చ. |
దనుజవిభంజనార్థముగ దారుణయుద్ధ మొనర్ప నీవు వో
యిన నఖిలక్రియా[1]తతియు నే మటుబాయఁగఁ బెట్టి నిన్నె చిం
తన మొనరించుచుండితిమి ధన్యుల మైతిమి నేఁడు నీజయం
బునఁ బరమేశ మాకొలువు మోదమెలర్పఁగఁ గైకొనం దగున్.
| 191
|
వ. |
అనిన వారియాలాపంబు లాలించి యభ్యర్చనంబు లాదరించి [2]యందఱం బ్రత్యేక
పరిగ్రహంబున ననుగ్రహించి యద్దేవుం డాదిదేవుం డటఁ బితామహునకుం
బ్రణమిల్లి వీడ్కొని తదీయలోకంబు వెలువడి తనకుం బురాణసంశ్రయం బగు
దుగ్ధసాగరంబున కరిగి.
| 192
|
మ. |
ఇనచంద్రద్యుతికోటికిం జోరగ రా కెల్లప్పు[3]డున్ గర్భవా
సనసామగ్రిన తేజరిల్లుచు నజస్వారాజులం దొట్టి యె
వ్వనికిన్ దుర్గమమైనపుణ్యపదమున్ వైకుంఠనామంబు న
ర్థి నధిష్ఠించి యనంతరంబ పరమోద్దీపస్వరూపంబునన్.
| 193
|
నారాయణుండు యోగనిద్రాపరాయణుం డై యుండుట
ఉ. |
వేయుశిరంబు లొప్పఁ బది[4]వేలుకరంబు లెలర్ప నొప్పి నా
రాయణుఁ డార్య మైన తనయంచితతల్పముఁ జెంది పెక్కు వేల్
హాయనముల్ పరిభ్రమణ మందుట నొందినడప్పిమాన్ప భ
ద్రాయితసుప్తిఁ గోరి కనుదమ్ముల[5]దోయి యొకింత మోడ్చినన్.
| 194
|
మ. |
మును గల్పాంతమునందు విచ్చలవిడిన్ మోదంబు [6]వర్ధిల్లఁగాఁ
దను బ్రాపించి [7]చిరోపభోగమహిమన్ ధన్యాత్మయై విశ్వమో
హన నాఁ బ్రాజ్ఞులచేతఁ గీర్తనలు నిండారంగఁ గన్నట్టి ని
ద్ర నెఱిం జెందెఁ దదీయభావము సముద్యద్దివ్యయోగాకృతిన్.
| 195
|
వ. |
ఇవ్విధంబున నిద్రితాత్ముండై యద్దేవుండు.
| 196
|
ఉ. |
ఈతఁడు నిత్యసుప్తుఁ డని యిచ్చఁ దలంపఁగఁ గొంద ఱీతఁ డు
ద్యోతితసత్త్వబోధుఁ డని యూహ మొనర్పఁగఁ గొంద ఱీతఁ డు
ద్ధూతవికారుఁ డిట్టిఁ డనఁ [8]దోఁచెడువాఁ డనఁ గొంద ఱచ్యుతుం
డాతతలీల [9]చూపి దనుజారులకున్ భరమయ్యె నాత్మలన్[10].
| 197
|
- ↑ వితతి
- ↑ యందఱిం
- ↑ డాత్మానుధావనతేజోమహిమన్; ఆత్మావధాపనతేజోమహిమన్ వెలుంగుచు.
- ↑ వేలభుజంబు
- ↑ దోయొకయింత
- ↑ సంధిల్లఁగాఁ
- ↑ విలోపభోగమహిమన్
- ↑ దోఁచునెనా, నొక కొంద.
- ↑ చూవె
- ↑ జాగర్తికో౽త్ర కః శేతే కశ్చ శక్తశ్చ (సుప్తశ్చ)నేంగతే
కో భోగవాన్ కో ద్యుతిమాన్ కృష్ణాత్ కృష్ణతర శ్చ కః — 1-50-17.