పుట:శ్రీ ప్రబంధరాజ వెంకటేశ్వర విలాసము.djvu/79

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

30

ప్రబంధరాజ వేంకటేశ్వర

నిశాధిక జ్యోతిర్లతాధామ రూఢంబయ్యు ననిశాధిక జ్యోతిర్లతాధామ రూఢంబై, నవరతాహీన శృంగారోన్నతంబయ్యు ననవరతాహీన శృంగా రోన్నతంబై వారణగంధంబయ్యు నవారణగంధంబై, సమంబయ్యు నసమంబై, ఒక్కొక్కదిక్కున శతసహస్రారామ నదనదీఝరీపరీతం బును, ఒక్కొక్కచాయ ననపాయచిత్రవర్ణ శ్రీపర్ణకుముద సముదాయ సముద్యన్మకరందస్యందిబిందు బృందాస్వాదతుందిలేం దిందిర సందోహ సంగీత భంగీతరంగితాన షంగాంబులోల నాళీకజాల డోలాందోళన ఖేల ద్బాలమరాళ చంచూపుటతృట దరాళ మృణాళవిశాల ప్రభానిస్తంద్ర చంద్రికా సారంబులగు కాసారంబున నలరుచు నొక్కొక్క చెంతఁ గాంతలతాంత కుంతాక్రాంత నితాంతతాంతాబ్జ కాంతకాంత వేదికాంతారా మరకాంతాకాం తైకాంతరతంతశ్రాంతి వారిక చేలాంచల జాయమాన పవమాన వలమాన విటపిపటలంబులం గనుపట్టుచు నొక్కొక్కవంకఁ బొంకంబగు నేణాంక పంకళాప్తోపలోపలాలిత సారహీరపద్మరాగ మరకత ప్రముఖ మణిఘృణి రమణీయంబగుచు, నొక్కొక్కయిక్క దహరాకాశ విహారమాణ పరామాత్మానుసంధాన సమింధాన పరమానం దానుభవ పరిపాక తృణీకృత లౌకికవ్యాపార పారీణ ప్రసిద్ధులు వెల యుచు నిప్పగిది నలరుచుండు. వెండియు 35

చౌపదములు

సతతభక్తియుత సన్మునిజాలా
కృత నుతులను రాగిలు పృథుశీలా
కృతయుగమునను సుకృతమయిలీలా
క్షితి వృషగిరియనఁ జెలగును జాలా.

సీతావరుఁ డూర్జితముగఁ జేరున్
రీతిఁ గనిన దారిని బొల్పారున్
ద్రేతను హరిని ధరించిన చారు
ఖ్యాతిని గరుడనగంబున మీఱున్.

వెలయు జవ్వనఁపు వ్రేతల పొందుఁ
గలిగిన కృష్ణుని కత లెందెందు