పుట:Womeninthesmrtis026349mbp.pdf/126

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

108

స్మృతికాలపుస్త్రీలు

వాగ్దానపతియేకాని వివాహితపతికాడని 'వివాహవిధాన' మను ప్రకరణములో చేయబడిన సిద్ధాన్తమునకిది మఱింత బలము నొసగుచున్నది. భర్తచనిపోయినపుడే పునర్వివాహము లేదని తేలుచుండగా నాతడు నష్టుడు వ్రవ్రజితుండు, క్లీబుడు, పతితుడునై జీవించియున్నపుడు పునర్వివాహము కూడదని వేరుగ చెప్పనక్కరలేదుగదా. ఈ'నష్టేమృతే' యను శ్లోకమే నారదస్మృతిలో నున్నపుడు (12-97) గూడ నట వివాహితపతి యుద్దేశింప బడలేదని చెప్పుటకా స్మృతినుండియే కొన్నిశ్లోకముల జూపవచ్చును.

నారదస్మృతిలో నీక్రింది శ్లోకములు గలవు

    అనుత్పన్న ప్రజాయాన్తుపతి: ప్రేయాద్యదిస్త్రియః
    నియుక్తాగురుభిర్గచ్ఛేద్దేవరం పుత్రకామ్యయా
    నచతాం వ్రతివద్యేత తథైవాపుత్రజన్మతః
    పుత్రేజాతే నివర్తేత నరకస్స్యాత్తతో న్యథా
(నారద12-80, 81)

(స్త్రీకి సంతానముకలుగకుండ భర్తచనిపోవుచో నామె పెద్దలచే నియమింపబడినదై సంతానకాక్షతో మఱదిని పొందవలెను. ఆమెకు పుత్రుడు కల్గువఱకును నాతడామెను పొందవలెను. ఆపుత్రుడు గల్గుటతోడనే వారి సంబంధ మంతరించును. ఆపిమ్మట నాసంబంధముండుచో వారికి నరకము వచ్చును.)