పుట:Womeninthesmrtis026349mbp.pdf/122

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

104

స్మృతికాలపుస్త్రీలు

వలెను. కాని యీ రెండు నియోగములకును నొకభేధము గలదు. వివాహితనియుక్తయగుటకు మంత్రసంస్కారములేదు. అవివాహితనియుక్తయగుటకు మంత్రసంస్కారమున్నది. అట్టి యవివాహిత యథావిధిగ వాగ్దానపతిసోదరుని వివాహ మాడవలెను. కాని యావైవాహికసంబంధమొక పుత్రుడు కల్గువఱకేయుండును. ఆపిమ్మటకూడ నాసంబంధముండుచో నది సామాన్యవివాహమే యయ్యెడిది. అట్లే మంత్రసంస్కారము లేనిచో సామాన్యనియోగమే యయ్యెడిది. కావున నిది వివాహమంత్రములతో కూడిన నియోగము. దీనివలన గలుగు పుత్రుడు వివాహము చేసికొనిన వానియన్నకు (మృతుడైన వానికి) చెందును. లేకుండుచో నొకపుత్రుడు కల్గువఱకే యాతడామెతో నుండవలెనను నియమముండుటకు వీలులేదు. గర్భధారణముతోనే వారిరువురకు సంబంధము పోవుచున్నది. ప్రనవానన్తరము ఋతుమతియై నపుడామె నాతడు పొందుటకు వీలులేదు. ఆమెతో ధర్మకార్యములను జేయుటకు వీలులేదు. కావున నాతడు గృహస్థాశ్రమమును నడపుటకు మఱొక భార్యను చేసికొనవలసియే యుండును. దీనిబట్టి యామె యీతనికి భార్యయేకాదనియు, నామె కన్యాత్వమును బూర్తిగబోగొట్టి యామెను తనగోత్రములోనికిదెచ్చి తనయన్నకు పుత్రుడుగ నుండదగిన (దత్తతచేసికొనుటకు గూడ సగోత్రికుడు కావలెనుగదా! అట్టిచో నియోగమునకు చెప్పునదేమి?) వానిని నుత్పాదించుటకే యామెతో వివాహసంస్కారము