26
శ కు న శా స్త్ర ము
క. తుమ్ముచుఁ దగ్గుచు నడిచిన,
నెమ్మది శయనించి యుమియ § నిజమగు బహురో,
గమ్ములఁ బాయని జడిగా
జిమ్మును తుమ్ముల ఫలంబు § శిఖినరసింహా,79
తా. ఓ నరసింహస్వామీ! తుమ్ముచు, దగ్గుచు, నడచినను, పరుండ
ఉమ్మివేసినను, అనేక వ్యాధులు సంప్రాప్త మగును,
క. లేచిన మొసలిం జూచిన
[1] జూచిన బంగారు ఫలము § సుదతుల నటనల్
జూచిన వీడ్యముఁ జేసిన
శ్రీచతురా తుమ్ము ఫలము § శిఖినర సింహా.80
తా. ఓ నరసింహస్వామి ! మొసలిని, బాంగారును, పండ్లను, స్త్రీ
నాట్యమును, చూచినను, తాంబూలము వేసికొన్నను, తుమ్మువలని
దోషము హరించును.
క. ఇలఁ గోకినఁగడ కేగినఁ
దలఁ గోకినఁ జింతసేయ § దడఁబడ జీదన్
బలుకష్టము తుమ్మిన తఱి
శిలలైనం గష్టపడును § శిఖినరసింహా.81
తా. ఓ నరసింహస్వామి! తుమ్ముచు భూమి గోకినను, అవతలకుఁ
బోయినను, తలఁగోకికొన్నను, చింతగానున్న, తడబడినను, చీదినను,
రాళ్లకైనను కష్టమువచ్చును.
క. లేచిన శుభమగుఁ దుమ్ముచుఁ
గూర్చుండిన నీళ్లకడను § గొణుగుచు నుండన్
నాచుక జగడముఁ జేసిన
శ్రీచతురా! కార్యహాని § శిఖినరసింహా,82
- ↑ దాచిన బంగారు ఫలము తరుణలనటనల్