28
శ కు న శా స్త్ర ము
క. చాకిత, గాండ్లది, చిప్పెది
మూకది నెఱుకలది, మొండి § ముక్కిడి వారల్
యేకడఁ దుమ్మిన, దుఃఖమె,
చేకూడదు ఫల మొకింత § శిఖినరసింహా,86
తా. ఓ నరసింహా! చాకల స్త్రీ, గాండ్ల స్త్రీ, కుట్రఫు స్త్రీ, మూగ స్త్రీ
ఎఱుకల స్త్రీ, మొండి స్త్రీ, ముక్కిడి స్త్రీ, మున్నగువారు తుమ్మినచో,
దుఃఖముగల్గి ఫలనాశన మగును.
క. నాలుగు పదముల జీవము
లాలోచన లవుడుఁబయన § మౌనెడఁ దుమ్మున్
వాలాయము మరణాంతము,
శ్రీలోలాళప్పదండ్రు § శిఖినరసిఁహా.87
తా• ఓ నరసింహస్వామి ! నాలుగు కాళ్ళజంతువులు, ఏదైన
ఆలోచించునప్పుడుగాని ప్రయాణమై పోనప్పుడుగాని తుమ్మినచో మర
ణము కలుగును.
--- [1]తొండ పాటు ఫలము :---
క. ముక్కున వ్యాధినివారణ,
మక్కర మృష్టాన్న భుక్తి § యగువక్షముపై
నెక్కిన నెడభూషణములు,
చిక్కును మఱి భుజములందు § శిఖినరసింహా.88
తా. ఓనరసింహస్వామి! తొండ ముక్కు మీఁడ వడిన యెడల
రోగము కుదురును. వక్షముమీఁద పడిన మృష్టాన్న భోజనము.
భుజముల పై పాకిన భూషణాలంకార ప్రాప్తి గల్గును.
- ↑ కొన్నిప్రతులలో ఈ భాగమునకుముందే బల్లిపాటుగలదు