పుట:హరివంశము.pdf/136

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

88

హరివంశము


మ.

గరుడత్రోటికఠోరఘోరనఖనిర్ఘాతంబులన్ వైరిపే
రుర ముగ్రోద్ధతిఁ జీరి నెత్తురులు [1]సర్వోర్వీనభోదిక్తటీ
బరిణాహంబుల నెల్ల వెల్లిగొనఁ బైపైఁ జల్ల [2]ప్రేవుల్ పొరల్
గర మాటోపముతో [3]హరించె హరి యాకర్షించి హర్షించుచున్.

36


వ.

ఇట్లు శత్రువధం బాపాదించిన.

37


క.

శితనారసింహఖరా, హతదైత్యమహీపసూపహారంబునఁ ద
ర్పితయయ్యె ననఁగఁ బరిశాం, తత [4]బొందెఁ ద్రిలోకపీడ తత్క్షణమాత్రన్.

38


క.

సురలును మునులును ముదమున, నరసింహు నసహ్య[5]రంహు నానావిధవా
క్పరిణతిఁ బ్రణుతించుడు ని, ర్భరభక్తిప్రణతికరణపరు లై రర్థిన్.

39


వ.

అయ్యాదిదేవుం డట్లు దేవపదంబులు ప్రతిష్ఠించి యుంచెం గాలాంతరంబున
హిరణ్యకశిపు సుతుమనుమం[6] డగువిరోచనతనయుండు బలి యనువాఁడు
బలీయుం డై బలసూదనసంపద యాక్రమించిన.

40

వామనావతారంబు సంక్షేపరూపంబుగాఁ జెప్పుట

తే.

అదితి నిజపుత్త్రహితముగా నాదిదేవు, [7]వరదు విష్ణు గుఱించి దుష్కరతపంబు
సేయుటయు మెచ్చియాపుణ్యశీల కుదయ, మయ్యె వామనాకారుఁడై యవ్విభుండు.

41


వ.

ఇట్లుదయించి యింద్రానుజుం డితం డుపేంద్రుం డనఁ బరఁగి బ్రహ్మచారివేషం
బున నధ్యయనంబు సేయుచుండ నక్కాలంబున బలిదైత్యుండు నిత్యం బగు
విష్ణుభజనతాత్పర్యంటును నార్యస్తవనీయం బగుదానశీలత్వంబును ననాకులం
బగుధర్మాచరణంబునుం దనకు నైజంబు లై వెలయ నశ్వమేధం బొనరింప నుపక్ర
మించిన.

42


క.

ఆతనిపాలికి నర్థి, త్వాతిశయము దోఁప నంబుజాక్షుఁడు దైత్య
వ్రాతభయదవిక్రముఁడు స, నాతనవైభవుఁడు వంచనం జనుదెంచెన్.

43


వ.

అవ్విధంబు ప్రాజ్ఞులు [8]సూచింపక మున్న యెఱింగియు.

44


చ.

హరి యఖలైకదాత పరమాద్భుతలక్ష్మికి ధామ మస్మద
ధ్వరమున నర్థియై [9]యడుగ ధన్యుఁడఁ బుణ్యుఁ డగణ్యవస్తుసం
భరణుఁడ నేన యంచుఁ దనభావమునం బ్రియమందు దానవే
శ్వరు నడిగెం బదత్రితయసమ్మితధాత్రి యతండు వేడుకన్.

45


వ.

విరోచనతనయుండును బహుమానప్రదానకలనంబునం దనమనోరథపూరణం
బాచరించిన నవ్వటుకుమారుండు.

46
  1. సర్వోర్వింబయిం
  2. ప్రేవుల్ గడున్; ప్రేవుం బొదుల్
  3. మైనతండు పొరి నాకర్షించె. (పూ. ము.)
  4. బొంగెఁ
  5. శౌర్యు
  6. పౌత్రుం
  7. పరమవిష్ణుగురించి
  8. సూచింపన్నట మున్నట మున్నట
  9. యయ్యెఁగడు