Jump to content

పుట:శ్రీ ప్రబంధరాజ వెంకటేశ్వర విలాసము.djvu/80

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విజయవిలాసము

31

    దళము కొనఁ గనగు ద్వాపరమందు
    నల శేషాచలమునఁ జెలువొందు
    కలియుగమునఁ జేకాన్కల నలరు
    గొలిచి యిచ్చునక్కొలందిని సిరులు
    బలువిడి నొసఁగెడు బహు వైఖరులు
    నలువుగ వేంకట నగమన వఱలు. 36

సీ. కలికాల కలుషాంధకార ఖండన చండ
             పటిమ ఖగంబు వేంకటనగంబు
    సాధ్వాళి సాధ్వస సర్పదర్పాదైక
             గరుడఖగంబు వేంకటనగంబు
    కవిదీనతాబ్ద సంఘాత ఘాతానల్ప
             కల్పాశుగంబు వేంకటనగంబు
    పర తురుష్కాశర హర రాఘవామోఘ
             నటదాశుగంబు వేంకటనగంబు

గీ. ప్రబల కన దీషణత్రయ భావముక్త
    సూక్తి సక్త వరక్తి సచ్ఛక్తి యుక్త
    భక్త జన చిత్త చింతిత ముక్తి దఘన
    చటుల భావనగంబు వేంకటనగంబు. 37

సీ. గురు దరీముఖ ఝరీ వరలహరీ వార
          ఘుమఘుమ నిస్వన క్రమ నిగాఢ
    మగమాంత కాంత నిష్యంది సన్మకరంద
          తుంది లేదిందిరామంద గీత
    మా సద్భితోల్లసదప వర్గకామినీ
          ప్రాపక జపశీల తాపసగణ
    మదితిజేక్షణ హర్షకృద దభ్ర శుభ్రాభ్ర
          సఖమహాభ్రంకష శిఖర నికర

గీ. మబ్ధినిస్తబ్ధి ఘనసత్వహతి విచల ద
    భంగరంగ దుత్తుంగ తరంగ వర్గ
    ఘళఘళార్భటి సందర్భ కవన కవిజ
    నామిత తపఃఫలంబు శేషాచలంబు.