పుట:హరివంశము.pdf/153

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పూర్వభాగము. ఆ. 4

105


క.

నినుఁ జూడఁ గోరి యున్నా, రనఘా మల్లోకవాసు లగుమునివరు ల
వ్వినుతాచారులు ధన్యతఁ, దనరు [1]తెఱుఁగొనర్పవలయుఁ దద్దయుఁ గరుణన్.

180


వ.

కావున నస్మదీయస్థానంబునకు నాతోడన యరుగుదె మ్మనినఁ బరమేష్ఠివాక్యంబు
నకు నియ్యకొని విష్ణుండు జిష్ణుప్రముఖు లగుదివ్యులం జూచి యి ట్లనియె.

181


మ.

అమరారాతు లనేకు లీరణమునం దస్మన్మహాచక్రవి
క్రమగర్వంబునఁ గాలనేమిమునుగాఁ గాలాంతముం బొంది రే
క్రమమో తప్పిరి రాహువున్ బలియు లోకం బింక నిశ్శంకతో
సముదీర్ణం బగుఁగాక యెల్లవిధులన్ సంప్రాప్తనైజస్థితిన్.

182


తే.

లోకపాలురు దమతమలోకములన, తొంటియైశ్వర్యములు నిత్యధుర్యనుద్ధామ
లుల్లసిల్లంగఁ గైకొని యుండువారు, గాత యాత్మీయు లానందఘనతఁ [2]బొంద.

183


క.

క్రమమున హవ్యముఁ గవ్యము, నమర పితృప్రీతిసేయ ననఘములై య
జ్ఞములు ప్రవర్తిల్లఁగ ధ, ర్మము పొదలి చరించుగాఁత మహి నలు[3]కాలన్.

184


మ.

కుటిలాచారులు దైత్యు లెప్పుడును మీకుం గీడు గావింప ను
త్కటరంధ్రంబులు వేచియుండుదురు నిక్కం బెమ్మెయిన్ వారి న
మ్ముట కర్తవ్యము గాదు సాత్వికమతు ల్ముగ్ధాత్మకుల్ మీర [4]లొ
క్కటియు న్నేరరు మాయ నేమఱకుఁ డేకర్జంబులందుం దగన్.

185


వ.

ఏను వోయివచ్చెద నని యానతిచ్చి యప్పరమేశ్వరుండు పరమేష్ఠిపురస్సరుండై
తోడ్కొనిపోవం దదావాసంబునకుం జని యందు.

186


క.

ప్రాతస్సవనాహుతు లను, వైతానికవహ్ను లిద్ధవైభవమునఁ బ్ర
స్ఫితంబులుగా నొప్పుమ, హాతాపసవరుల సంయతాత్ములఁ గనియెన్.

187


వ.

కని యమహితాధ్వరంబులఁ దనకు హితంబులుగాఁ గల్పితంబు లగుభాగంబు
లభినందింపుచు నయ్యింద్రానుజుం డమ్మునీంద్రులకుఁ బ్రత్యేకంబ యభివాద
నంబు సేసి త్రేతాగ్నులకుం బ్రదక్షిణించి సద్యోహుతాజ్యసౌరభోద్దామంబు
లగుతదగ్రిమధూమంబు లుపాఘ్రాణింపుచు ఖచితమాణిక్యజాలంబులగు కనక
చషాలంబుల నుజ్జ్వలరూపంబు లగుసమున్నతయూపంబు లాలోకింపుచు విస్తారిత
మనోమోదంబు లగువేదనినాదంటు లాకర్ణింపుచు బ్రహలోకంబు గలయం
గ్రుమ్మరు సమయంబున.

188


క.

యజమానులు ఋత్విజులును, [5]యజనసమేతు లయియున్న ననిమిషులుఁ బ్రమో
దజడాత్ము లగుచు నవ్వి, శ్వజగద్విభు నధిగమించి సముదితభక్తిన్.

189


తే.

అర్ఘ్య మర్పించి ప్రాంజలులై మహాత్మ, క్రతువులకు నెల్ల నగ్రపూజితుఁడ వీవు
నీవు లేనిసంయమములు నిష్ఫలములు, వేదవిహితంబు లగుసర్వవిధులు నీవ.

190
  1. తెఱం గాచరింపు తద్దయు
  2. బొంగ
  3. వొప్పన్
  4. లొక్కట నెన్నఁడును
  5. యజనసమన్వితుల నైన యయ్యనిమిషులున్, బ్రజనితముదాత్ములై వి, శ్వ.