పుట:హరివంశము.pdf/134

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

86

హరివంశము


తే.

పదునొకండువేలేఁడులు బ్రహచర్య, నియతి దప్ప కమ్మెయి ఘోరనిష్ఠ నడప
నబ్జభవుఁ డాతనికి మెచ్చి హంసయుక్త, వరవిమానంబుతో సురోత్కరము గొలువ.

19


క.

చనుదెంచి వేఁడుము వరం, బని పలికిన మిన్ను దాఁకి సాష్టాంగముగా
వినతి యొనరించి యంజలి, జనితోత్తంస మగుశిరము నదురై యొప్పన్.

20


వ.

అసురేశ్వరుం డఖిలసురాసురచక్షురక్షోగంధర్వభూతపిశాచోరగమనుష్యతిర్య
క్కులవలనను శైలపాదపశస్త్రంబులచేతను నార్ద్రశుష్కాదులచేతను దనకుం
జావు లేకుండను ఋషిశాపంబులు దన్నుం [1]బొరయకయుండను సూర్యసుధాకర
దహనసలిలగ్రహనక్షత్ర[2]దిగ్భూమ్యధికారంబులు దాన కైకొని నడపను శక్ర
వైవస్వతవరుణధనాధ్యక్షపదంబులు దనసొమ్ములై [3]యుండను గామక్రోధమద
ప్రముఖంబులు తనపంపు [4]సేసి వర్తింపను నభ్యర్థించిన నట్ల యొసఁగి బిసరుహాస
నుండు నిజలోకంబున కరిగిన.

21


చ.

తలఁకి నిలింపు లందఱు పితామహుఁ గానఁగఁ బోయి దేవ నీ
వలన వరంబు లిట్లు గని వాలినదైత్యుఁడు మమ్ము నింక నే
కొలఁదుల సైఁచునే కరము గొందలపెట్టక యెట్లు గావునం
దలఁపు మొకింత శాత్రవువధంబువిధంబును లోకనాయకా.

22


వ.

అనినం బరమేష్టి వారి నుపలక్షించి.

23


చ.

అసుర తపంబుపేర్మియిటు లారయ వచ్చిన నెమ్మెలైయి న్వరం
బొసఁగకపోవరాదు వినుఁ డున్నతిమై నిటమీఁద వాఁడు న
య్యసదృశనిష్ఠకున్ ఫల మనార్యముగా భుజియించుఁ బుణ్య మె
ల్ల సమసిపోవఁగాఁ జెడు బలం బఱి విష్ణుపరాక్రమంబునన్.

24


క.

అందాఁక నోపుఁ డెట్లయి, నం [5]దత్క్రూరప్రవృత్తి నావుడుఁ జని రా
బృందారకు లసురయుఁ బెం, పొందినవర మట్లు వడిసి యుప్పొంగుమదిన్.

25


సీ.

అమరేంద్రు భంగించి హవ్యవాహను గాసి చేసే యంతకుని నిర్జించి నిరృతి
దండించి వరుణుని గం డడఁగించి సమీరు మర్దించి కుబేరుఁ జెఱచి
యీశాను నొత్తి ఫణీశులఁ ద్రొక్కి సాధ్యుల నొంచి సిద్ధుల నుక్కుమణఁచి
వసువుల స్రుక్కించి వారిజాప్తుని యేపు మాపి యశ్వినుల యాటోప ముడిపి


తే.

గరుడగంధర్వఖేచరవరులఁ బెక్కు, గతులఁ గారించి యప్సరోగణము నేలి
యధికు లగుతాపసుల నెల్ల నతకరించి, [6]యఖిలలోకాధిపుత్యంబు నందె నంత.

26


ఉ.

భ్రష్టత నొంది దేవతలు బామరి దుగ్ధపయోధిమధ్యవి
స్పష్టభుజంగశయ్య ననుభావ[7]సమీహితసుప్తి నొప్పు శి

  1. జోఁకక
  2. దిగ్భూమ్యాది
  3. నడపను
  4. సేయను
  5. దగఁ దత్క్రూరవృత్తి
  6. తానె యధికలోకాధిపత్యంబు నొందె
  7. సమాహిత