పుట:హరివంశము.pdf/135

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పూర్వభాగము - ఆ. 4

87


ష్టేష్టవిధాయి విష్ణు జగదీశ్వరు నార్తశరణ్యు సత్కృపా
దృష్టిసమగ్రుఁ జేరిరి ప్రదీప్తపరాక్రమచక్రశోభితున్.

27


తే.

చేరి దైన్యంబుతోఁ దమ చెడ్డచేటు, లన్నియును విన్నవించి లోకాధినాథ
యజుఁడు మొద లగుసర్వభూతావళికిని, నిక్క మెవ్వరు శరణంబు నీవు దక్క.

28


క.

దైతేయుపఱచుబాముల, కేతెఱఁగున నోర్వఁ జాల మిఁక నీయడుగుల్
ప్రీతిం గొలుచుచు నుండేవ, [1]మాతల నీ వెట్టు లుంచె దటుసూడు దయన్.

29


క.

దితిసూనుఁ దునిమి మఱియును, దితిజకులము పీచమడఁచు [2]తేఁకువ మదిఁ బూ
నిక యేని మమ్ము నేలుట, సత మగు నమ్మెయికిఁ గరుణ సమకొలుపఁ గదే.

30


వ.

అని యభ్యర్థించినఁ బాంచజన్యధరుండు సురవరులదెసం [3]బ్రసాదసుముఖుం డై.

31


శా.

మీమీసంపదలుం బదంబులును నెమ్మిన్ గ్రమ్మనం గ్రమ్మఱం
గా మీసొ మ్మగు నెమ్మనమునఁ గలంకల్ మానుఁ డింకన్ సమ
స్తామర్త్యోత్తములున్ భవద్రిపుఁడు నేఁ డస్మద్భుజాభోగిపీ
తామూలాసుసమీరుఁడై పడఁగఁ బూర్ణానందతం జూడుఁడా.

32


క.

ఇదె పోయెదఁ జిత్ర జయా, భ్యుదయము నొందెదఁ ద్రిలోకములకును [4]భద్రం
బొదవించెద నని యప్పుడ, కదలి[5]చని కఠోరకాయ ఘనకర్మఠుఁ డై.

33

విష్ణుదేవుఁడు నృసింహావతారంబున హిరణ్యకశిపుం జంపుట

సీ.

 స్కంధవిధూసనస్ఖలితసటాసమీరమున ఖేచరవిమానములు దూల
[6]దంష్ట్రాసముద్ధతదహనచ్ఛటానిపాతంబున దిగ్వదనంబు లెరియ
గ్రోధతరంగితఘోరనిశ్వాసవేగమునఁ బాబోధిపూరములు గలఁగ
దర్పసంభృతమహోదగ్రహుంకారఘోషమున బ్రహ్మాండోదరములు వగులఁ


తే.

గలుషనేత్రకనీనికా[7]కపిలరోచు
లరుణ[8]శశభృన్మరీచుల నాక్రమింప
నమరు నరసింహమూర్తి యొప్పారఁ దాల్చి
విభుఁడు దైతేయు నెదుర నావిర్భవించె.

34


వ.

అట్టి దారుణరూపంబు నాలోకించి యాలోకకంటకుండు కంటకితాంగుఁ డగుచు
భయవిస్మయరసంబుల మునిగియుఁ గలంగక [9]యనేకదనుజభటసహాయుం డై
యెదిర్చినం గార్చిచ్చు మృగంబులం బొదువుభంగిఁ [10]బ్రిదిలిపోనీక పట్టి యిట్ట
లం బగుబలంబున.

35
  1. ఆతల నీ వెట్లు చూచె దటు చూడు మమున్. నె ట్లవునో చూడుమా దయతోడన్.
  2. తెగువకు
  3. బ్రహర్ష
  4. నుశుభదం
  5. కరరుహ కరణాదికాకర్మఠుఁడై (పూ. ము.)
  6. దంష్ట్రాసముద్ధూతదహనచ్ఛటానిహతంబున దిగ్వివరంబు లెరియ. (పూ.ము.)
  7. కటికి
  8. రోచిమరీచుల; నేత్రమరీచుల
  9. యనుచర
  10. పగిదిఁ