పుట:శ్రీ ప్రబంధరాజ వెంకటేశ్వర విలాసము.djvu/78

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజయవిలాసము 29

గీ. భయద రభసశరభ సముదయముఁ బ్రోచు
సాహసోదర భూదార చక్ర మచట
జాతివైరంబు లేక మజ్జాతిగాఁగఁ
గన్నువిన్కరిదిన్నె ఱేఁ డున్న కతన. 34

వ. అయ్యహిమహీధరంబు హిమధరంబువిధంబున సర్వమంగళకాభ్యుదయవిధానంబును, మేరుశిఖరగరిమ ధర్మస్వరూపరంజితంబును, రాఘవసైన్యంబుఠేవ సుగ్రీవనీలగజగవయపనసరమణీయంబును, శ్వేతద్వీపంబునుంబలెఁ బ్రధానపురుషశోభితంబును, కృష్ణునిపగిది వేణునాదవిలసితంబును, దానవారి వక్షంబుడంబున వనమాలికావీక్షణీయంబును, నలువనలువగు నలు వదనంబుల నిలువున బహుశ్రుతులచే విశ్రుతంబును, నీలగళుజటాజూటంబు నీటున నాకాశగంగాప్రసిద్ధంబును, ధనదాస్థానంబు పోలికఁ బుణ్యజనానందకరంబును, పురందరపురంబువైఖరి సుమనోమందిరంబై, పంక్తిరథసంపదుపలాలితంబై, యయోధ్యానగరిగరిమఁ దనరియు ఆరామాభిరామంబై, విభ్రమబహులతాలక్ష్మణద్యుతి నలరియు శుభశరభరతాస్పదంబై, శత్రుఘ్నమహిమ నమరియు ప్రకటరాజగుణోన్నతంబయ్యు లోకేశ్వరశోభితంబై, సత్ప్రబంధంబును వరారోహాంగంబునుంబోలె నానావిధాలంకారవస్తుధ్వనిరుచిరంబై విలాసంబుల నొప్పుచు, రాకానిశీథియును రంభాకందంబంబునుంబోలి చంద్రానుగమంబై ప్రసన్నతాకారంబున నమరుచు, మందరాస్థలంబును శంకరసుఖపురంబులు వనంబునుంబోలె విలసద్గంధర్వనికరంబై లతావితానంబును, వనేచరమందిరంబును రాజసౌధంబునుంబోలె జాలకావృతంబై వీణాకల్పనంబును వసంతాగమనంబును, సముద్రంబునుంబలెఁ బ్రవాళాంతరంబై భాగ్యవంతుని శాంతంబును నందనంబును, రాగంబునుంబోలె సంతానకాంతంబై పద్మాకరంబును కువలయంబును, విష్ణుపదంబునుంబలె రాజహంసమంజుళంబై శంఖచక్రాదిసాధనంబును గురతరవారివాహినీనివహంబును, నిజాంతస్థభూభృద్వారంబును ఘనాగమనంబును, రాజాభ్యుదయంబునుం బాడవోదారతేజంబులు మహామందరాగాభంగస్ఫూర్తియు నమరి అన్వర్థకమలాధిపాహ్వయంబై, సురశాసనాస్పదంబయ్యు నసురశాసనాస్పదంబై, ఏకశరభమహావనధుర్యంబయ్యు ననేకశరభ మహావనధుర్యంబై,