పుట:శ్రీ ప్రబంధరాజ వెంకటేశ్వర విలాసము.djvu/77

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

28

ప్రబంధరాజవేంకటేశ్వర

గీ. దానవారాతి పాద పద్మ భరలీన
   మాన సానూర దోదూయ మాన దీన
   మానవాళికిఁ గురియు హేమంపుసోన
   వానమావు మొకము బయకాని కోన. 30

శబ్దార్థోభయశ్లేష


మ. తనులావు ల్బ్రకటించుచున్ మొగములం దట్టంపుఁ గెంపుల్ జనిం
    ప నుదారమ్ముగ రాజహంసతతి పద్మవ్యూహమున్ జొచ్చి నే
    ర్పునఁ దద్వాహినియం దమందతరి వారుల్గాంచుచు జోడు వీ
    డని మత్తారికులంబు తోరణము జంటన్ జేయు లీలాగతిన్. 31

గౌడరీతి


చ. ఆగ మహిమావ లోకన సహర్షఘనాఘనఘోటకీభవ
    త్ప్రగుణ ఘనాఘనౌఘ నిభ భద్రఘనాఘనసంఘ చంకన
    ద్గగనధునీపనీప తదఖండఝరీలహరీ పరంపరా
    త్యగణిత ఘుంఘుమార్పిత గుహాప్రతిఘోషము ఘోష మొప్పగున్. 32

క. ఏతాదృశ విభవమ్ముల
    శీతాచల సేతుమధ్య సీమోర్జిత వి
    ఖ్యాతావినూతన హరిని
    కేతన సువిశేషగిరివర మలరున్. 33

సీ. నకులకులమ్ము లుత్సుక ఫణిఫణముల
             చాయఁజాయల గొండ్లిసేయునపుడు
    గన్నెలేళ్ళకు నెల్లఁ జన్నుబాలెంతయు
             బాలెంత పులినంపు లీల నొసఁగు
    నెమలికీరము బిడారముల మెలఁగుసారె
             కీరముల్ చిత్రబిడారములును
    ముదినాగములు సింగములు తోపుఁదోపుల
             జోడుగాఁ గూడియే నాడునాడు