పుట:శకున శాస్త్రము అను శిఖి నరసింహ శతకము.pdf/44

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

శ కు న శా స్త్ర ము

37

తా. అహోబలగిరియందు విహరించే యో నరసింహస్వామీ!
జుట్టు కొనయందు బల్లి పడిన 14 నెలలలో మరణము గల్గును.

క. ఏవేళ బల్లి పడునో,
   యావెంటనే జలకమాడి § యడలక శుచివై ,
   గోవెలకుం జని దైవము,
   సేవించినఁ దొలఁగుఁ గీడు § శిఖినరసింహా.115

తా. ఓ నరసింహస్వామి! బల్లి తనమీఁద నెప్పుడు పడునో;
అప్పుడే స్నానము చేసి శుచియై దేవాలయమునకుఁ బోయి దేవుని
సేవించిన యెడల బల్లి పాటువలనఁ గల్గు కీడు సరిహారమగును.

క. పరిణయ మువనయనంబులు,
   జరుగని పసివారిపైన § సరిబల్లి పడన్ ,
   గురికొని తల్లికిఁ దండ్రికి ,
   స్థిరముగ నాఫలము లబ్బు § శిఖి నరసింహా.116

తా. పెండ్లి కానీ కన్నెలమీఁదను, వడుగుగానీ బాలుర మీదను,
బల్లిపడినచో ఆ ఫలములు వారి తల్లిదండ్రులకు సిద్ధించును.

విశేషాంశములు ఇక్కడనుం : 1 2, 4 ప్రతులలోను పద్యలారంభించబడినవి .

క. నడినెత్తిన రోగము కుడి,
   పెడతల భ్రాతలకుహాని § పెడతల నడుమన్ ,
   బడగౌళిపాటు తమ్ములు,
   చెడిపోవుట సత్యమండ్రు § శిఖి నరసింహా.117

తా. ఓ నరసింహస్వామీ! బల్లి నడినెత్తియందు పడినచో
రోగము, కుడి పెడతలయందు పడినచో సోదరులకు కీడు, పెడతల నడు
మఁబడినచో తమ్ములు చెడిపోవుట కలుగును.