పుట:శకున శాస్త్రము అను శిఖి నరసింహ శతకము.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ కు న శా స్త్ర ము

27


తా. ఓనరసింహస్వామి! లేచుచు తుమ్మిన శుభము, కూర్చుండి
గాని, నీటి దగ్గఱనుండిగాని, గొణుగుచుఁగాని, కలహించుచుగాని,
తుమ్మినచో కార్యహాని గల్గును.

క. ఇనుమును వెండియు ముట్టిన
   గనుఁగొనఁజెడుఁ గార్యమెల్లఁ § గంచునుతామ్ర
   మ్మును జయము తుమ్ముచునుహె
   చ్చిన నది నంటక శుభంబు § శిఖినరసింహా.83

తా. ఓ నరసింహస్వామీ! ఇనుమును, వెండిని తాఁకినను చూచి
నను కార్యము చెడిపోవును. కంచును, రాగిని తాకినను చూచిన
జయముకల్గును, తుమ్మిన పిమ్మట పై వానిని తాకిన శుభము గల్గును,

క .పసిబాల శిశువు లంజెయు,
   వసగల బాలింతతుమ్ము § బంగారు సుమీ,
   వెస మాలకుంటి [1]క్షుతమెన
   సిన బహుకార్యసిద్ధి § శిఖినరసింహా.84

తా. ఓ నరసింహస్వామీ! పసిబాల, శిశువు, భోగముది, బాలెంత
రాలు, వీరు తుమ్మినచో మంచిది. నీచజాతివాడు, కుంటివాఁడు,
వీరలు తుమ్మిన కార్యసిద్ధి కలుగును.

క. తొత్తును గర్భిణి గొడ్డును
   ముత్తైదువు విధవ గుడ్డి § ముండల, తుమ్ముల్
   గుత్తగ మరణాంతము, నీ
   చిత్తము దయసేయుమయ్య § శిఖినరసింహా.85

తా.ఓ నరసింహస్వామీ! బానిస, గర్భిణిస్త్రీ, గొడ్రాలు, ముత్తై
దువు, విధవ, గ్రుడ్డి ముండలు, వీరి తుమ్ములు మరణము కలుగ జేయును.

  1. క్షుతమైన,వినుమీ అని పొఠాంతరము గణము తప్పినది, క్షుతము- తుమ్ము