పుట:Womeninthesmrtis026349mbp.pdf/129

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

షష్ఠాధ్యాయము

111

    అక్షతా చక్షతాచైవ పునర్భూస్సంస్కృతాపునః
    స్వైరిణీయాపతింహిత్వా సవర్ణం కామతః శ్రయేత్
(యాజ్ఞ 1-68)

పునర్భువునుగూర్చి యంగిరఃస్మృతి యిట్లు చెప్పుచున్నది.

    అన్యదత్తాతుయానారీ పునరన్యస్య దీయతే
    తస్యాశ్చాన్నం నభోక్తవ్యం పునర్భూస్సా ప్రగీయతే
(అంగిర: 1-66)

(ఒకని కీయబడి మఱల నింకొకనికీయబడు స్త్రీ పునర్భువనబడును. ఆమె చేతియన్నమును తినకూడదు)

వసిష్ఠుడుకూడ పునర్భువునిట్లు రెండు విధములుగ నిర్వచించుచున్నాడు.

    యాకౌమారం భర్తారముత్సృజ్యా న్యైస్సహచరిత్వా
    తస్యైవకుటుంబ మాశ్రయతి సాపునర్భూర్భవతి
    యా క్లీబం పతిమున్మత్తం వాభర్తారముత్సృజ్యా
    న్యంపతింవిన్దతే మృతవాసా పునర్భూర్భవతి
(వసి.27-19, 20)

(భర్తనువిడచి యితరులతో తిరిగి మఱల నాభర్త కుటుంబమునే యాశ్రయించునది పునర్భువు. పతి క్లీబుడు, పతితుడు, పిచ్చివాడు మృతుడునైనపు డన్యుని చేసికొనుచో నామెయు పునర్భువే.)