పుట:Womeninthesmrtis026349mbp.pdf/130

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

112

స్మృతికాలపుస్త్రీలు

భర్త నపుంసకుడు, పతితుడునైనను గూడ మఱొకని వివాహ మాడరాదనుచో సంతానములేనివానిభార్య యేమిచేయవలెనన;

    ప్రేతపత్నీ షణ్మాసాన్వ్రత చారిణ్యక్షారలవ
    ణంభుంజానాధః శయీత
    ఊర్థ్వంషడ్స్వో మాసేభ్యః స్నాత్వాశ్రాద్ధం
    చవత్యై దత్వా విద్యాకర్మగురుయోని సంబంధాన్
    సన్నిపాత్య పిత్రాభ్రాత్రావా నియోగంకారయేత్
(వసి 18-55, 56)

(భర్తపోయిన స్త్రీ క్షారలవణ రహితమైన భోజనమును చేయుచు కటికనేలపై బరుండుచు నాఱునెలలుగడపి విద్య చేతను వర్తన చేతను ఘనులైనవారిని రక్తబంధువులను సమీపించి వారి సమీపమున తండ్రిచేతగాని సోదరునిచేతగాని నియోగము చేసికొనుటకు నియమింపబడవలెను.)

మఱొకని భార్యను తనయొద్ద నుంచుకొనినవాడు కృచ్ఛ్రాతికృచ్ఛ్ర ప్రాయశ్చిత్తములను చేసికొని యామెను మఱల నాతని కొప్పగింపవలెనని కూడ వసిష్ఠుడు చెప్పు చున్నాడు.

    దిధిషూపతిః కృచ్ఛ్రాతి కృచ్ఛ్రౌకృష్ణ త్వాత
    దత్వా పునర్నివిశేత్
(వసి. 20-10)