పుట:శ్రీ ప్రబంధరాజ వెంకటేశ్వర విలాసము.djvu/76

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విజయవిలాసము

27

గీ. జిన్నిచిగురుల నింగిని జేయు తోపు
   తేటకొమ్మల కొనల మిన్నేట ధోపు
   పువుల వెలయుచుఁ బాపముల్ దివియు తోపు
   లుద్ది లేదనఁదగుతోపు పెద్దతోపు. 27

ఉభయస్ఫురణము


చ. కనక నగాధినాయక శిఖా ముఖ జాగ్ర దుదగ్ర శీఘ్రలం
    ఘన ఘన కాంచనాబ్జ కళికా తిలకాళి గరుద్గురు స్ఫుటాం
    జన జనక ప్రభాసిత లసత్సిత సారససంగ భంగ మ
    జ్జన జన కల్పితాభి మతసత్పురుషార్థము పాండుతీర్థమున్. 28

సీ. సంతత పనిత సజ్జన వృజిన విభంగ
              ముహుర జహజ్జహద్బహు విహంగ
    లసిత సముద్ర భటి సముద్ర వరసంగ
              సకల తీర్థైక నిజప్రసంగ
    యుత్ప్రతి ధ్వని దదర్యుభయ పార్శ్వ రథాంగ
              గౌరీశ వినుత మనోరథాంగ
    మృదుల వాసిత గంధ కదళికేక్షుల వంగ
              ధరణీ రుహోగ్ర పతప్లవంగ

గీ. యూర్ధ్వ సారంగ సారంగ యుక్కుడంగ
    కలిత సారంగ ముఖ విహంగమ పతంగ
    పుంగవ గరుద్గణా నిల భంగురాంబు
    కణమణి ఖచిత శృంగ యాకాశగంగ. 29

సీ. కాండ పాండిమహారి గగన ధున్యుపమాన
              హాటక పంకేరుహ ప్రసూన
    కమనీయ నవనీత ఖండ హాసన ఫేన
              మహనీయ తరజీవ మణి నిధాన
    నాగాహిత ప్రాహుణక నిమంత్రణ మీన
              పులిన భూ నానాగ ఫలవితాన
    సతత నిజస్నాత సాధుకిల్బిష దాన
              తతవీచికా తిరస్కృత నదీన