పుట:శ్రీ ప్రబంధరాజ వెంకటేశ్వర విలాసము.djvu/145

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

96

ప్రబంధరాజ వేంకటేశ్వర


గీ. ననయను ధనువున గినిసిన వెనుక చి
   న వనటను గనుట నికను ననువున దను
   న నెల నెలను మనసున ఘనతను గనుచు
   నెనను మునుపొనర నవని వనజనయన. 221

                              ద్వ్యక్షరి

క. నిన్ను నెమ్మనమున నమ్మిన
   ననుమానము మాన మాననని నేమమునన్
   మన నీనామము నూనె
   న్నను మానిన నిన్ను మాన నానేమేనా. 222

                           ఏకాక్షరకందము

క. లోలాళి లాలి లీలా
   ళీలాలీలాల లేల లీలలు లలులే
   లోలోలై లాలలల
   ల్లీలై లల లాలలోల లేలోలేలా. 223

ద్వాత్రింశదనుప్రాసయుక్త ప్రాససీసావకలిప్రాస సీససంసృష్టి

సీ. జాలువ్రేలును సంకు గ్రాలుడాలును బిల్ల
              రాలు కేలునుగల బాళివాఁడ
    పాలుప్రోలును పుల్గుడాలు మేలును పచ్చ
              దేరు సాలునుగల హాళివాఁడ
    మేలుకోలును జగమేలుకీలును గల్మి
              జాలునాలును గల కీలులవాఁడ
    వాలుడాలును మున్గు చేలుప్రాలును వేల్పు
              చాలుమేలునుగల వేలవాఁడ

గీ. రేలును బగళ్ళు నెఱజగడాలు బన్న
   పాలువడు గాణ పొగడత సోలువాఁడ
   బేలుపోవని పొలదిండ్ల నూలుకొనుచు
   దీలువడ గొట్టునట్టి గగ్గోలువాఁడ. 224