పుట:శ్రీ ప్రబంధరాజ వెంకటేశ్వర విలాసము.djvu/81

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

32

ప్రబంధరాజవేంకటేశ్వర

హరిగతి వేంకటశైల రగడ

శ్రీ లసదల మేల్మంగా సంగీ | స్థేమ విశాలము వేంకటశైలము
నాళీక భవాది వినిర్మిత స | న్మణి మయసాలము వేంకటశైలము
జలయంత్ర ఘనాఘన ధారా | స్రవదబ్జాలము వేంకటశైలము
కలకల రవయుత శుకపికనికర | గ్రసిత రసాలము వేంకటశైలము
తాలతమాల క్రము కల కుచముఖ | దాడిమసాలము వేంకటశైలము
సాలఘుమతియతి చింతిత కైవ | ల్యఘటనలోలము వేంకటశైలము
నానాసూన రసోద్భవ కుల్యో | న్నత కల్లోలము వేంకటశైలము
మానవనాయక దీయమాన స | న్మద శుండాలము వేంకటశైలము
జాత పాపనాశన పాపవినా | శన కీలాలము వేంకటశైలము
ధాతురూప వంశవివర భవ శ | బ్దవరాభీలము వేంకటశైలము
సంసారచ్భల బలవద్గహన | జ్వలన జ్వాలము వేంకటశైలము
కంసాహిత కలహంత కంద సం | ఘాత వినీలము వేంకటశైలము
ప్రకటిత కుంద మకరవర | పద్మ సునీలము వేంకటశైలము
మకరధ్వజ తోరణ చామర పర | మ పదోత్తాలము వేంకటశైలము
బంధుర శిఖరోపరి పరిశోభిత | బల భిన్నీలము వేంకటశైలము
గంధద్రుమ సంవేష్టిత భుజగా | గ్రజ కాకోలము వేంకటశైలము
శ్యేనానూనాళీఖగ కబళన | చిరకాకోలము వేంకటశైలము
దానవభేదన తల్ప వికల్పవి | ధాయక తూలము వేంకటశైలము
కంతు సమంధన చందన పరిమళ | ఖని వాతూలము వేంకటశైలము
సంతత సేవిత భాగవతావే | శ సువాచాలము వేంకటశైలము
గంధగజాసుర హరణార్పిత మ | గ్రద్యుతి శూలము వేంకటశైలము
అంధుప్రస్ఫుట మర్కట కీటకృ | తాతత జాలము వేంకటశైలము
మహనీయ చతుర్దశ భువనావన | మందిరజాలము వేంకటశైలము
గుహపుష్కరిణీ చరజల కరణీ | గురుతరజాలము వేంకటశైలము
రాజిత రాజీవ కుముద సముదయ | రంజకజాలము వేంకటశైలము
నైజ పుణ్య భూమ్య వినిర్మిత తత | నాళీనాళము వేంకటశైలము
సార రసాభవకిటి దంతవిభా | సారసనాళము వేంకటశైలము
దారుణ కేసరి కాసర సంయుత | తత భూగోళము వేంకటశైలము