పుట:శకున శాస్త్రము అను శిఖి నరసింహ శతకము.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ కు న శా స్త్ర ము

34


ఓ నరసింహస్వామీ ! సూర్యోదయము లగాయితు 10 గడి
యలవఱకు సాత్విక కాలము, 11 గడియలు లగాయితు 20 గడియల
వజకు రాజనశాలము, 21 గడియలు లగాయితు 30 గడియల వఱకు
తామసకాలము, అగును.

క. ఆది నిశినైదుగడియలు
   పాదుకొనున్ సాత్వికంబు § పదివరకును నిం
   పాదిగ సాత్వికకాలము
   శ్రీదయితా! చెలఁగుచుండు § శిఖినరసింహా.105

క . ఓ లక్ష్మీనాథా! నరసింహస్వామి! రాతి 1 గడియలగా
యితు 5 గడియలవఱకు పాదుకొని ఆపై ని 10 గడియలవరకు అనఁగా
15 గడియలవరకు సాత్విక కాలము,

క. పదియేను మొదలుగా, ని
   ర్వది వఱకును తామసంబు § పదపడి, యటు ని
   ర్వదియైదు రాజసంబగు,
   చెదరున్ సత్వంబు తుదికి § శిఖినరసింహా.106

తా. ఓనరసింహస్వామీ! సౌత్విక కాలముగా 15 గడియలు
పోను 16 గడియల లగాయితు 20 గడియలవఱకు తామసకాలము,
21 గడియలు మొదలు 25 గడియలవఱకు రాజసకాలము, మిగిలిన
కాలము సాత్వికములో చేరుసు.

క. ఆయాజతుల గౌళుల
   కాయా వారములు కాల § మగునేని, నిజం
   బాయా ఫలములఁ దప్పకఁ,
   జేయు నిలన్ బల్లిపాటు § శిఖినరసింహా.107

తా. ఓ నరసింహస్వామి ! ఆయాజూతుల బల్లులకు, ఆయావారము
లు, తగినకాలము లయినచో తప్పకుండా, ఆయా ఫలములుగల్గును.