పుట:Womeninthesmrtis026349mbp.pdf/128

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

110

స్మృతికాలపుస్త్రీలు

కులవలె శ్రాద్ధభోజనమున కనర్హుడని యీక్రింది సూత్రము చెప్పుచున్నది.

    నభోజయేత్ స్తేనక్లీబ పతితనాస్తికతద్వృత్తి
    వీరహాగ్రే దిధిషుదిధిషూపతి స్త్రీగ్రామయాజకా
    జపాలోత్సృష్టాగ్ని మద్యవకుచరకూట
    సాక్షిప్రాతిహాధికాన్
(గౌ.ధ.సూ.11-16)

సంతానములేని వితంతువు సంతానముపొందదలచుచో మఱదివలన పొందవలెనినియు

(అపతి రపత్య లిప్సుర్దేవరాత్)

(గౌ.18-4)

నట్లు భర్తతోకలియుట యొక సంతానము గలుగు వఱకేయనియు తర్వాత కూడదనియు

(నాతిద్వితీయం)

(గౌ. 18-8)

చెప్పుటచే కూడ గౌతముడు సంతానము లేని వితంతువుకు నియోగమే గతిగ నంగీకరించినాడు కాని పునర్వివాహమున కంగీకార మీయలేదు.

యాజ్ఞవల్క్యుడుకూడ 'అనన్యపూర్వికనే' వివాహమాడవలెనని శాసించినట్లు చూచియున్నాము. క్షతయోనియైనను నక్షతయోనియైననుగూడ భర్తనువిడచి కామముతో మఱొకని (నవర్ణునైనను) నాశ్రయించు "పునర్భు"వు నతడు "స్వైరిణి" యని చెప్పుచున్నాడు.