పుట:శకున శాస్త్రము అను శిఖి నరసింహ శతకము.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ కు న శా స్త్ర ము

35


-:బల్లిపాటు తజ్జాతి తత్కాల ఫలములు :-

108 పద్యము లగాయితు 116 వ పద్యములవరకు ఒకటి రెండు నాల్గు ప్రతులలోలేవు

క. తనజాతి బల్లియైనన్ ,
   తన కెక్కువయైన బల్లి § తనకగు కాలం
   బున తనపైబడ శుభమగు,
   చినయోబళగిరి విహార § శిఖినరసింహా.108

తా. ఓనరసింహస్వామీ! తనజాతిబల్లి గాని, తనకంటె యెక్కవజాతి
బల్లిగాని, తనకుతగిన కాలమునందు తనమీఁదఁబడినచో శుభమగును.

క. రమణులకు నెడమ వైపు, ను
   త్తమములు రోమములు లేని § తావునమఱి య
   శ్రమను కుడివైపు పురుషుల
   చెమరక పడెనేని శుభము § శిఖినరసింహా.109

తా. ఓ నరసింహస్వామి ! బల్లి పాటు స్త్రీలకు యెడమవైపు నందును,
రోమములు లేని తావునందును శుభము. వురుషులకు కుడి
వైపున శుభము.

క. కీడగును మీద పడి దిగఁ
   గీడున్ మేలగును కాని § క్రియవెల్లనగున్
   చూడఁగ పడి యెక్కినచో
   క్ష్వేడ గళార్చిత పదాబ్జ § శిఖినరసింహా.110

తా. సింహనాదమును బొబ్బరించు కంఠముగల ఓ సరసింహ
స్వామీ! బల్లి మీదపడి క్రిందకు దిగినచో కీడగును. మీఁదపడి
పై కెక్కినచో కీడుగల్గి పిదప మేలును, కార్యసిద్ధియు గలుగును.