పుట:Womeninthesmrtis026349mbp.pdf/131

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

షష్ఠాధ్యాయము

113

ఆపస్తంబుడుకూడ పూర్వమితరుని వివాహము చేసికొనినదానిని పెండ్లాడరాదని చెప్పినట్లిదివఱలో చూచి యున్నాము.

రెండవపెండ్లి చేసికొనిన స్త్రీ చనిపోయినచో నెవరికిని గూడ దశరాత్రాశౌచము లేదని స్మృతులు చెప్పుటచేతనే యామె యెంతభ్రష్టగ పరిగణింపబడినదో తెలియగలదు.

పరపూర్వాసుచస్త్రీ షుత్య్రహాచ్ఛుద్దిరిష్యతే.

(లిఖిత. 15-10)

(పరపూర్వలగు స్త్రీలు చనిపోవుచో మూడునాళ్లతోనే శుద్ధి)

మను, గౌతమ, వసిష్ఠ, పరాశరాపస్తంభాంగిరో, యాజ్ఞవల్క్యాది స్మృతులన్నియు స్త్రీకి పునర్వివాహమును నిషేధించినవనియు, పతిపోయినపిమ్మట పూర్ణమయిన యింద్రియనిగ్రహముతో నుండుటయే యామె కర్తవ్యమనియు సంతానములేని వితంతువుమాత్ర మొకసంతానము కల్గుటకై మఱదిని ఋతుకాలమున పొందవచ్చుననియు చూచి యుంటిమి. నియోగము చేసికొనవచ్చునను ననుజ్ఞయేకాని చేసికొనవలెనను నియమములేదని కూడ గుర్తింపవలెను. పై నుదాహరింపబడిన కొన్ని వాక్యములలో ('అపత్యలిప్సః,' సంతానమును కోరినట్టిస్త్రీ, మున్నగుపదములలో) నీయంశము స్పష్టముగనే చెప్పబడియున్నది. భర్తనియోగము చేసికొనవల