పుట:శకున శాస్త్రము అను శిఖి నరసింహ శతకము.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

36

శ కు న శా స్త్ర ము


క. ఆఱు నెల లగును భానుని
   వారమునన్ బడిన సోమ § వారమునబడన్
   తీరుగ తొమ్మిదిగడియలు (దినములు)
   శ్రీరమణా  ! బల్లి ఫలము § శిఖినరసింహా111

తా. ఓ శ్రీరమణా! నరసింహస్వామీ! బల్లి ఆదివారము నందు
పడినచో ఆఱు మాసములలోను, సోమవారమునందు
తొమ్మిది (గడియలు) దినములలోను తత్ఫలములు జరుగును.

క. ధారుణి సుతు వారంబున,
   నారయ నాదిననందె § నగుఫల చిన్నెల్
   మీఱి బుధవారమునఁబడఁ
   జేరు న్మానద్వయంబు § శిఖినరసింహా.112

తా. ఓ నరసింహస్వామీ! బల్లి పాటు మంగళవారమున జరిగి
నచో ఆదినమందును, బుధవారమున జరిగినచో రెండు మాసముల
లోను తత్ఫలము కలుగును.

క . గురువార మొక్క నెలకును,
    పరగఁగ భృగువారమందు § పక్షమునకగున్ ,
    ధర శని యందొకయేడగు,
    స్థిరగౌళి ఫలంబుఁ దెలియ § శిఖినరసింహా.113

తా. ఓ నరసింహస్వామి! బల్లి పాటు గురువారమున జరిగినచో
ఒకమాసమునకును, శుక్రవారమున జరిగినచో పదిహేను రోజులకును,
శనివారమున జరిగినచో ఒక సంవత్సరము నకును. తత్ఫలములుకలుగును

క . జుట్టుకొనఁబడిన మరణము,
    పట్టుగఁ బదునాల్గు నెలల § వరకు న్మఱి క,
    న్పెట్టగవలెఁ దాలిమితోఁ,
    జిట్టౌ బళగిరి విహార § శిఖినరసింహా.114