పుట:Womeninthesmrtis026349mbp.pdf/125

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

షష్ఠాధ్యాయము

107

వివాహిత స్త్రీకి పునర్వివాహముచేయుట నే స్మృతియు గూడ నంగీకరించుటలేదు.

పరాశరస్మృతి యిట్లు చెప్పుచున్నది:-

    మృతేభర్తరియానారీ బ్రహ్మాచర్యే వ్యవస్థితా
    సామృతాలభతేస్వర్గం యథాతే బ్రహ్మాచారిణః
    త్రిసఃకోట్యర్ధ కోటీచయానిలో మానిమానుషే
    తావత్కాలంవసేత్స్వర్గే భర్తారం యానుగచ్ఛతి
    వ్యాళగ్రాహీ యధావ్యాళం బలాదుద్ధరతే బిలాత్
    ఏవం స్త్రీవతిముద్ధృత్యతే నైవసహమోదతే
(పరాశర 4-31, 32, 33)

(భర్తపోయినపిమ్మట బ్రహ్మచర్యముతో నుండు స్త్రీ చనిపోయినపిమ్మట కణ్వాదిబ్రహ్మచారులవలెనే స్వర్గమునొందును. సహగమనముచేయు స్త్రీ మూడున్నరకోట్ల సంవత్సరములు స్వర్గములోనుండును పాములవాడు పామునెట్లు బిలము నుండి లాగునో యామెయునట్లే పతితుడైన భర్తనుద్ధరించి యాతనితో నానందించును)

భర్త చనిపోయినపిమ్మట దేహత్యాగమును చేయుటకును బ్రహ్మచర్యము నవలంబించుటకును హెచ్చరించుచున్న పరాశరస్మృతి పునర్వివాహమును విధించుట యసంభవము గదా? 'నష్టేమృతే వ్రవ్రజితే' యను శ్లోకములోని పతి