పుట:శకున శాస్త్రము అను శిఖి నరసింహ శతకము.pdf/35

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

28

శ కు న శా స్త్ర ము


క. చాకిత, గాండ్లది, చిప్పెది
   మూకది నెఱుకలది, మొండి § ముక్కిడి వారల్
   యేకడఁ దుమ్మిన, దుఃఖమె,
   చేకూడదు ఫల మొకింత § శిఖినరసింహా,86

తా. ఓ నరసింహా! చాకల స్త్రీ, గాండ్ల స్త్రీ, కుట్రఫు స్త్రీ, మూగ స్త్రీ
ఎఱుకల స్త్రీ, మొండి స్త్రీ, ముక్కిడి స్త్రీ, మున్నగువారు తుమ్మినచో,
దుఃఖముగల్గి ఫలనాశన మగును.

క. నాలుగు పదముల జీవము
   లాలోచన లవుడుఁబయన § మౌనెడఁ దుమ్మున్
   వాలాయము మరణాంతము,
   శ్రీలోలాళప్పదండ్రు § శిఖినరసిఁహా.87

తా• ఓ నరసింహస్వామి ! నాలుగు కాళ్ళజంతువులు, ఏదైన
ఆలోచించునప్పుడుగాని ప్రయాణమై పోనప్పుడుగాని తుమ్మినచో మర
ణము కలుగును.

--- [1]తొండ పాటు ఫలము :---

క. ముక్కున వ్యాధినివారణ,
   మక్కర మృష్టాన్న భుక్తి § యగువక్షముపై
   నెక్కిన నెడభూషణములు,
   చిక్కును మఱి భుజములందు § శిఖినరసింహా.88

తా. ఓనరసింహస్వామి! తొండ ముక్కు మీఁడ వడిన యెడల
రోగము కుదురును. వక్షముమీఁద పడిన మృష్టాన్న భోజనము.
భుజముల పై పాకిన భూషణాలంకార ప్రాప్తి గల్గును.

  1. కొన్నిప్రతులలో ఈ భాగమునకుముందే బల్లిపాటుగలదు