పుట:Womeninthesmrtis026349mbp.pdf/123

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

షష్ఠాధ్యాయము

105

చేసికొనుచున్నాడు. ఈయంశములన్నియు నీక్రిందిశ్లోకముల వలన తెలియుచున్నవి.

    యస్యామ్రియేత కన్యాయావాచా సత్యేకృతేవతి:
    తామనేవ విధానేన నిజోవిందేత దేవర:

    యథావిధ్య ధిగమ్యైనాం శుక్లవస్త్రాంశుచివ్రతాం
    మిథోభజేతా ప్రసవాత్పకృత్సకృదృతావృతౌ
(మను. 9-69, 70)

(వాగ్దానపతిని కోల్పోయినస్త్రీని నామెమఱది యీక్రిందివిధముగ వివాహమాడవచ్చును. ఆమెనాతడు యధావిధిగవివాహమాడి శుక్లవస్త్రయు, మంచినియమములు గలదియునగు నామెను నొకపుత్రుడు కల్గువఱకును ప్రతిఋతు కాలములోను నొక్కొకసారి పొందుచుండవలెను.)

ఒక్క సంతానము గల్గువఱకు మాత్రమే యాతడామెను పొందుచుండవలెనని చెప్పుటచేతనే యిది వివాహము కాక నియోగమేయని స్పష్టమగుచున్నది. వివాహసంస్కారమును పొందుట మాత్రము విశేషము. వాగ్దత్తమాత్రమే కాక వివాహితకూడనై భర్తనుకోల్పోయినస్త్రీకి సామాన్య వివాహము కూడదని స్పష్టమగుచున్నది. సంతానములేక వితంతువైన సామాన్యగృహిణి వివాహసంస్కారము లేకుండనియోగింపబడవలెనని మనము పూర్వమే చూచియుంటిమి