పుట:Womeninthesmrtis026349mbp.pdf/124

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

106

స్మృతికాలపుస్త్రీలు

ఇక మిగిలియున్న సందేహమేమనగా: వివాహితయైక్షతయోనికాని వితంతువవివాహితవలె వివాహసంస్కారము నొంది నియోగము నొందవలెనా? లేక వివాహితవలె సంస్కారములేక నే నియోగము నొందవలెనా యనునదియే. అట్టి యక్షతయోనికూడ నవివాహితవలెనే సంస్కారమునొందవలెనని మనుస్మృతి చెప్పుచున్నది.

    సాచేదక్ష తయోనిస్స్యాద్గత ప్రత్యాగ తాపివా
    పౌనర్భవేన భర్త్రాసా పునస్సంస్కారమర్హతి.
(మను.9-176)

(అక్షతయోనియగు వితంతువు భర్తను విడచి మఱొకనిపొంది మరల భర్తను జేరికొనుస్త్రీయును పునర్భవునితో మఱల సంస్కారము నొంద నర్హులు)

స్త్రీ భర్తగోత్రములో ప్రవేశించుటకే వాగ్దత్తకు వివాహమని పైననూహచేయబడినది. ఇదివఱకు వివాహితయైన యక్షతయోనికి మఱల వివాహమగుట యెందులకనియు, నాసంస్కారము లేకుండనే నియోగము కారాదాయనియు ప్రశ్నలు బయలుదేరును భర్తనువిడచి యన్యునాశ్రయించి మఱల భర్త యొద్దకువచ్చుదానికా సంస్కారమెందులకో యీమెకునందులకే యనిమాత్రమీ శ్లోకమువలన స్పష్టమగుచున్నది. సడలింపబడిన వివాహానుబంధమును బాగుగ దృడపఱచుటకే యీసంస్కారమని తోచుచున్నది.