పుట:హరవిలాసము.pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

60 హరవిలాసము



శా. ఆసప్తర్షు లరుంధతీసహితు లై యాకాశమారంబునన్
భాసందోహము సూర్యచంద్రరుచులన్ భంజింపఁగా డిగ్గి కై
లాసస్థానముఁ జేరవచ్చి కని రుల్లాసంబునన్ హేమపీ
ఠాసీనుం డయి దేవత ల్గొలువ రాజైయున్న శ్రీకంఠునిన్. 39

మ. పదియార్వన్నె పసిండివల్కలమునన్ భాసిల్లు ముత్యాలజ
న్నిదముల్ రత్నమయాక్షతంబులును మాణిక్యంపుఁబాత్రంబునన్
జదు రొప్పన్ ధరియించి యల్పధరణీజాతంబుల౯ బోలెఁ గ
ట్టెదురన్ నిల్చినదివ్యసంయముల సంవీక్షించి సంభావనన్. 40

సీ. ఆకాశగంగలో నఘమర్షణస్నాన మహరహంబును జేయునట్టివారిఁ
బ్రస్థాపితాశ్వుచే భానుమంతునిచేత గురుభావమున మ్రొక్కుఁ గొనెడివారి
నంత్యకాలమ్మునయం దుర్వితోఁగూడ నుదధిలోపల మున్గకున్నవారి
సర్గశేషమునకై సాహాయ్య మొనరించి పరమేష్ఠిచే మెచ్చుఁ బడయువారి
తే. గగనమును లేడువురవారికట్టెదురన, పతిపదంబులపై దృష్టి భక్తినిడిన
దివ్యచరిత నరుంధతీ దేవిఁ జూచి, సమ్మదము నొందె కందర్పశాసనుండు. 41

తే. అంధకారి యరుంధతి నాదరించె, గౌరవంబున భేదంబు కలుగకుండఁ
బెద్దవారికి స్త్రీపుంవిభేద మేల, మాననీయంబు పుణ్యకర్మంబుగాక. 42

క. ఆఋషులఁ జూడ శివునకు, దారపరిగ్రహము వెంటఁ దద్దయుఁ దగిలెన్
దారపరిగ్రహమే కద, సారపుధర్మముల కెల్ల సాధన మరయన్. 43

ఉ. పర్వతసార్వభౌముసుతపై ననురాగము సంప్రరూఢమై
శర్వుని చిత్తవృత్తి కొనసాగుచు నుండుట కానవచ్చుటం
బూర్వపుఁదప్పుఁ జేసి వెఱఁ బొందుచు నున్నయనంగుఁ డెంతయున్
నిర్వృతిఁ జెందె నౌ తనదునీతి ఫలించి తపంబు పండినన్. 44

వ. ఆప్పుడు సప్తర్షులు హర్షవినయభక్తిశ్రద్ధావిశ్వాసతాత్పర్యంబులు మనంబునం బెనఁగొనంగఁ గేలుదోయి మొగిచి ఫాలభాగంబునం గీలించి కంటకితకపోలభాగులై దేవా! యింతకాలంబునకుం గదా మాతపోదానాధ్యయనయజ్ఞవ్రతాదిధర్మంబులు ఫలియించె భువనాధ్యక్షుండ వైననీవు మనోరథాగోచరం బైనమన్ననం జేసి మనోవిషయంబున మన్నించితి వింతకంటెను భాగ్యంబుగలదే యెవ్వానిచిత్తంబున నీవు వర్తింతువు వాఁడు కృతార్థుండు గదా నీచిత్తంబున వర్తించుమాకృతార్థత్వంబు వేఱె వర్ణింపనేల? భవత్పుంభావనావిశేషంబునయంద మాకు బహుమానంబు ప్రత్యయంబునయ్యె యుష్మదనుధ్యానసంభవం బగుప్రమోదభారంబు మాయంతరంగంబులయం