పుట:Womeninthesmrtis026349mbp.pdf/127

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

షష్ఠాధ్యాయము

109

సంతానములేని వితంతువు నియోగముచేసికొనవలెనని యిందుగలదు. కాన నీస్మృతియే స్థలాంతరమున వివాహము విధింపదు. అంతియేకాదు. సంతానముగల స్త్రీకి నియోగము కూడ పనికిరాదని దీనివలన తెలియుచున్నది. ఇకవివాహము పనికిరాదని వేఱుగ చెప్పనక్కరలేదు కదా! పునర్వివాహము నిషిద్ధము కావుననే నియోగము విధింపబడినదికాని పునర్వివాహము నిషిద్ధము కానిచో నట్టి యావజ్జీవ సుఖదాయకావకాశముండగా స్వల్పకాల భోగ్యమైన నియోగమే యేల గతియగును?

సంతానము లేక పోయిననుగూడ వితంతువు పునర్వివాహము చేసికొనరాదని నారదుని మతమైనట్లీ క్రింది శ్లోకము కూడ స్పష్టముగ తెల్పుచున్నది.

     మృతేభర్తర్యపుత్రాయాః పతిపక్ష: ప్రభుః స్త్రియా:
     వినియోగాత్మరక్షాసు భరణేచవ ఈశ్వర:
(నారద 13-28)

(అపుత్రకు భర్తపోయినవాడగు చుండగా నాతని పక్షమువారే యధికారులగుచున్నారు. నియోగమందును, నాత్మరక్షయందును, భరణమునందును వారే ప్రభువులు)

షండడగు భర్తను వదలి మఱొకని వివాహమాడ వచ్చునని నారదస్మృతి చెప్పుట పైననీయబడిన నారద. 12-80, 81., 13-28 లకు విరుద్ధముగనున్నది.

      ఈర్షాషండాదయో యేన్యేచత్వారస్స ముదాహృతాః
      త్యక్త వ్యాస్తేపతితవత్ క్షతయోన్యా అపిస్త్రియా
                                   (నారద. 12-15)

(ఈర్ష్యాషండాదులగు నల్గురును గూడ క్షతయోనిచేత గూడ పతితులవలె విడువబడదగిన వారే.)

      అక్షిప్తమోఘ బీజాభ్యాంకృతే పిపతికర్మణి
      పతిరన్యఃస్మృతోనార్యా వత్సరార్థం ప్రతీక్ష్యతు
                                (నారద. 12-16)

(విగతబీజుడును వ్యర్థబీజుడును నగు పురుషునిచేత వివాహమాడబడిన స్త్రీ యొక సంవత్సరము నిరీక్షించి మఱొక భర్తను వివాహమాడవలెను.)

భర్త చనిపోయిన యపుత్రకు నియోగమును గత పుంస్త్వుడగు భర్తగల యపుత్రకు పునర్వివాహమును కర్తవ్యములని చెప్పుట కేవల మసంగతము. నారదస్మృతిలో నిట్టి యసంగతము లుండుటచేతనే కాబోలు పరాశర యాజ్ఞవల్క్యులు స్మృతులను పేర్కొనుటలో నాస్మృతిని వదలి వైచిరి.

గౌతముడనన్య పూర్వనే వివాహము చేసికొనవలెనని చెప్పినట్లిదివఱలో చూచియున్నాము. అన్యపూర్వను వివాహము చేసికొనినవాడు (దిధిషూపతి) న్తేన క్లీబపతిత నాస్తి