శ కు న శా స్త్ర ము
35
-:బల్లిపాటు తజ్జాతి తత్కాల ఫలములు :-
108 పద్యము లగాయితు 116 వ పద్యములవరకు ఒకటి రెండు నాల్గు ప్రతులలోలేవు
క. తనజాతి బల్లియైనన్ ,
తన కెక్కువయైన బల్లి § తనకగు కాలం
బున తనపైబడ శుభమగు,
చినయోబళగిరి విహార § శిఖినరసింహా.108
తా. ఓనరసింహస్వామీ! తనజాతిబల్లి గాని, తనకంటె యెక్కవజాతి
బల్లిగాని, తనకుతగిన కాలమునందు తనమీఁదఁబడినచో శుభమగును.
క. రమణులకు నెడమ వైపు, ను
త్తమములు రోమములు లేని § తావునమఱి య
శ్రమను కుడివైపు పురుషుల
చెమరక పడెనేని శుభము § శిఖినరసింహా.109
తా. ఓ నరసింహస్వామి ! బల్లి పాటు స్త్రీలకు యెడమవైపు నందును,
రోమములు లేని తావునందును శుభము. వురుషులకు కుడి
వైపున శుభము.
క. కీడగును మీద పడి దిగఁ
గీడున్ మేలగును కాని § క్రియవెల్లనగున్
చూడఁగ పడి యెక్కినచో
క్ష్వేడ గళార్చిత పదాబ్జ § శిఖినరసింహా.110
తా. సింహనాదమును బొబ్బరించు కంఠముగల ఓ సరసింహ
స్వామీ! బల్లి మీదపడి క్రిందకు దిగినచో కీడగును. మీఁదపడి
పై కెక్కినచో కీడుగల్గి పిదప మేలును, కార్యసిద్ధియు గలుగును.