|
ష్టేష్టవిధాయి విష్ణు జగదీశ్వరు నార్తశరణ్యు సత్కృపా
దృష్టిసమగ్రుఁ జేరిరి ప్రదీప్తపరాక్రమచక్రశోభితున్.
| 27
|
తే. |
చేరి దైన్యంబుతోఁ దమ చెడ్డచేటు, లన్నియును విన్నవించి లోకాధినాథ
యజుఁడు మొద లగుసర్వభూతావళికిని, నిక్క మెవ్వరు శరణంబు నీవు దక్క.
| 28
|
క. |
దైతేయుపఱచుబాముల, కేతెఱఁగున నోర్వఁ జాల మిఁక నీయడుగుల్
ప్రీతిం గొలుచుచు నుండేవ, [1]మాతల నీ వెట్టు లుంచె దటుసూడు దయన్.
| 29
|
క. |
దితిసూనుఁ దునిమి మఱియును, దితిజకులము పీచమడఁచు [2]తేఁకువ మదిఁ బూ
నిక యేని మమ్ము నేలుట, సత మగు నమ్మెయికిఁ గరుణ సమకొలుపఁ గదే.
| 30
|
వ. |
అని యభ్యర్థించినఁ బాంచజన్యధరుండు సురవరులదెసం [3]బ్రసాదసుముఖుం డై.
| 31
|
శా. |
మీమీసంపదలుం బదంబులును నెమ్మిన్ గ్రమ్మనం గ్రమ్మఱం
గా మీసొ మ్మగు నెమ్మనమునఁ గలంకల్ మానుఁ డింకన్ సమ
స్తామర్త్యోత్తములున్ భవద్రిపుఁడు నేఁ డస్మద్భుజాభోగిపీ
తామూలాసుసమీరుఁడై పడఁగఁ బూర్ణానందతం జూడుఁడా.
| 32
|
క. |
ఇదె పోయెదఁ జిత్ర జయా, భ్యుదయము నొందెదఁ ద్రిలోకములకును [4]భద్రం
బొదవించెద నని యప్పుడ, కదలి[5]చని కఠోరకాయ ఘనకర్మఠుఁ డై.
| 33
|
విష్ణుదేవుఁడు నృసింహావతారంబున హిరణ్యకశిపుం జంపుట
సీ. |
స్కంధవిధూసనస్ఖలితసటాసమీరమున ఖేచరవిమానములు దూల
[6]దంష్ట్రాసముద్ధతదహనచ్ఛటానిపాతంబున దిగ్వదనంబు లెరియ
గ్రోధతరంగితఘోరనిశ్వాసవేగమునఁ బాబోధిపూరములు గలఁగ
దర్పసంభృతమహోదగ్రహుంకారఘోషమున బ్రహ్మాండోదరములు వగులఁ
|
|
తే. |
గలుషనేత్రకనీనికా[7]కపిలరోచు
లరుణ[8]శశభృన్మరీచుల నాక్రమింప
నమరు నరసింహమూర్తి యొప్పారఁ దాల్చి
విభుఁడు దైతేయు నెదుర నావిర్భవించె.
| 34
|
వ. |
అట్టి దారుణరూపంబు నాలోకించి యాలోకకంటకుండు కంటకితాంగుఁ డగుచు
భయవిస్మయరసంబుల మునిగియుఁ గలంగక [9]యనేకదనుజభటసహాయుం డై
యెదిర్చినం గార్చిచ్చు మృగంబులం బొదువుభంగిఁ [10]బ్రిదిలిపోనీక పట్టి యిట్ట
లం బగుబలంబున.
| 35
|
- ↑ ఆతల నీ వెట్లు చూచె దటు చూడు మమున్. నె ట్లవునో చూడుమా దయతోడన్.
- ↑ తెగువకు
- ↑ బ్రహర్ష
- ↑ నుశుభదం
- ↑ కరరుహ కరణాదికాకర్మఠుఁడై (పూ. ము.)
- ↑ దంష్ట్రాసముద్ధూతదహనచ్ఛటానిహతంబున దిగ్వివరంబు లెరియ. (పూ.ము.)
- ↑ కటికి
- ↑ రోచిమరీచుల; నేత్రమరీచుల
- ↑ యనుచర
- ↑ పగిదిఁ