పుట:శకున శాస్త్రము అను శిఖి నరసింహ శతకము.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ కు న శా స్త్ర ము

29

క. శిరమున భయమగు, లక్ష్మీ
   కరమగు వలనొసలిమీఁద § గడుభూషణముల్ ,
   నిరు చెవులఁ గంట దుఃఖము,
   సిరి వరదా! తొండ పాటు § శిఖినరసింహా,89

తా. ఓ లక్ష్మీశా! నరసింహస్వామి! తొండ శిరస్సుమీఁద వడిన
భయము, కుడినొసలిమీద పడిన లక్ష్మీప్రదము, రెండు చెవుల
మీద పడిన దుఃఖము కలుగును.

క. చేతుల [1] నాప్తుల కాపద,
   నాతుల చుట్టముల దర్శ § నము కడుపుపయిన్ ,
   ఖ్యాతిగఁ బిరుదుల పైఁబడ,
   సీతాపతి లాభమండ్రు § శిఖినరసింహా.90

తా. ఓ సీతాపతీ! నరసింహస్వామి! తొండ చేతులమీఁద పడిన
మిత్రుల కాపదయు, కడుపు మీదపడిన స్త్రీలను చుట్టములను జూచు
టయు,పిరుదుల పైఁబడిన లాభముగల్గును.

క. తొడలను కాళ్ళను రోగం,
   బెడమ కడన్ దేహమందు § నెపుడు ధనంబున్ ,
   కుడిపార్శ్వము ధనహానియు,
[2] చెడుగులగును ముఖమునందు,§ శిఖినరసింహా,91

తా. ఓ నరసింహస్వామి! తొండ తొడమీదనుగాని కాళ్ళమీ
దనుగాని పడిన రోగమును, దేహమునం దెడమవైపున పడిన సన
మును, దేహమునందు కుడివైపున పడిన ధన హానియును, ముఖము
నందు పడిన చెడుగులును కలుగును.

  1. ఆవులకాపద:- వేరే ప్రతిలోగలదు.
  2. చెడివచ్చును. 2 చెడుగలుగును. అని పాఠాంతరములు,