరను ఆంగ్లేయుల పై యుద్ధమునకు లేవదీసెను. మైన్ మొదలు కనెక్టికటువరి కున్న జాతులందరును ఆంగ్లేయుల పైకి లేచిరి. మొహగను జాతివారు మాత్రము వీరిలో చేరలేదు. ఒక సంవత్సరమువరకు యుద్దము భయంకరమగ జరిగెను. ఆంగ్లేయు లయొక్క పన్నిండు పదమూడు పట్టణములు నాశనము చేయబడెను. ఆరువందల గృహములు తగుల పెట్టబడెను. ఆంగ్లేయులలో ఇరువదవవంతు చంపబడిరి. కాని తుదకు ఎర్రయిండియను లోడిపోయిరి. నర్రిగను సెటి జాతివారు నాశనము చేయబడిరి. కొన్ని జాతుల వారు తమ ప్రదేశములను ఆంగ్లేయులకు వదలి పారిపోయిరి. ఫిలిపుయొక్క భార్యా పిల్లలు. ఆంగ్లేయులకు చిక్కిరి ఫిలిపును వెంబండించి కాల్చిచంపిరి. అతనిశిరమును ఖండించి ఆంగ్లేయ వలసరాజ్యమంత లోను త్రిప్పి ప్రదర్శించిరి. అతని కుమారుని బానిసగ విక్రయించి, ప్రప్రధమమున ఆంగ్లేయ యాత్రికులతో స్నేహము చేసిన మెనపోయిటు రాజవంశ మీ విధమున 1676 వ సంవ త్సరములో సంతరించెను.
(10)
{ప్రజాప్రతినిది సభలు
ఈపదమూదు వలన రాష్ట్రములును ఆంగ్లేయ రాజునకు లోబడి యుండెను. ఆంగ్లేయ రాజుల యనుమతితో పజా ప్రతినిధి సభలను స్థాపించు కొనెను. ఆంగ్లేయ రాజులు గవర్నరులను నియమించిరి . వీటి కుత్తరమునసున్న కనడా దేశము , ఫెంచి రాజులకు లోబడి యుండెను. యూరపుఖండమున తరుచుగా ఆంగ్లేయులకును
ఫ్రెంచివారికిని యుద్ధములు జరుగుచుండెను. అపుడు కనడా దేశ వాసులగు పరాసువారికిని ఈపదమూడు వలస రాష్ట్రము లలోని యాంగ్లేయులకును యుద్ధములు జరుగుచుండెను. యూ రవులో సంధి జరిగినపుడెల్ల వీరి యుభయుల మధ్యను, సంధి జరుగుచుండెను. అమెరికాలో జరిగిన యుద్ధములలో సాధా రణముగ పరాసువారు తమ చుట్టునున్న ఎర్రయిండియనుల సహాయమును పొందుచుండిరి. 1756 మొదలు 1768 వరకు జరిగిన ఏడు సంవత్సరముల యుద్దములో ఆంగ్లేయులు జయమొందుటయు కనడా దేశము ఆంగ్లేయ రాజులకు స్వాధీనమగు టయు పైన చూచియున్నాము,