పుట చర్చ:Womeninthesmrtis026349mbp.pdf/127

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
విషయాన్ని చేర్చు
వికీసోర్స్ నుండి

సవరణలు[మార్చు]

109 వ పుటలో 16 వ పఙ్క్తికిని 17 వ పఙ్క్తికిని నడుమ నీక్రింద వాక్యములను చేర్చుకొనవలెను:

షండడగు భర్తను వదలి మఱొకని వివాహమాడ వచ్చునని నారదస్మృతి చెప్పుట పైననీయబడిన నారద. 12-80, 81., 13-28 లకు విరుద్ధముగనున్నది.

      ఈర్షాషండాదయో యేన్యేచత్వారస్స ముదాహృతాః
      త్యక్త వ్యాస్తేపతితవత్ క్షతయోన్యా అపిస్త్రియా
                                   (నారద. 12-15)

(ఈర్ష్యాషండాదులగు నల్గురును గూడ క్షతయోనిచేత గూడ పతితులవలె విడువబడదగిన వారే.)

      అక్షిప్తమోఘ బీజాభ్యాంకృతే పిపతికర్మణి
      పతిరన్యఃస్మృతోనార్యా వత్సరార్థం ప్రతీక్ష్యతు
                                (నారద. 12-16)

(విగతబీజుడును వ్యర్థబీజుడును నగు పురుషునిచేత వివాహమాడబడిన స్త్రీ యొక సంవత్సరము నిరీక్షించి మఱొక భర్తను వివాహమాడవలెను.)

భర్త చనిపోయిన యపుత్రకు నియోగమును గత పుంస్త్వుడగు భర్తగల యపుత్రకు పునర్వివాహమును కర్తవ్యములని చెప్పుట కేవల మసంగతము. నారదస్మృతిలో నిట్టి యసంగతము లుండుటచేతనే కాబోలు పరాశర యాజ్ఞవల్క్యులు స్మృతులను పేర్కొనుటలో నాస్మృతిలో వదలి వైచిరి.